యాక్సిస్ మ్యూచువల్ ఫండ్(Axis Mutual Fund) తన హెడ్ ట్రేడర్, ఫండ్ మేనేజర్ వీరేష్ జోషి, ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్, ఫండ్ మేనేజర్ దీపక్ అగర్వాల్‌ను ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ నుంచి తొలగించింది. ఇందుకు ఫ్రంట్ రన్నింగ్(Front Running) ఆరోపణలు కారణంగా పేర్కొంటున్నారు.
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ (Axis Mutual Fund) తన హెడ్ ట్రేడర్, ఫండ్ మేనేజర్ వీరేష్ జోషి, ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్, ఫండ్ మేనేజర్ దీపక్ అగర్వాల్‌ను ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ (Fund management Team) నుంచి తొలగించింది. ఇందుకు ఫ్రంట్ రన్నింగ్(Front Running) ఆరోపణలు కారణంగా పేర్కొంటున్నారు. జోషి తన ఏడు ఈక్విటీ స్కీమ్‌ల (Equity schems) ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ నుండి బయటకురాగా, అగర్వాల్ణు మూడు ఫండ్స్ నుంచి తొలగించారు. ఆ ఏడు ఫండ్స్ ఇవే.. యాక్సిస్ కన్సంప్షన్ ఈటీఎఫ్, యాక్సిస్ బ్యాంకింగ్ ఈటీఎఫ్, యాక్సిస్ నిఫ్టీ ఈటీఎఫ్, యాక్సిస్ ఆర్బిట్రేజ్ ఫండ్, యాక్సిస్ క్వాంట్ ఫండ్, యాక్సిస్ టెక్నాలజీ ఈటీఎఫ్, యాక్సిస్ వాల్యూ ఫండ్.
ఫ్రంట్ రన్నింగ్ (Front Running)అనేది భవిష్యత్తులో షేర్ ధరను ప్రభావితం చేయగల ట్రాన్సాక్షన్స్ గురించి అంతర్గత పరిజ్ఞానం ఉన్న బ్రోకర్ స్టాక్ లేదా ఏదైనా ఇతర ఆర్థిక ఆస్తిపై చేసే ట్రేడింగ్. ఇన్వెస్టోపీడియా ప్రకారం.. తమ సంస్థ క్లయింట్లకు బయ్ లేదా సెల్ కాల్‌ను ఇస్తుందనే దానిపై కూడా అంతర్గత జ్ఞానం ఆధారంగా ఒక బ్రోకర్ ఫ్రంట్ రన్ చేయవచ్చు. ఇలాంటివి భారతదేశంలో చట్టవిరుద్ధం.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..
Axis AMC రెండు నెలలుగా (ఫిబ్రవరి 2022 నుంచి) సుమో మోటో విచారణను నిర్వహిస్తోంది. AMC విచారణలో సహాయం చేయడానికి ఎక్స్టెర్నల్ అడ్వైజర్లను ఉపయోగించింది. ప్రక్రియలో భాగంగా, అవకతవకలపై ఇద్దరు ఫండ్ మేనేజర్లను (Fund managers) సస్పెండ్ చేశారు. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ (Axis bank mutual funds)కు సంబంధించి ET నివేదిక.. చట్టపరమైన అవసరాలను తీవ్రంగా పరిగణిస్తామని, ప్రస్తుతానికి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు స్కీమ్‌లలో ఎలాంటి మార్పులు చేయకూడదని ప్లాన్ ఎహెడ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు విశాల్ ధావన్ పేర్కొన్నారని స్పష్టం చేసింది.
ధావన్ మాట్లాడుతూ..‘ప్రభావానికి గురైన అన్ని ఫండ్లను (Funds) మల్టిపుల్ మేనేజర్లను నిర్వహిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం భయాందోళనకు గురి కావడానికి కారణం కనిపించడం లేదు. పుకార్లు ధృవీకరించబడే వరకు, ఫండ్ హౌస్ నుండి ప్రకటన వచ్చే వరకు పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలో ఎటువంటి మార్పులు చేయకూడదు’ అని చెప్పారు.
మార్పులు ఇవే..
ఇంతకు ముందు సచిన్ జైన్, వీరేష్ జోషి, దేవాంగ్ షా యాక్సిస్ ఆర్బిట్రేజ్ ఫండ్‌కు ఫండ్ మేనేజర్లుగా ఉన్నారు. ఇప్పుడు కొత్త జట్టులో ఆశిష్ నాయక్, సచిన్ జైన్, దేవంద్ షా ఉన్నారు. యాక్సిస్ బ్యాంకింగ్ ఈటీఎఫ్‌లో వీరేష్ జోషి, ఆశిష్ నాయక్ ఫండ్ మేనేజర్లుగా ఉన్నారు. ఇప్పుడు వీరేష్ జోషిని తొలగించడంతో, ప్రస్తుతం ఆశిష్ నాయక్ మాత్రమే ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. యాక్సిస్ వినియోగ ఈటీఎఫ్ నిర్వాహకులు వీరేష్ జోషి, దీపక్ అగర్వాల్. ఇప్పుడు అక్కడ ఆశిష్ నాయక్ ఉన్నారు. యాక్సిస్ నిఫ్టీ ఈటీఎఫ్ బృందంలో ఆశిష్ నాయక్, వీరేష్ జోషి ఉన్నారు. ఇప్పుడు ఆశిష్ నాయక్ మాత్రమే ఉన్నారు. యాక్సిస్ క్వాంట్ ఫండ్‌లో దీపక్ అగర్వాల్ ఉన్నారు కానీ ఇప్పుడు.. ఆశిష్ నాయక్ మాత్రమే పని చేస్తున్నారు. యాక్సిస్ టెక్నాలజీ ఈటీఎప్ స్కీమ్‌లో.. జినేష్ గోపాని, వీరేష్ జోషి ఉన్నారు. ఇప్పుడు అక్కడ జినేష్ గోపానీ ఉన్నారు. యాక్సిస్ వాల్యూ ఫండ్ స్కీమ్ బృందం నుంచి దీపక్ అగర్వాల్‌ను తొలగించారు. ఇప్పుడు అక్కడ జినేష్ గోపానీ ఉన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.