హోమ్ /వార్తలు /బిజినెస్ /

Banks: ఇంటి కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త.. బ్యాంక్ కొత్త సర్వీసులు!

Banks: ఇంటి కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త.. బ్యాంక్ కొత్త సర్వీసులు!

ఇంటి కొనుగోలుదారులకు బ్యాంక్ బంపర్ ఆఫర్

ఇంటి కొనుగోలుదారులకు బ్యాంక్ బంపర్ ఆఫర్

Home Buying | మీరు ఇల్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎక్కడికి వెళ్లకుండానే అన్ని సేవలు ఒకే చోటు పొందొచ్చు. దీని కోసం యాక్సిస్ బ్యాంక్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Home Loan | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) తాజాగా కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట కలుగనుంది. ఇల్లు కొనే వారు అన్ని సేవలను ఒకే చోటు పొందొచ్చు. అంటే ఇంటి రుణం (Home Loan) దగ్గరి నుంచి ప్రాపర్టీ, లీగల్ ఇష్యూలు ఇలా అన్ని సర్వీసులు కూడా ఒకే చోటు లభిస్తాయి. యాక్సిస్ బ్యాంక్ దీని కోసం స్వేర్ యార్డ్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

  యాక్సిస్ బ్యాంక్ తాజాగా స్వేర్ యార్డ్స్‌తో కలిసి రియల్ ఎస్టేట్ ఇంటిట్రేటెడ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఓపెన్ డోర్స్ పేరుతో ఈ సర్వీసులు తీసుకువచ్చింది. ఇది ఒక కోబ్రాండెడ్ హోమ్ బయర్ ఎకోసిస్టమ్. ఇందులో భాగంగా కస్టమర్లు ఇంటికి సంబంధించి సెర్చింగ్ దగ్గరి నుంచి బైయింగ్ వరకు అన్ని సేవలను ఒకే చోటు పొందొచ్చు. దీని వల్ల కొనుగోలుదారులకు చాలా శ్రమ తగ్గుతుందని చెప్పుకోవచ్చు.

  రాత్రికి రాత్రే భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

  ఓపెన్ డోర్స్ అనేది యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ అని, ఇలాంటి సర్వీసులు అందుబాటులోకి రావడం ఇదే ప్రథమం అని ఇరు సంస్థలు పేర్కొంటున్నాయి. రెసిడెన్షియల్ ప్రాపర్టీకి సంబంధించి కొనుగోలుదారులకు ఉన్న సమస్యలు, సందేహాలు అన్నీ ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా తీరిపోతాయని వివరిస్తున్నాయి. ఇల్లు కొనాలని అనుకునే వారికి ఎండ్ టు ఎండ్ హోమ్ బయ్యింగ్ అసిస్టెన్స్ లభిస్తుందని తెలిపాయి.

  పీపీఎఫ్, సుకన్య సమృద్ధి స్కీమ్స్‌లో డబ్బులు పెట్టే వారికి కేంద్రం తీపికబురు?

  అంతేకాకుండా హోమ్ లోన్ ప్రాసెసింగ్ కూడా త్వరితగతిన ఉంటుంది. రెంటల్, ప్రాపర్టీ మేనేజ్‌మెంట్, హోమ్ ఫర్నీషింగ్, లీగల్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ ఇలా చాలా సర్వీసులు కస్టమర్లకు లభిస్తాయి. అన్ని సేవలు ఒకే రూఫ్ కింద ఉంటాయి. అందువల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. యాక్సిస్ బ్యాంక్‌తో జతకట్టడం సంతోషంగా ఉందని, హౌసింగ్ అంశానికి సంబంధించిన అన్ని అంశాలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చామని స్వేర్ యార్డ్స్ ఫౌండర్, సీఈవో తనుజ్ శోరి తెలిపారు. కస్టమర్లకు అందుబాటు రేట్లలో ఆర్థిక సేవలు అందించడంలో యాక్సి బ్యాంక్ ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. హోమ్ ఓనర్‌షిప్ కాస్ట్‌ను తగ్గించాలనే లక్ష్యంతో అన్ని సేవలను ఒకే చోటు అందిస్తున్నామని వివరించారు.

  ఓపెన్ డోర్స్ ఆవిష్కరణ వల్ల ఇంటి కొనుగోలుదారులకు మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ప్రాపర్టీ సెర్చ్ చేసుకోవచ్చని, అలాగే హోమ్ లోన్ కోసం సులభంగా అప్లై చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది. నచ్చిన విధంగా ఇంటికి డిజైన్ చేసుకునేలా వెండర్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవచ్చని పేర్కొంది. ఇంటి కొనుగోలు సమయంలో కస్టమర్లు ఇబ్బందులు పడకుండా ఉండాలనే లక్ష్యంతో ఈ సేవలు తెచ్చామని యాక్సిస్ బ్యాంక్ పేర్కొంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Axis bank, Bank, Home loan, Housing Loans, Property

  ఉత్తమ కథలు