Axis Bank: యువత కోసం యాక్సిస్ బ్యాంక్‌లో ప్రత్యేక సేవింగ్స్ అకౌంట్... లాభాలివే

Axis Bank launches liberty savings account | యువతీయువకుల కోసం యాక్సిస్ బ్యాంక్ సరికొత్త సేవింగ్స్ అకౌంట్ అందిస్తోంది. లాభాలేంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: September 16, 2020, 11:03 AM IST
Axis Bank: యువత కోసం యాక్సిస్ బ్యాంక్‌లో ప్రత్యేక సేవింగ్స్ అకౌంట్... లాభాలివే
Axis Bank: యువత కోసం యాక్సిస్ బ్యాంక్‌లో ప్రత్యేక సేవింగ్స్ అకౌంట్... లాభాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు యంగ్ ప్రొఫెషనలా? మీరు ఆకర్షణీయమైన ఆఫర్లతో సేవింగ్స్ బ్యాంకు ఖాతాతో పాటుగా బీమా కవరేజీని కలిగి ఉండాలని భావిస్తున్నారా? అయితే మీకు యాక్సిస్ లిబర్టీ సేవింగ్స్ అకౌంట్ బెస్ట్ ఛాయిస్. తాజాగా యాక్సిస్ బ్యాంక్ మిలీనియల్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని యాక్సిస్ లిబర్టీ సేవింగ్స్ అకౌంట్ అనే కొత్త సేవింగ్స్ ఖాతాను ప్రారంభించింది. అకౌంట్లో కనీస నిల్వ రూ. 25,000 మెయింటెయిన్ చేసేవారికి లేదా బ్యాంక్ డెబిట్ కార్డును ఉపయోగించి ప్రతి నెలా అదే మొత్తాన్ని ఖర్చు చేసే వినియోగదారులకే ఈ అవకాశం కల్పించింది. ఈ సేవింగ్స్ అకౌంట్ రూ.20,000 కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్‌ కూడా అందిస్తుంది. ఈ భీమా కవరేజీలో కోవిడ్-19 సంబంధిత ఆసుపత్రిలో చేరే ఖర్చులు కూడా ఉంటాయి. ఈ లిబర్టీ సేవింగ్స్ ఖాతా 35 ఏళ్లలోపు ఉన్న ఉద్యోగస్తులను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టామని రిటైల్ లయబిలిటీస్, డైరెక్ట్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ భట్ పేర్కొన్నారు.

Savings Scheme: మీ డబ్బును రెండింతలు చేసే స్కీమ్ ఇదే

Gold Loan Vs Personal Loan: లోన్ తీసుకునే ముందు ఈ లెక్కలు మర్చిపోవద్దు

మిలీనియల్స్ డిజిటల్ అవగాహన గలవారు, మంచి సమాచారం ఉన్నవారు మరియు ఆఫర్ల కోసం వెతుకుతుంటారని, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ఎక్కువగా ఈ వయస్సులో ఉన్న వారే వినియోగించుకుంటారని వారాంతంలో ఆహారం, వినోదం, షాపింగ్ మరియు ప్రయాణం వంటి వాటికి ఎక్కువగా ఖర్చు చేసేది కూడా ఈ వయస్సు వారేనని, అందువల్ల వారు తమ అకౌంట్ నుంచి చేసిన ఖర్చుకు బహుమతి వోచర్లను అందిస్తున్నామని ఆయన తెలిపారు. లిబర్టీ సేవింగ్స్ ఖాతా బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ పాలసీలో భాగంగా ఖాతాదారుడు ఆసుపత్రిలో చేరితే సంవత్సరం పాటు రూ. 20,000 రోజువారీ ఆసుపత్రి నగదు కవర్ అందుబాటులో ఉంది. వినియోగదారుడు లిబర్టీ సేవింగ్స్ ఖాతాను తెరిచినప్పుడే ఈ బీమా పాలసీ కూడా అందిస్తారు. ఈ ఖాతా తెరవడానికి మీరు కనీస నిల్వ రూ.25,000 లను నిర్వహించాల్సి ఉంటుంది లేదా ప్రతి నెలా సమానమైన మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.
Published by: Santhosh Kumar S
First published: September 16, 2020, 11:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading