Fixed Deposit Rates: ఎఫ్​డీ వడ్డీ రేట్లను సవరించిన ప్రముఖ బ్యాంక్.. నేటి నుంచే అమల్లోకి కొత్త వడ్డీ రేట్లు..

ప్రతీకాత్మక చిత్రం

భారతీయులు డబ్బు(Money) ఆదా చేసుకోవడంలో ముందుంటారు. భవిష్యత్తు(Future) అవసరాలకు అనుగుణంగా వివిధ పెట్టుబడి మార్గాల్లో డబ్బు ఇన్వెస్ట్(Money Invest)​ చేస్తుంటారు. అయితే చాలా మంది తమ చేతిలో ఉన్న డబ్బును దాచుకోవడానికి, మంచి రాబడి పొందడానికి ఫిక్స్​డ్​ డిపాజిట్ల వైపు మొగ్గుచూపుతారు. అందులో యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేట్లను సవరించింది. వివరాలివే..

  • Share this:
భారతీయులు డబ్బు(Money) ఆదా చేసుకోవడంలో ముందుంటారు. భవిష్యత్తు(Future) అవసరాలకు అనుగుణంగా వివిధ పెట్టుబడి మార్గాల్లో డబ్బు ఇన్వెస్ట్(Money Invest)​ చేస్తుంటారు. అయితే చాలా మంది తమ చేతిలో ఉన్న డబ్బును దాచుకోవడానికి, మంచి రాబడి పొందడానికి ఫిక్స్​డ్​ డిపాజిట్ల వైపు మొగ్గుచూపుతారు. ఎందుకంటే వీటిలో ఎటువంటి రిస్క్​ ఉండదు. డిపాజిట్ (Depoist) చేసే డబ్బుకు హామీ ఉంటుంది. అంతేకాదు, స్థిరమైన వడ్డీ(Intrest) లభిస్తుంది. వివిధ బ్యాంకులు తరచుగా ఎఫ్‌డీ వడ్డీ రేట్లను సవరిస్తుంటాయి. ఇటీవలే ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎఫ్​డీ రేట్లను సవరించాయి. తాజాగా యాక్సిస్ బ్యాంక్ సైతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది.

వాహన కొనుగోలుదారులకు గుడ్​న్యూస్.. ఆ సంస్థ వాహనాల కొనుగోలుపై రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్.. వివరాలివే.. 


మన దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే కొన్ని ప్రైవేట్​ బ్యాంకులే ఎఫ్​డీలపై ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయి. వాటిలో యాక్సిస్​ బ్యాంక్​ ముందుంటుంది. ఈ బ్యాంకు తాజాగా డొమెస్టిక్​, ఎన్​ఆర్​ఐ ఎఫ్​డీ వడ్డీ రేట్లను సవరించింది. దేశీయ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్, ఎన్ఆర్ఐ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. నేటి (సెప్టెంబర్ 9) నుంచి ఈ వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయి. ఎన్​ఆర్​ఐ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మాత్రం సెప్టెంబర్​ 3వ తేదీనే సవరించింది. ఈ రెండింటికి వేర్వేరు వడ్డీ రేట్లను అమలు చేయనుంది.

Card Payments: డెబిట్​, క్రెడిట్ కార్డు పేమెంట్ ఆప్షన్లలో భారీ మార్పులు.. అవేంటో తెలుసుకోండి..


యాక్సిస్ బ్యాంక్ కొత్త ఎఫ్​డీ వడ్డీ రేట్లు
ఈ కొత్త వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వ్యవధి గల ఎఫ్​డీలపై వర్తిస్తాయి. 7 రోజుల నుంచి 29 రోజుల కాలపరిమితికి రూ. 2 కోట్లలోపు ఫిక్స్​డిపాజిట్లపై 2.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 30 రోజుల నుంచి 3 నెలల వ్యవధిపై 3.00 వడ్డీ రేటు అందిస్తోంది. 3 నెలల నుంచి ఆరు నెలల వరకు 3.50 శాతం, 6 నెలల నుంచి ఏడాది వరకు 4.40 శాతం, ఏడాది నుంచి ఏడాది 5 రోజుల వరకు 5.10 శాతం, ఏడాది 5 రోజుల నుంచి ఏడాది 11 రోజుల వరకు 5.15 శాతం, ఏడాది 11 రోజుల నుంచి ఏడాదిన్నర వరకు 5.10 శాతం, 18 నెలల నుంచి రెండేళ్ల వరకు 5.25 శాతం, రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు 5.40 శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు 5.75 శాతం వడ్డీ రేట్లను అమలు చేస్తోంది.
Published by:Veera Babu
First published: