Bank News | మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అది కూడా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే శుభవార్త. క్రెడిట్ కార్డు బిల్లు కడితే అదిరే ప్రయోజనం పొందొచ్చు. యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) క్రెడిట్ కార్డు (Credit Card) కస్టమర్లు వారి కార్డు బిల్లును చెక్యూ యాప్ ద్వారా చెలిస్తే.. అదనపు రివార్డు పాయింట్లు సొంతం చేసుకోవచ్చు. ఈ రివార్డు పాయింట్లను మీరు క్యాష్ రూపంలోకి మార్చుకోవచ్చు.
బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న చెక్యూ స్టార్టప్ తాజాగా యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు చేస్తే.. అదనపు రివార్డు పాయింట్లు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం కేవలం యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే ఈ బెనిఫిట్ అందుబాటులో ఉంది. అందువల్ల ఇకపై యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్లు వారి కార్డు బిల్లు పేమెంట్‌ను ఈ యాప్ ద్వారా చేస్తే అదనపు ప్రయోజనం పొందొచ్చు.
కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఎస్‌బీఐ .. ఉగాది పండుగ ముందు కీలక నిర్ణయం, రేపటి నుంచి..
యాక్సిస్ బ్యాంక్, చెక్యూ భాగస్వామ్యంలో భాగంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని చెక్యూ యాప్ ద్వారా చెల్లిస్తే.. పేమెంట్ మొత్తంలో 1.5 శాతాన్ని చెక్యూ చిప్స్ రూపంలో వెనక్కి పొందొచ్చు. సాధారణంగా రెగ్యులర్ కస్టమర్లు 1 శాతం మాత్రమే చెక్యూ చిప్స్ పొందగలరు. అయితే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్లకు మాత్రం అదనంగా 0.5 శాతం బెనిఫిట్ లభిస్తుంది.
కొత్త కారు కొనే వారికి శుభవార్త.. రూ.3 లక్షల డిస్కౌంట్, మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు!
చెక్యూ చిప్స్ అనేవి యాప్‌లో కరెన్సీ. చెక్యూ యాప్ ద్వారా చేసే ప్రతి పేమెంట్‌పై ఈ చెక్యూ చిప్స్ వస్తాయి. ఈ చిప్స్‌ను మీరు వోచర్లుగా మార్చుకోవచ్చు. అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ , స్విగ్గీ, జొమాటో వంటి తదిరత బ్రాండ్లకు చెందిన వోచర్లను పొందొచ్చు. లేదంటే క్యాష్ రూపంలోకి మార్చుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్‌లోకి ఈ డబ్బులు వచ్చేస్తాయి. మార్చి 13 నుంచి యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు ఈ ప్రయోజనం అందుబాటులోకి వచ్చిందని చెక్యూ తెలిపింది. కనీసం రూ.100 బిల్లు పేమెంట్ కూడా చేయొచ్చు.
చెక్యూ చిప్స్‌కు చాలా మంది కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోందని చెక్యూ కంపెనీ పేర్కొంటోంది. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు కూడా ఈ భాగస్వామ్యం ద్వారా అధిక ప్రయోజనం పొందొచ్చని వెల్లడించింది. చెక్యూ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా తమ కస్టమర్లకు అదనపు బెనిఫిట్ లభిస్తుందని యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ అండ్ పేమెంట్స్ హెడ్, ప్రెసిడెంట్ సంజీవ్ తెలిపారు. కస్టమర్లు అధిక రివార్డులు పొందొచ్చని వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axis bank, Bank, Credit card, Credit cards, Money