హోమ్ /వార్తలు /బిజినెస్ /

US visa: అమెరికా వెళ్లాలనుకునే వారికి బ్యాడ్‌ న్యూస్‌.. 1000 రోజులు వెయిట్ చేయాల్సిందే

US visa: అమెరికా వెళ్లాలనుకునే వారికి బ్యాడ్‌ న్యూస్‌.. 1000 రోజులు వెయిట్ చేయాల్సిందే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

US Visa: డాలర్​ డ్రీమ్స్​ నెరవేర్చుకోవడానికి చాలా మంది భారతీయులు అమెరికాకు వెళ్తుంటారు. ఇటీవల అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య పెరిగింది. దీంతో అన్ని రకాల వీసా ఇంటర్వూల వెయిటింగ్ పీరియడ్​ పెరుగుతూనే ఉంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

US visa interview:  డాలర్​ డ్రీమ్స్​ నెరవేర్చుకోవడానికి చాలా మంది భారతీయులు అమెరికా (America)కు వెళ్తుంటారు. ఇటీవలి కాలంలో అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో అన్ని రకాల వీసా ఇంటర్వూల వెయిటింగ్ పీరియడ్ (Visa Interviews Waiting Time)​ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా బి1 (బిజినెస్), బి2 (పర్యాటక) వీసాలకు ఎక్కువ సమయం పడుతోంది. దీనికి సంబంధించి మంగళవారం యూఎస్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ (US State Department) ఓ రిపోర్టు విడుదల చేసింది. ఈ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* వారు 2025 చివరి వరకు వేచి ఉండాల్సిందే

టూరిస్ట్ వీసా ( B1/B2) కోసం వెయిటింగ్ పీరియడ్ రెండు నెలల వరకు ఉందని యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది. B1/B2 దరఖాస్తుదారుల వెయిటింగ్ పీరియడ్​ ముంబైలో 999 రోజులు, హైదరాబాద్‌(Hyderabad) 994, ఢిల్లీలో 961, చెన్నైలో 948, కోల్‌కతాలో 904గా ఉన్నట్లు చెప్పింది. మొదటిసారి టూరిస్ట్​ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు లేదా భారతదేశంలో డ్రాప్ బాక్స్ (ఇంటర్వ్యూ మినహాయింపు) కోసం అర్హత పొందని దరఖాస్తుదారులకు వెయిటింగ్ పీరియడ్ మూడు సంవత్సరాల వరకు ఉంది. మొదటిసారి B1/B2 దరఖాస్తుదారులు 2025 చివరి వరకు ఇంటర్వ్యూ కోసం వేచి చూడక తప్పదు.

* చర్యలు ప్రారంభించిన యూఎస్‌

వెయిటింగ్​ పీరియడ్​ తగ్గించేందుకు అమెరికా ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఇక్కడ ఉన్న బ్యాక్‌లాగ్, కొత్త దరఖాస్తుల సంఖ్యను బట్టి, ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ వెయిట్ పీరియడ్ తగ్గించడం కష్టంగా మారిందని కాన్సులేట్​ అధికారులు చెబుతున్నారు. 2022 నవంబర్ నాటికి, టూరిస్ట్ వీసా (B1/B2) ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ కోసం వెయిటింగ్​ పీరియడ్​ రెండు నెలలుగా ఉంది. అత్యవసర అపాయింట్‌మెంట్లు మాత్రం కొన్ని రోజుల్లోనే పరిష్కారమవుతాయి.

Car Offer: వారెవ్వా అదిరే ఆఫర్.. కారు కొంటే రూ.30 వేల డిస్కౌంట్! ధర మారుతీ స్విఫ్ట్, టాటా పంచ్ కన్నా తక్కువే!

ఢిల్లీలోని యూఎస్‌ ఎంబసీకి చెందిన సీనియర్ అధికారి మాట్లాడుతూ.. భారతదేశంలో వీసా ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు ఎక్కువ మందికి ఇంటర్వ్యూ మినహాయింపు ఇవ్వడం, డ్రాప్ బాక్స్ కేసులను విదేశాలకు పంపడం, తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవడం వంటి విధానాలను అనుసరిస్తున్నామన్నారు. భారతదేశంలోని యూఎస్​ కాన్యులేట్లలో సిబ్బంది కొరత ఉందని, అధిగమించి త్వరగా వీసా ప్రాసెస్‌లు పూర్తి చేస్తామన్నారు. భారతదేశంలో దాదాపు 1,000 రోజుల ఇంటర్వ్యూ నిరీక్షణ సమయాన్ని ఎదుర్కొంటున్న వారిని ఉద్దేశించి.. దరఖాస్తు చేసుకుంటూ ఉండాలని, లైన్ కదలడం ప్రారంభించి, వెయిటింగ్​ పీరియడ్ తగ్గిన తర్వాత, ఎలాంటి రుసుము లేకుండా ఇంటర్వ్యూ తేదీని షెడ్యూల్​ చేసుకోవచ్చని చెప్పారు.

యుఎస్ వీసాల కోసం చాలా మంది దరఖాస్తుదారులు వ్యక్తిగతంగా హాజరుకావాలని చట్టం చెబుతోందని, విదేశీ కాన్సులర్ విభాగాలు స్థానిక కరోనా పరిస్థితులు, పరిమితుల దృష్ట్యా వీసా ఇంటర్వూ స్లాట్లను తక్కువగా అందుబాటులోకి తెస్తున్నాయని యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది. ఇప్పుడు చాలా దేశాలు కరోనా ఆంక్షలను ఎత్తివేశాయి, మా దౌత్యకార్యాలయాలు, కాన్సులేట్‌లలో 96% సాధారణ వీసా సేవలను అందిస్తున్నాయని పేర్కొంది. కరోనా సమయంలో వచ్చిన దరఖాస్తులతో పాటు కొత్తగా వస్తున్న దరఖాస్తులను పరిశీలించేందుకు ఎక్కువ సమయం పడుతున్నట్లు చెప్పింది. త్వరగా వీసాలను మంజూరు చేయడానికి US ఫారిన్ సర్వీస్ సిబ్బందిని రెట్టింపు చేసినట్లు వివరించింది. ప్రస్తుతం వీసా ప్రాసెసింగ్ వేగంగా పుంజుకుంటోందని, 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రీ-పాండమిక్ వీసా ప్రాసెసింగ్ స్థాయిలను చేరుకుంటామని భావిస్తున్నట్లు తెలిపింది. అధిక వీసా అపాయింట్‌మెంట్ వెయిట్ టైమ్‌లు ఉన్న కాన్సులేట్​ల నుంచి అదనపు కెపాసిటీ ఉన్న ఇతర కాన్సులేట్లకు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా వర్క్‌లోడ్‌లను ఎలక్ట్రానిక్ రీడిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపింది.

First published:

Tags: Amercia, Us news, USA, Visa

ఉత్తమ కథలు