Credit Card News | మీరు ఉచితంగా క్రెడిట్ కార్డు పొందాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే మీకోసం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్రీగానే క్రెడిట్ కార్డు పొందొచ్చు. ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో (Banks) ఒకటిగా కొనసాగుతూ వస్తున్న యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) కస్టమర్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంచింది. ది పరిమిత కాల ఆఫర్. అలాగే ఎంపిక చేసిన ఛానల్స్ ద్వారా అప్లై చేసుకున్న వారికే ఈ లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు ఆఫర్ వర్తిస్తుంది.
యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డుపరై ఈ ఆఫర్లు ఉన్నాయి. అంటే మీరు ఉచితంగానే ఈ క్రెడిట్ కార్డు పొందొచ్చు. ఈ క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల ఒక సినిమా టికెట్ బుక్ చేస్తే మరో టికెట్‌పై 100 శాతం డిస్కౌంట్ వస్తుంది. పేటీఎం మూవీస్ ద్వారా మీరు సినిమా టికెట్లు బుక్ చేసుకోవాలి. అలాగే సోనీలివ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు లభిస్తుంది. ఇంకా స్విగ్గీ ఆర్డర్లపై 40 శాతం తగ్గింపు ఉంది.
రూ.1,600 కడితే చాలు యాపిల్ ఐఫోన్ మీదే.. కంపెనీ అదిరే ఆఫర్!
అలాగే కాంప్లిమెంటరీ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. అలాగే ఎజియో ద్వారా షాపింగ్ చేస్తే రూ. 600 తగ్గింపు వస్తుంది. ఎడ్జ్ రివార్డు పాయింట్లు పొందొచ్చు. సాధారణగా అయితే ఈ క్రెడిట్ కార్డు జాయినింగ్ ఫీజు రూ. 500గా ఉంది. అయితే ఎంపిన చేసిన ఛానల్స్ ద్వారా ఇప్పుడు అప్లై చేసుకుంటే ఫ్రీగా కార్డు పొందొచ్చు. ఈ కార్డుపై వడ్డీ రేటు నెలకు 3.5 శాతం నుచి ప్రారంభం అవుతుంది. అంటే ఏడాదికి 52.86 శాతం.
శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే!
సోనీలివ్ సబ్‌స్క్రిప్షన్ రూపంలో రూ. 999, మూవీ ఖర్చులపై రూ. 2400, ఫుడ్ ఆర్డర్ ద్వారా రూ. 5760, ఆన్‌లైన్ షాపింగ్ ఎజియో ద్వారా రూ. 2,400, ఫ్యూయెల్ స్పెండ్స్ ద్వారా రూ. 360. డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ద్వారా రూ. 2 వేలు,ఇంకా సోనీ లివ్ రెన్యూవల్ బెనిఫిట్ కింద రూ. 999, ఎడ్జ్ పాయింట్ల ద్వారా రూ. 1800 విలువైన పాయింట్లు ఉచితగాం పొందొచ్చు. ఇలా మీకు మొత్తంగా ఏడాదిలో రూ. 15 వేల వరకు తగ్గింపు లభిస్తుందని బ్యాంక్ పేర్కొంటోంది. కేవలం యాక్సిస్ బ్యాంక్ మాత్రమే కాకుండా ఇతర బ్యాంకులు కూడా ఉచిత క్రెడిట్ కార్డు ఆఫర్‌ను అందుబాటులో ఉంచాయి. అందువల్ల మీకు నచ్చిన క్రెడిట్ కార్డును ఓకే చేసుకోవచ్చు. మీ అవసరాలకు అనుగుణమైన క్రెడిట్ కార్డు ఉపయోగించకోడం ఉత్తమం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axis bank, Bank news, Banks, Credit card, Money