Home /News /business /

AXIS BANK HIKED THE INTEREST RATES ON ITS FIXED DEPOSITS AFTER RESERVE BANK RAISING THE REPO RATES CHECK LATEST FD RATES PRV GH

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచిన యాక్సిస్ బ్యాంక్.. కొత్త వడ్డీరేట్ల వివరాలు ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మరో ప్రముఖ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది. ప్రైవేట్ రంగ రుణదాత అయిన యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను సవరించింది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Fixed Deposits)పై మరో ప్రముఖ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది. ప్రైవేట్ రంగ రుణదాత అయిన యాక్సిస్ బ్యాంక్ (Axis bank) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను సవరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటు (Repo rate) పెంపు తర్వాత ప్రధాన బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్న (Hike) విషయం తెలిసిందే. ఈ క్రమంలో యాక్సిస్ బ్యాంక్ కూడా FD రేటు పెంపుపై దృష్టి పెట్టింది. యాక్సిస్ బ్యాంక్ కొత్త ఎఫ్‌డీ రేట్లు తొమ్మిది నెలల కంటే ఎక్కువ కాల వ్యవధికి చేసే డిపాజిట్లపై (deposits) వర్తిస్తున్నాయి. మెచూరిటీని బట్టి బ్యాంకు 10 నుంచి 35 బేసిస్ పాయింట్ల వరకు రేట్లు పెంచింది. సీనియర్ సిటిజన్‌లు అదనంగా 0.50 శాతం రాబడిని పొందుతారు.

యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు పెంపు మే 12, 2022 నుంచి అమల్లోకి వచ్చింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తానికి చేసే డిపాజిట్లకు ఈ పెంపు వర్తిస్తుందని బ్యాంక్ నోటిఫికేషన్‌లో తెలిపింది.

సవరించిన వడ్డీ రేట్ల వివరాలు..

7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 2.50 శాతం

15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 2.50 శాతం

30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.00 శాతం

46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.00 శాతం

61 రోజుల నుంచి 3 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.00 శాతం

3 నెలల నుంచి 4 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం

4 నెలల నుంచి 5 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం

5 నెలల నుంచి 6 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం

6 నెలల నుంచి 7 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.65 శాతం

7 నెలల నుంచి 8 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.65 శాతం

8 నెలల నుంచి 9 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.65 శాతం

9 నెలల నుంచి 10 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం

10 నెలల నుంచి 11 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం

11 నెలల నుంచి 11 నెలల కంటే తక్కువ 25 రోజులు: సాధారణ ప్రజలకు 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం

11 నెలల 25 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం

1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 5 రోజుల కంటే కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.90 శాతం

1 సంవత్సరం 5 రోజుల నుంచి 1 సంవత్సరం 11 రోజుల కంటే కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.90 శాతం

1 సంవత్సరం 11 రోజుల నుంచి 1 సంవత్సరం 25 రోజుల కంటే కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.90 శాతం

1 సంవత్సరం 25 రోజుల నుంచి 13 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.90 శాతం

13 నెలల నుంచి 14 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.90 శాతం

14 నెలల నుంచి 15 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.90 శాతం

15 నెలల నుంచి 16 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.95 శాతం

16 నెలల నుంచి 17 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.95 శాతం

17 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.95 శాతం

18 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.95 శాతం

2 సంవత్సరాల నుంచి 30 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం

30 నెలల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం

3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం

5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Axis bank, BUSINESS NEWS, Fixed deposits

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు