Coronavirus: దయచేసి బ్యాంకులకు రావద్దు యాక్సిస్ బ్యాంకు ఎండీ సూచన...

వీలైనంత ఎక్కువగా బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ యాప్‌లను వినియోగించుకోవాలని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు.

news18-telugu
Updated: March 21, 2020, 3:44 PM IST
Coronavirus: దయచేసి బ్యాంకులకు రావద్దు యాక్సిస్ బ్యాంకు ఎండీ సూచన...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్‌ అడ్డుకోవడం కోసం బ్యాంకులను వీలైనంత తక్కువగా సందర్శించాలని తమ ఖాతాదారులకు యాక్సిస్ బ్యాంక్ సూచించింది. వీలైనంత ఎక్కువగా బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ యాప్‌లను వినియోగించుకోవాలని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. సమిష్టిగా కరోనాను ఎదుర్కొందామని బ్యాంక్‌ ఎండీ అండ్‌ సీఈఓ అమితాబ్ చౌదరి తమ కస్టమర్లకు ఈ-మెయిల్స్‌ పంపారు. ఉద్యోగుల రక్షణ కోసం అన్ని శాఖల్లో ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే వివిధ కార్యకలాపాల కోసం ఇప్పటికే బ్యాంకులను కస్టమర్లు సందర్శించడం వల్ల బ్యాంకు ఉద్యోగులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, వీలైనంత వరకూ డిజిటల్ లావాదేవీలనే ఉపయోగించుకోవాలని ఇప్పటికే బ్యాంకు ఉద్యోగుల సంఘం కోరింది. అర్జంటు అవసరం అయితే తప్ప ఆన్ లైన్ వ్యవహారాల ద్వారానే చెల్లింపులు కొనసాగించాలని కోరింది. అలాగే ఏటీఎంల ద్వారా కరోనా సోకే ప్రమాదం ఉందని అందుకే ఫిజికల్ క్యాష్ నిల్వలపై ఆధారపడకుండా, డిజిటల్ వాలెట్స్ ద్వారా లావాదేవీలు జరిపితే ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
First published: March 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading