హోమ్ /వార్తలు /బిజినెస్ /

Axis Bank FD: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లను పెంచిన యాక్సిస్‌ బ్యాంక్‌.. కొత్త రేట్లు చెక్ చేయండి..

Axis Bank FD: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లను పెంచిన యాక్సిస్‌ బ్యాంక్‌.. కొత్త రేట్లు చెక్ చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Axis Bank FD: యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. తాజా రేట్లు సెప్టెంబర్ 20 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త రేట్లను ఇక్కడ చెక్ చేసుకోండి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

మారుతున్న మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లు వివిధ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ల (Fixed Deposit Rates)ను సవరిస్తున్నాయి. ఆర్బీఐ గత నిర్ణయాలతో ఇప్పటికే చాలా బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచాయి. తాజాగా యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. తాజా రేట్లు సెప్టెంబర్ 20 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై సాధారణ పౌరులు 2.75 శాతం నుంచి 5.75 శాతం వరకు; సీనియర్ సిటిజన్లు 2.75 శాతం నుంచి 6.50 శాతం వరకు వడ్డీ పొందవచ్చు. ఏయే డిపాజిట్లపై ఎంత మేరకు వడ్డీ పెరిగిందో తెలుసుకుందాం.

* సీనియర్‌ సిటిజన్లకు కొత్త రేట్లు

రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తాన్ని 7 రోజుల నుంచి 14 రోజుల వ్యవధికి చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లకు యాక్సిస్‌ బ్యాంక్‌ 2.75 శాతం వడ్డీ అందిస్తోంది. 15 రోజుల నుంచి 29 రోజులకు 2.75 శాతం వడ్డీ లభిస్తుంది. 30 రోజుల నుంచి 45 రోజులకు 3.25 శాతం, 46 రోజుల నుంచి 60 రోజులకు 3.25 శాతం, 61 రోజుల నుంచి 3 నెలలకు 3.25 శాతం వడ్డీ పొందవచ్చు.

సీనియర్‌ సిటిజన్లకు 3- 4 నెలలకు 3.75 శాతం, 4 - 5 నెలలకు 3.75 శాతం, 5- 6 నెలలకు 3.75 శాతం, 6- 7 నెలల కంటే తక్కువ కాలానికి 4.90 శాతం, 7- 8 నెలలకు 4.90 శాతం వడ్డీని బ్యాంక్ అందిస్తోంది. 8- 9 నెలలకు 4.90 శాతం, 9- 10 నెలలకు 5 శాతం, 10- 11 నెలలకు 5 శాతం వడ్డీ అందుకుంటారు.

11 నెలల నుంచి 11 నెలల 25 రోజుల కంటే తక్కువ కాలానికి చేసి డిపాజిట్లకు సీనియర్‌ సిటిజన్లకు 5 శాతం వడ్డీ అందుతుంది. 11 నెలల 25 రోజుల నుంచి సంవత్సరం కంటే తక్కువ కాలానికి 5 శాతం లభిస్తుంది. సంవత్సరం నుంచి సంవత్సరం 5 రోజుల కంటే తక్కువ వ్యవధికి చేసిన డిపాజిట్లకు 6.20 శాతం వడ్డీని యాక్సిస్ చెల్లిస్తుంది. 1 సంవత్సరం 5 రోజుల నుంచి 1 సంవత్సరం 11 రోజులకు 6.20 శాతం, 1 సంవత్సరం 11 రోజుల నుంచి 1 సంవత్సరం 25 రోజులకు 6.50 శాతం వడ్డీని సీనియర్‌ సిటిజన్లు అందుకోవచ్చు.

* సాధారణ ప్రజలకు..

రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తాన్ని 7 రోజుల నుంచి 14 రోజులకు చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 2.75 శాతం వడ్డీని యాక్సిస్‌ బ్యాంక్‌ అందిస్తోంది. 15 రోజుల నుంచి 29 రోజులకు 2.75 శాతం వడ్డీ లభిస్తుంది. 30 రోజుల నుంచి 45 రోజులకు 3.25 శాతం, 46 రోజుల నుంచి 60 రోజులకు 3.25 శాతం, 61 రోజుల నుంచి 3 నెలలకు 3.25 శాతం వడ్డీ అందుతుంది.

ఇది కూడా చదవండి : పెట్టుబడి చాలా తక్కువ.. కానీ రూ.లక్ష ఆదాయం.. ఈ బెస్ట్ బిజినెస్ పై ఓ లుక్కేయండి

అదే విధంగా 3- 4 నెలలకు 3.75 శాతం, 4 - 5 నెలలకు 3.75 శాతం, 5- 6 నెలలకు 3.75 శాతం, 6- 7 నెలల కంటే తక్కువ కాలానికి 4.65 శాతం, 7- 8 నెలలకు 4.65 శాతం వడ్డీని సాధారణ ప్రజలకు యాక్సిక్‌ అందిస్తోంది. 8- 9 నెలలకు 4.65 శాతం, 9- 10 నెలలకు 4.75 శాతం, 10- 11 నెలలకు 4.75 శాతం సాధారణ ప్రజలు పొందవచ్చు.

11 నెలల నుంచి 11 నెలల 25 రోజుల కంటే తక్కువ కాలానికి చేసి డిపాజిట్లకు సాధారణ ప్రజలకు 4.75 శాతం వడ్డీ అందుతుంది. 11 నెలల 25 రోజుల నుంచి సంవత్సరం కంటే తక్కువ కాలానికి 4.75 శాతం లభిస్తుంది. సంవత్సరం నుంచి సంవత్సరం 5 రోజుల కంటే తక్కువ వ్యవధికి చేసిన డిపాజిట్లకు 5.45 శాతం వడ్డీని యాక్సిస్ చెల్లిస్తుంది. 1 సంవత్సరం 5 రోజుల నుంచి 1 సంవత్సరం 11 రోజులకు 5.45 శాతం, 1 సంవత్సరం 11 రోజుల నుంచి 1 సంవత్సరం 25 రోజులకు 5.75 శాతం వడ్డీని సాధారణ ప్రజలు పొందవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Axis bank, FD rates, Fixed deposits, Personal Finance

ఉత్తమ కథలు