హోమ్ /వార్తలు /బిజినెస్ /

Interest Rates Hike: యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు బంపరాఫర్.. ఎఫ్‌డీ, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు.. ఎంతో తెలుసా..!

Interest Rates Hike: యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు బంపరాఫర్.. ఎఫ్‌డీ, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు.. ఎంతో తెలుసా..!

ఎప్‌డీ, సేవింగ్ అకౌంట్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన యాక్సిన్ బ్యాంక్

ఎప్‌డీ, సేవింగ్ అకౌంట్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన యాక్సిన్ బ్యాంక్

ప్రముఖ ప్రైవేట్ రంగ రుణదాత యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్లను రెండుసార్లు పెంచిన నేపథ్యంలో.. ఆ మేరకు డిపాజిట్లపై (Deposits) వడ్డీ రేట్లను (Interest Rates) పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఇంకా చదవండి ...

ప్రముఖ ప్రైవేట్ రంగ రుణదాత యాక్సిస్ బ్యాంక్ తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను రెండుసార్లు పెంచిన నేపథ్యంలో.. ఆ మేరకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో ఆర్బీఐ రెపో రేటును మొత్తం 90 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనికి అనుగుణంగా యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త FD వడ్డీ రేట్లు జూన్ 13 నుంచి అమల్లోకి వచ్చాయి. యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు పెంపు రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తుందని బ్యాంక్ నోటిఫికేషన్‌లో తెలిపింది.

యాక్సిస్ బ్యాంక్ తాజా FD వడ్డీ రేట్లు


 • 7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 2.50 శాతం

 • 15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 2.50 శాతం

 • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.00 శాతం

 • 46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.00 శాతం

 • 61 రోజుల నుంచి 3 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.00 శాతం

 • 3 నెలల నుంచి 4 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం

 • 4 నెలల నుంచి 5 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం

 • 5 నెలల నుంచి 6 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం

 • 6 నెలల నుంచి 7 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.65 శాతం

 • 7 నెలల నుంచి 8 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.65 శాతం

 • 8 నెలల నుంచి 9 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.65 శాతం

 • 9 నెలల నుంచి 10 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం

 • 10 నెలల నుంచి 11 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం

 • 11 నెలల నుంచి 11 నెలల కంటే తక్కువ 25 రోజులు: సాధారణ ప్రజలకు 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం

 • 11 నెలల 25 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం

 • 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 5 రోజుల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.90 శాతం

 • 1 సంవత్సరం 5 రోజుల నుంచి 1 సంవత్సరం 11 రోజుల కంటే తక్కువ : సాధారణ ప్రజలకు 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.90 శాతం

 • 1 సంవత్సరం 11 రోజుల నుంచి 1 సంవత్సరం 25 రోజుల కంటే తక్కువ : సాధారణ ప్రజలకు 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.90 శాతం

 • 1 సంవత్సరం 25 రోజుల నుంచి 13 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.90 శాతం

 • 13 నెలల నుంచి 14 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.90 శాతం

 • 14 నెలల నుంచి 15 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.90 శాతం

 • 15 నెలల నుంచి 16 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.95 శాతం

 • 16 నెలల నుంచి 17 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.95 శాతం

 • 17 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.95 శాతం

 • 18 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.95 శాతం

 • 2 సంవత్సరాల నుంచి 30 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం

 • 30 నెలల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం

 • 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం

 • 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం


యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు పెంపు

ప్రధాన బ్యాంకులు సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్న తరుణంలో.. యాక్సిస్ బ్యాంక్ కూడా సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు జూన్ 1 నుంచి.. RBI ద్వైమాసిక మానిటరీ పాలసీ కమిటీ సమావేశానికి ముందే అమల్లోకి వచ్చాయి. ఈ బ్యాంక్ రూ. 50 లక్షల కంటే తక్కువ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీ రేటును ​​సంవత్సరానికి 3 శాతంగా నిర్ణయించింది. రూ.50 లక్షల నుంచి రూ. 800 కోట్ల కంటే తక్కువ సేవింగ్స్ డిపాజిట్లపై సంవత్సరానికి వడ్డీరేటు 3.50 శాతంగా ఉంది.

First published:

Tags: Axis bank, FD rates, Interest rates, Saving account

ఉత్తమ కథలు