Axis Bank MCLR Rate Hike | ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రుణ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్ (Bank) కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును (MCLR) 30 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది. దీంతో ఎంసీఎల్ఆర్ రేటుతో లింక్ అయిన రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. అలాగే నెలవారీ ఈఎంఐ కూడా పైకి చేరనుంది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు పెంపు నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చేసింది.
బ్యాంక్ ప్రకారం.. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8 .75 శాతం మేర పైకి చేరింది. ఇదివరకు ఈ రేటు 8.45 శాతంగా ఉంది. అలాగే రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 8.85 శాతానికి చేరింది. ఇది వరకు ఈ రేటు 8.55 శాతంగా ఉండేది. ఇంకా మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు విషయానికి వస్తే.. ఇది 8.9 శాతానికి పెరిగింది. ఇదివరకు ఈ రేటు 8.6 శాతంగా ఉండేది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు అయితే 8.4 శాతం నుంచి 8.7 శాతానికి చేరింది.
శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర, తాజా రేట్లు ఇలా!
ఇంకా మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.65 శాతానికి చేరింది. ఇదివరకు ఈ రేటు 8.35 శాతంగా ఉంది. నెల రోజులు, ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ అయితే 8.55 శాతం వద్ద ఉన్నాయి. ఇదివరకు ఈ ఎంసీఎల్ఆర్ రేట్లు 8.25 శాతం వద్ద ఉండేవి. వచ్చే రేట్ల సమీక్ష వరకు ఈ కొత్త రేట్లు అమలులో ఉంటాయని బ్యాంక్ తెలిపింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ బేస్ రేటు 9.15 శాతం వద్దనే స్థిరంగా ఉంది. 2022 సెప్టెంబర్ 17 నుంచి ఈ రేటు నిలకడగానే ఉంటూ వస్తోంది.
కొత్త ఏడాది షాక్.. టీవీ ఛానల్స్ ధర పెంపు, కొత్త రేట్లు ఇలా!
బ్యాంకులు క్రమం తప్పకుండా ఎంసీఎల్ఆర్ రేటును, బేస్ రేటును సమీక్షిస్తూ వస్తాయి. రేట్లను పెంచొచ్చు. లేదంటే స్థిరంగా కొనసాగించొచ్చు. అయితే సమీక్ష మాత్రం జరుగుతూ వస్తుంది. కాగా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును పెంచుకుంటూ రావడంతో బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి. ఇప్పటికే చాలా బ్యాంకులు రుణ రేట్లు పెంచాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి యాక్సిస్ బ్యాంక్ కూడా వచ్చి చేరింది. కాగా రెపో రేటు ఈ ఏడాదిలో 225 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. మే నుంచి రెపో రేటు పెరుగుతూనే ఉంది. డిసెంబర్ నెల పెంపుతో చూస్తే.. రెపో రేటు ఇప్పుడు 6.25 శాతానికి చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axis bank, Bank news, Banks, Interest rates, Mclr