BAD CREDIT REFERS TO A LOW CREDIT SCORE OR A SHORT CREDIT HISTORY MK GH
Personal loans: చిన్న చిన్న అవసరాలకే పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా...అయితే ఇది మీ కోసం...
ప్రతీకాత్మకచిత్రం
ఆర్థిక మందగమనం వల్ల పండుగ ఖర్చుల కోసం కొంతమంది పర్సనల్ లోన్ల వైపు మొగ్గు చూపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమ్మకాలను పెంచుకోవడానికి వివిధ సంస్థలు ప్రకటించిన ఆఫర్లను సొంతం చేసుకోవడానికి చాలామంది ప్రజలు బ్యాంకులు అందించే పర్సనల్ లోన్ తీసుకున్నారు.
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. మన దేశంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మహమ్మారి ప్రభావం, లాక్డౌన్ వల్ల చాలామంది ప్రజలు ఖర్చులు తగ్గించారు. పండుగ సీజన్ భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో కొంత మేలు చేసిందని చెప్పుకోవచ్చు. ఆర్థిక మందగమనం వల్ల పండుగ ఖర్చుల కోసం కొంతమంది పర్సనల్ లోన్ల వైపు మొగ్గు చూపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమ్మకాలను పెంచుకోవడానికి వివిధ సంస్థలు ప్రకటించిన ఆఫర్లను సొంతం చేసుకోవడానికి చాలామంది ప్రజలు బ్యాంకులు అందించే పర్సనల్ లోన్ తీసుకున్నారు. లేదా క్రెడిట్ కార్డులను లిమిట్‌కు మించి ఉపయోగించారు. ఇలాంటి లోన్లపై ఆర్థిక సంస్థలు విధించే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వినియోగదారులు తక్కువ వడ్డీ రేట్లు ఉండే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై ఇచ్చే లోన్లు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్లు, టాప్ అప్ హోమ్ లోన్లపై ఇచ్చే లోన్లను ఎంచుకోవాలి. ఆ తరువాత అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పర్సనల్ లోన్లను ఎంచుకోవాలి.
ప్రభుత్వ బ్యాంకులే మేలు
పర్సనల్ లోన్‌ను ఆఖరి లోన్ ఆప్షన్‌గా మాత్రమే వినియోగదారులు భావించాలి. ఇందులోనూ తక్కువ వడ్డీతో వ్యక్తిగత రుణాలను అందించే బ్యాంకులను ఎంచుకోవాలి. ఈ జాబితాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిగతా బ్యాంకులకంటే ముందుంది. ఐదేళ్ల గడువుతో రూ.5 లక్షల వరకు తీసుకునే లోన్‌పై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.9 శాతం వడ్డీని విధిస్తోందని బ్యాంక్‌బజార్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ తరువాతి స్థానంలో ఉన్నాయి. ఈ రెండు బ్యాంకులూ 8.95 శాతం వడ్డీ రేట్లతో పర్సనల్ లోన్లు ఇస్తున్నాయి. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.5 లక్షల పర్సనల్ లోన్‌పై 9.6 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తోంది.
లిస్టెడ్ బ్యాంకుల డేటా మాత్రమే...
వడ్డీ రేట్లను పోల్చడానికి బీఎస్ఈలో నమోదైన లిస్టెడ్ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల డేటానే బ్యాంక్ బజార్ పరిగణనలోకి తీసుకుంది. వెబ్సైట్లలో సరైన సమాచారం అందుబాటులో ఉంచని బ్యాంకుల డేటాను పరిగణనలోకి తీసుకోలేదు. నవంబర్26 నాటికి సంబంధిత బ్యాంకుల వెబ్సైట్ల నుండి బ్యాంక్ బజార్ ఈ డేటాను సేకరించింది. ఐదేళ్ల గడువుతో రూ.5 లక్షల లోన్‌పై వడ్డీని పోల్చి, వడ్డీ రేటు ఆధారంగా EMIని లెక్కించింది. బ్యాంకుల నిబంధనలు, షరతులను బట్టి వడ్డీరేట్లు మారవచ్చు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.