Home /News /business /

AXIS BANK HIKES MINIMUM BALANCE FOR SAVINGS ACCOUNT FROM RS 10000 TO RS 12000 SS

Axis Bank New Rules: యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు కొత్త రూల్స్‌తో షాక్

Axis Bank New Rules: యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు కొత్త రూల్స్‌తో షాక్
(ప్రతీకాత్మక చిత్రం)

Axis Bank New Rules: యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు కొత్త రూల్స్‌తో షాక్ (ప్రతీకాత్మక చిత్రం)

Axis Bank New Rules | యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. యాక్సిస్ బ్యాంక్ కొత్త రూల్స్ అమలు చేసింది. మినిమమ్ బ్యాలెన్స్ (Minimum Balance Rules), ఉచిత క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్‌లో మార్పులు వచ్చాయి.

ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాంకు అకౌంట్ల (Bank Account) విషయంలో పలు మార్పులు చేసింది. పలు కేటగిరీల్లో ఉన్న సేవింగ్స్ అకౌంట్స్‌కు సంబధించి మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు (Minimum Balance Rules) మారాయి. అంతేకాదు ఫ్రీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ లిమిట్‌ను కూడా తగ్గించింది యాక్సిస్ బ్యాంక్. ఇప్పటికే ఈ కొత్త రూల్స్‌ని యాక్సిస్ బ్యాంక్ అమలు చేయడం విశేషం. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఈజీ సేవింగ్స్ అకౌంట్ లేదా అలాంటి అకౌంట్స్ ఉన్నవారు ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ రూ.12,000 మెయింటైన్ చేయాలి. గతంలో ఈ బ్యాలెన్స్ రూ.10,000 మాత్రమే ఉండేది. ఇప్పుడు రూ.2,000 పెంచింది. అన్ని డొమెస్టిక్, ఎన్ఆర్ఐ ఈజీ అకౌంట్, డిజిటల్, సేవింగ్స్ SBEZY, స్మార్ట్ ప్రివిలేజ్ లాంటి అకౌంట్స్ అన్నింటికీ ఇది వర్తిస్తుంది.

మీకు మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో యాక్సిస్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంటే బ్యాలెన్స్ రూ.12,000 ఉందో లేదో చెక్ చేయండి. సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.5,000, రూరల్ ప్రాంతాల్లో రూ.2,500 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ తక్కువగా ఉంటే తక్కువగా ఉన్న ప్రతీ రూ.100 కి రూ.5 చొప్పున మంత్లీ సర్వీస్ ఫీజు చెల్లించాలి. దీంతో పాటు రూ.75 లేదా రూ.250 అదనంగా ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు బ్యాంకులను బట్టి వేర్వేరుగా ఉంటాయి.

Business Idea: ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్... రూ.70,000 పెట్టుబడి చాలు

ఇక ఉచిత క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను రూ.2,00,000 నుంచి రూ.1,50,000 కి తగ్గించింది యాక్సిస్ బ్యాంక్. గతంలో మొదటి నాలుగు లావాదేవీలు లేదా రూ.2,00,000... వీటిలో ఏది ముందైతే అది ఉచిత క్యాష్ ట్రాన్సాక్షన్ లిమిట్‌గా ఉండేది. కానీ ఇప్పుడు మొదటి నాలుగు లావాదేవీలు లేదా రూ.1,50,000 గా లిమిట్ సవరించింది యాక్సిస్ బ్యాంక్. నాన్ హోమ్, థర్డ్ పార్టీ క్యాష్ లిమిట్స్‌లో ఎలాంటి మార్పు లేదని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది.

EPF PAN Link: ఈపీఎఫ్ అకౌంట్‌కు పాన్ నెంబర్ లింక్ చేయకపోతే ఈ నష్టం తప్పదు

మరోవైపు యాక్సిస్ బ్యాంక్ 2022 జనవరి 1 నుంచి కొత్త ఏటీఎం ఛార్జీలు అమలు చేసిన సంగతి తెలిసిందే. యాక్సిస్, నాన్ యాక్సిస్ ఏటీఎంలో ఫ్రీ లిమిట్ కన్నా ఎక్కువ సార్లు క్యాష్‌విత్‌డ్రాయల్ చేస్తే ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.21 చెల్లించాలి. యాక్సిస్, నాన్ యాక్సిస్ ఏటీఎంలో ఫ్రీ లిమిట్ కన్నా ఎక్కువ సార్లు బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తే ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.10 చెల్లించాలి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Axis bank, Bank account, Personal Finance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు