Azim Premji: అజీమ్ ప్రేమ్‌జీ ధాతృత్వం... రూ.52,750 కోట్ల విరాళం

Azim Premji Foundation | ప్రభుత్వ స్కూళ్లల్లో నాణ్యమైన, సమానమైన విద్య అందేందుకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ కృషి చేస్తోంది. తెలంగాణతో పాటు కర్నాటక, ఉత్తరాఖండ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, పుదుచ్చెరి, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది.

news18-telugu
Updated: March 14, 2019, 12:40 PM IST
Azim Premji: అజీమ్ ప్రేమ్‌జీ ధాతృత్వం... రూ.52,750 కోట్ల విరాళం
Azim Premji: అజీమ్ ప్రేమ్‌జీ ధాతృత్వం... రూ.52,750 కోట్ల విరాళం (File Photo: Azim Premji)
  • Share this:
దశాబ్దాల పాటు సంపాదించినదాంట్లో వేల కోట్లు విరాళాలు ఇచ్చినవారి గురించి మనం వింటూనే ఉంటాం. ఇలాంటి వారిలో బిల్ గేట్స్, వారెన్ బఫెట్ ముందుంటారు. ఇప్పుడు ఆ జాబితాలో విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ కూడా చేరిపోయారు. ధాతృత్వం పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. బుధవారం ఆయన ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.52,750 కోట్ల(7.5 బిలియన్ డాలర్లు) విలువైన విప్రో షేర్లను అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. అజీమ్ ప్రేమ్‌ జీ ధాతృత్వానికి సంబంధించి విప్రో ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. 'భారతదేశంలో సమానమైన, సుస్థిరమైన మానవ సమాజం అభివృద్ధికి దోహదపడేందుకు అజీమ్ ప్రేమ్‌జీ ధాతృత్వ కార్యకలాపాలు కృషి చేస్తున్నాయి. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ విద్యారంగంపై దృష్టిపెడుతుంది. విభిన్న రంగాల్లో కృషి చేస్తున్న లాభాపేక్ష లేని సంస్థలకు చేయూతనిస్తుంది' అన్నది ఆ ప్రకటన సారాంశం.

ప్రభుత్వ స్కూళ్లల్లో నాణ్యమైన, సమానమైన విద్య అందేందుకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ కృషి చేస్తోంది. తెలంగాణతో పాటు కర్నాటక, ఉత్తరాఖండ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, పుదుచ్చెరి, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. బెంగళూరులో అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ కూడా ఉంది. తన సేవా కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేసేందుకు అజీమ్ ప్రేమ్‌జీ ఇప్పుడు ఏకంగా రూ.52,750 కోట్లు విరాళాన్ని ప్రకటించడం విశేషం. దీంతో ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన విరాళాలు రూ.1,45,000 కోట్లు. ఆయన గతంలో కూడా అనేక విరాళాలు ఇచ్చారు.

Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...




ఇవి కూడా చదవండి:

Election 2019: ఓటరు జాబితాలో మీ పేరు లేదా? దరఖాస్తుకు 3 రోజులే గడువు... ఇలా అప్లై చేయండి

Facebook: మీ ఫేస్‌బుక్ ఎక్కడెక్కడ లాగిన్ చేశారో తెలుసా? హ్యాక్ అయితే ఇలా చేయండిAlert: కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తున్నారా? మోసపోతారు జాగ్రత్త
First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>