దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు (Independence Day 2022) వైభవంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఊరూ వాడా మువ్వన్నెల జెండా రెపరెపలే కనువిందు చేస్తున్నాయి. తిరంగా ర్యాలీలను (Tiranga Rally) దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని తమ దేశ భక్తిని చాటుతున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం వీరోచితంగా పోరాటం చేసిన అమరులకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సైతం స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రతీ రోజు ఓ కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేసింది తెలంగాణ సర్కార్. ఈ రోజు వేడుకల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సాంస్కృతిక సారధి కళాకారులచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమం నిర్వహించింది. శనివారం ట్యాంక్‌బండ్‌పై టీఎస్ఆర్టీసీ గ్రాండ్ బస్ పరేడ్ నిర్వహించింది. ఈ వేడుకల్లో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే.. ఈ వేడుకల్లో 1932 కాలం నాటి అంటే నిజాం కాలం నాటి బస్సు నగర రోడ్లపై తిరుగుతూ చూపరులకు కనువిందు చేయడం విశేషం. మరో విశేషం ఏంటంటే.. ఈ పరేడ్ ను 1944లో ఆర్టీసీలో పనిచేసిన టీఎల్ నర్సింహా అనే ఆర్టీసీ మాజీ ఉద్యోగితో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు.
The ninety year old Albion classic bus was driven on Tank Bund to celebrate 75 years of India's independence @tsrtcmdoffice @TSRTCHQ pic.twitter.com/9xo16LtTPX
— Donita Jose (@DonitaJose) August 13, 2022
The @TSRTCHQ 's Albion bus actually works! Just look at that! It is a part of today's bus parade. pic.twitter.com/qistqqdfLs
— Syed Mohammed (@syedmohammedd) August 13, 2022
ఈ మినీ బస్సును లండన్‌కు చెందిన ఆల్బేనియం కంపెనీ తయారుచేసింది. ఇంకా ఈ బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో కలిపి మొత్తం 19 మంది ప్రయాణించవచ్చు. ఈ బస్సు 1932 ఏప్రిల్ 18న రిజిస్ట్రేషన్ చేశారు. ఈ బస్సు నంబర్ HYZ 223. అప్పట్లో ఇలాంటి 27 బస్సులను లండన్ నుంచి ముంబయికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో హైదరాబాద్‌కు నడుపుకుంటూ తీసుకువచ్చారు. 1932 జూన్ 15న నాటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ బస్సులను ప్రారంభించినట్లు రికార్డులు చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.