Ruchi Soya FPO: బాబా రామ్‌దేవ్‌ రుచి సోయా సంస్థకు రూ.4300 కోట్ల FPO.. వచ్చే వారం నుంచి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం

ప్రతీకాత్మకచిత్రం

రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పతంజలి గ్రూపులో భాగమైన రుచి సోయా ఇండస్ట్రీస్‌ ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(FPO)కు సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) పచ్చ జెండా ఊపింది. ఈ సంస్థ ఎఫ్‌పీఓను రూ.4300 కోట్లకు ఆమోదించింది. వచ్చే వారం నుంచి ఈ కంపెనీ FPO ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది.

  • Share this:
రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పతంజలి గ్రూపులో భాగమైన రుచి సోయా ఇండస్ట్రీస్‌ ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(FPO)కు సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) పచ్చ జెండా ఊపింది. ఈ సంస్థ ఎఫ్‌పీఓను రూ.4300 కోట్లకు ఆమోదించింది. వచ్చే వారం నుంచి ఈ కంపెనీ FPO ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది.

రుచి సోయా సంస్థ జూన్‌లో సెబీకి ముసాయిదా పత్రాన్ని సమర్పించింది. సెక్యూరిటీ కాంట్రాక్ట్(రెగ్యులేషన్) రూల్స్ -1957 ప్రకారం లిస్టెడ్ ఎంటీటీలో సెబీ కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధన 25 శాతానికి అనుగుణంగా FPOను లాంచ్ చేశారు. ఈ నిబంధన ఫలితంగా FPO ప్రమోటర్లు కనీసం 9 శాతం వాటాను విలీనం చేయాలి. కంపెనీలో ప్రమోటర్ గ్రూప్ 98.90 శాతం వాటాను కలిగి ఉంది. కాబట్టి సెబీ నిబంధనలకు అనుగుణంగా కంపెనీ 25 శాతం కనీసం పబ్లిక్ షేర్ హోల్డింగ్ బెంచ్ మార్క్ సాధించడానికి ప్రమోటర్ వాటాను తగ్గించాల్సిన అవసరముంది. సంస్థ తన వాటాను 75 శాతానికి తగ్గించడానికి 2022 డిసెంబరు వరకు గడువు ఉంది.

ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) తరువాత కంపెనీలు ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్‌ (FPO)కు వెళ్లే అవకాశం ఉంటుంది. కంపెనీ ఆఫర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సంబంధిత సంస్థ రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి చెల్లించడానికి, ప్రీపేమెంట్ల కోసం ఉపయోగిస్తారు. మిగిలిన ఆదాయాలు, మూలధన అవసరాలు ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల నిధుల కోసం ఉద్ధేశించినవి. FPOలో దాదాపు 60 శాతం కంపెనీ రుణాలను తీర్చడానికి ఉపయోగించే అవకాశముంది. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం మిగిలిన 40 శాతంలో 20 శాతం ఇతర లక్ష్యాల నిధుల కోసం డివిజన్లుగా విభజిస్తారు.

ఈ ఆఫర్లో కంపెనీ ప్రమోటర్లు.. ఆచార్య బాలకృష్ణ, రామ్ భరత్, స్నేహలత భరత్, పతంజలి ఆయుర్వేద లిమిటెడ్, పతంజలి పరివాహన లిమిటెడ్, దివ్య యోగ మందిర ట్రస్ట్, పతంజలి గ్రామోద్యోగ నాయస్, రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ లబ్ధిదారుల ట్రస్ట్, యోగక్షేమ సంస్థాన్, వేదిక్ బ్రాడ్ కాస్టింగ్ లిమిటెడ్, పతంజలి పేయ ప్రైవేట్ లిమిటెడ్, పతంజలి నేచురల్ బిస్కెట్స్ లిమిటెడ్, వైదిక్ ఆయుర్మెడ్ ప్రైవేట్ లిమిటెడ్, సంస్కార్ ఇన్ఫో టీవీ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి పలు సంస్థలు ఉన్నాయి.

2019లో కొనుగోలు..
రుచి సోయా సంస్థను 1986లో ఏర్పాటు చేశారు. భారత్‌లో తినదగిన నూనెల విభాగానికి(ఎడిబుల్ ఆయిల్ సిగ్మెంట్) సంబంధించిన ప్రముఖ FMCH బ్రాండ్లలో ఈ సంస్థ ఒకటిగా నిలిచింది. సోయా ఆహార పదార్థాల అతిపెద్ద దేశీయ తయారీదారుల్లో ఇది కూడా ఒకటి. పామ్ ప్లాంటేషన్లలో శక్తిమంతమైన ఉనికిని కలిగి ఉంది. ఈ కంపెనీని 2019లో పతంజలి ఆయుర్వేద సంస్థ రూ. 4350 కోట్లకు దివాలా ప్రక్రియలో కొనుగోలు చేసింది. రుచి సోయా ప్రధానంగా పామ్, సోయా విభాగాల్లో ఫార్మ్-టూ-ఫోర్క్ బిజినెస్ మోడల్‌తో పనిచేస్తుంది
Published by:Krishna Adithya
First published: