హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank News: కస్టమర్లకు షాకిచ్చిన 2 ప్రముఖ బ్యాంకులు!

Bank News: కస్టమర్లకు షాకిచ్చిన 2 ప్రముఖ బ్యాంకులు!

Bank News: కస్టమర్లకు షాకిచ్చిన 2 ప్రముఖ బ్యాంకులు!

Bank News: కస్టమర్లకు షాకిచ్చిన 2 ప్రముఖ బ్యాంకులు!

Axis Bank | బ్యాంకులు కస్టమర్లకు ఝలక్ ఇచ్చాయి. రుణ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీని వల్ల రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Kotak Mahindra Bank | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ రుణ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించాయి. దీంతో కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే వారిపై ఎఫెక్ట్ పడనుంది. అలాగే ఇప్పటికే బ్యాంక్ (Bank) నుంచి లోన్ (Loan) తీసుకున్న వారిపై కూడా ప్రతికూల ప్రభావం పడనుంది. లోన్ తీసుకొని ఉంటే నెలవారీ ఈఎంఐ పైకి చేరుతుంది. అలాగే కొత్తగా లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తే.. అధిక వడ్డీ భారం మోయాల్సి వస్తుంది.

యాక్సిస్ బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును పెంచేసింది. ఎంసీఎల్ఆర్ రేటు 5 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు 8.6 శాతం నుంచి 8.95 శాతం మధ్యలో ఉంది. డిసెంబర్ నెలలో కూడా బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటును పెంచేసింది. అప్పుడు ఎంసీఎల్ఆర్ రేటు 30 బేసిస్ పాయింట్ల మేర పైకి కదిలింది.

డబ్బులు పంపిస్తే రూ.5 వేల క్యాష్‌బ్యాక్, ఉచిత సిమ్.. ఆఫర్ అదిరింది!

మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఎంసీఎల్ఆర్ రేటు పెంచేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు 10 నుంచి 30 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. ఇప్పటికే ఎంసీఎల్ఆర్ రేటు పెంపు అమలులోకి వచ్చింది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు 8.15 శాతం నుంచి 9.15 శాతం మధ్యలో ఉంది.

ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి బంపరాఫర్.. రూ.85 వేల భారీ తగ్గింపు, ఒక్కసారి చార్జ్ చేస్తే 450 కి.మి వెళ్లొచ్చు!

ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు అయితే 10 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీని వల్ల బ్యాంక్ లోన్ ఈఎంఐ పెరగనుంది. పర్సనల్ లోన్ , వెహికల్ లోన్, హోమ్ లోన్స్ వంటివి ప్రియం కానున్నాయి. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.15 శాతంగా ఉంది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ 8.4 శాతానికి చేరింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.55 శాతంగా ఉంది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.75 శాతంగా ఉంది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.95 శాతంగా ఉంది. ఇక రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 9 శాతంగా కొనసాగుతోంది. ఇక మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 9.55 శాతంగా ఉంది.

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రెపో రేటును పెంచుతూ రావడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. దీని వల్ల బ్యాంకులు కూడా వరుసపెట్టి ఎంసీఎల్ఆర్ రేటును పెంచుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే చాలా బ్యాంకులు రుణ రేట్లు పెంచేశాయి. దీంతో ప్రధానంగా హోమ్ లోన్ తీసుకున్న వారిపై ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు.

First published:

Tags: Axis bank, Banks, EMI, Home loan, Kotak Mahindra Bank, Mclr

ఉత్తమ కథలు