రిలయన్స్ గ్రూప్ కు(Reliance Group) చెందిన ప్రీమియం ఫ్యాషన్(Fashion), లైఫ్ స్టైల్ బ్రాండెడ్ స్టోర్ అజార్ట్(AZORTE) హైదరాబాద్ (Hyderabad)లో ప్రారంభం అయింది. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ(High-tech City) సమీపంలోని కొండాపూర్(Kondapur) వద్ద ఈ స్టోర్ ని ప్రారంభించారు. కొండాపూర్ లో ఫేమస్ అయిన శరత్ సిటీ కేపిటర్ మాల్ లో ఈ బ్రాండెడ్ స్టోర్ ను ఏర్పాటు చేసినట్లు రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రీమియం ఫ్యాషన్ మరియు లైఫ్‌స్టైల్ బ్రాండ్ AZORTE కు సంబంధించి ఇది మూడో స్టోర్ గా పేర్కొన్నారు. మొదటిది కొంత కాలం క్రితం బెంగళూరులోని ఎంజీ రోడ్ లో ఏర్పాటు చేశారు. రెండో స్టోర్ అనేది నవీ ముంబయ్ లో ఏర్పాటు చేశారు. తర్వాత మూడో స్టోర్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు.
సమీప భవిష్యత్ లో దేశవ్యాప్తంగా ఈ అజార్ట్ బ్రాండ్ స్టోర్లను విస్తరించనున్నట్లు రిలయన్స్ రిటైల్ వెల్లడించింది. ఇక ఈ స్టోర్ హైదరాబాద్ లో దాదాపు 18,000 చదరపు అడుగుల రిటైల్ స్థలంలో విస్తరించి ఉంది. ఈ స్టోర్ లో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా లైఫ్ స్టైల్ ఉత్పత్తులు ఉన్నాయి.
ఈ స్టోర్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వినూత్నమైన ఫ్యాషన్ ఉత్పత్తులు ఉన్నాయి. భారతీయ ఫ్యాషన్ కు అనుగుణంగా హైదరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో దేశీయ, విదేశీ బ్రాండ్లకు సంబంధించి దుస్తులు, షూలు, పాదరక్షలు, ఫ్యాషన్ ఉపకరణాలు, హోమ్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఒరిజినల్ స్టైల్ లకు సంబంధించి వివిధ రకాలు వస్తువులు ఉన్నట్లు తెలిపారు.
ఫ్యాషన్-ఫార్వర్డ్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. వినియోగదారుడికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. కొత్త స్టోర్ ఫార్మాట్‌లో స్మార్ట్ ట్రయల్ రూమ్స్, ఫ్యాషన్ డిస్కవరీ స్టేషన్స్, సెల్ఫ్ చెకౌట్ కియాస్క్స్ లాంటి అనేక టెక్-ఎనేబుల్ సౌకర్యాలు ఉంటాయి. స్మార్ట్ ఫిట్టింగ్ రూమ్‌లు వినియోగదారుల లుక్‌ని మరింత అందంగా చూపించడంలో సహాయపడతాయి. షాపింగ్ పూర్తికాగానే బిల్ కట్టే విషయంలో క్యూలో నిల్చోకుండా.. స్వీయ-చెక్‌అవుట్ లేదా మొబైల్ చెక్‌అవుట్‌ని ఎంచుకునే వీలు కల్పించారు. ఆన్‌లైన్ స్టోర్ ద్వారా మీరు షాపింగ్ చేయాలనుకుంటే.. AZORTE వెబ్ సైట్ ను azorte.ajio.com సందర్శించొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Reliance, Reliance retail