Home /News /business /

AXIS BANK AND RUPIFI LAUNCHED EXCLUSIVE BUSINESS CREDIT CARD FOR MSMES KNOW FEATURES AND BENEFITS SS GH

Business Credit Card: వ్యాపారం చేస్తున్నారా? ఈ క్రెడిట్ కార్డ్ మీకోసమే

Business Credit Card: వ్యాపారం చేస్తున్నారా? ఈ క్రెడిట్ కార్డ్ మీకోసమే
(ప్రతీకాత్మక చిత్రం)

Business Credit Card: వ్యాపారం చేస్తున్నారా? ఈ క్రెడిట్ కార్డ్ మీకోసమే (ప్రతీకాత్మక చిత్రం)

Axis Bank Rupifi Credit Card | మీరు వ్యాపారం చేస్తున్నారా? వ్యాపారం చేసేవారి కోసం యాక్సిస్ బ్యాంక్ ప్రత్యేకంగా క్రెడిట్ కార్డ్ అందిస్తోంది. ఈ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్, ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్, ఎంబెడెడ్ లెండింగ్ ఫిన్‌టెక్ సంస్థ రూపైఫైతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ రెండింటి భాగస్వామ్యంలో ప్రత్యేకమైన బిజినెస్ క్రెడిట్ కార్డులను ప్రారంభించింది. వీసా అందజేసే ఈ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సంస్థలను ప్రారంభించాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది రూపిఫైతో భాగస్వామ్యమైన ప్లాట్‌ఫామ్‌లపై ట్రాన్సాక్షన్స్ నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాక, ఈ ప్లాట్‌ఫామ్‌తో ఇప్పటికే చిన్న వ్యాపారాలు కలిగి ఉన్న వారు తగిన క్రెడిట్ పరిష్కారాలను కూడా పొందవచ్చు. ఫుడ్, కిరాణా, ఫార్మా, అగ్రి-కమోడిటీస్, ఈ–కామర్స్, ఫ్యాషన్, లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్ట్, ఇండస్ట్రియల్ గూడ్స్ వంటి అనేక రంగాల్లో స్థాపించబడిన బి2బి మార్కెట్లకు చేయూత అందించడానికి, అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లతో రూపిఫై ఒప్పందం కుదుర్చుకుంది.

PM Kisan: రైతుల కోసం ప్రత్యేకంగా పెన్షన్ స్కీమ్... అప్లై చేయండి ఇలా

LPG Cylinder: సామాన్యులకు షాక్... భారీగా పెరిగిన సిలిండర్ ధర

యాక్సిస్ బ్యాంక్-రూపిఫై బిజినెస్ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్, బెనిఫిట్స్ ఇవే...


1. యాక్సెస్ బ్యాంక్ అందజేసే ఈ బిజినెస్ క్రెడిట్ కార్డ్స్ హై అప్రోవల్ రేటుతో వస్తాయి. వీటి ద్వారా చిన్న వ్యాపారస్తుడికి ఎక్కువ మొత్తంలో క్రెడిట్ లిమిట్ ఇవ్వబడుతుంది.

2. సూక్ష్మ, మధ్య తరగతి వ్యాపారులకు సగటున నెలకు రూ. 1 లక్ష నుంచి 2 లక్షల మధ్య క్రెడిట్ లిమిట్ ఇవ్వబడుతుంది. అయితే, ఈ లిమిట్ ఎంత అనేది అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌లతో జరిపిన బిజినెస్ డేటా ట్రాన్సాక్షన్ ప్రకారం, గత ఆరు నెలల GMV, రెవెన్యూ ఫ్యాక్టర్స్‌ను పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తారు.

3. ఈ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసే వారు -జాయినింగ్ ఫీజు కింద రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, దీనికి ఎటువంటి వార్షిక రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

4. ఈ క్రెడిట్ కార్డుతో 51 రోజుల వరకు ఎటువంటి వడ్డీ లేకుండా తీసుకున్న క్రెడిట్ను చెల్లించవచ్చు.

5. దీనిలోని రివాల్వింగ్ ఫీచర్ ద్వారా ఇతర క్రెడిట్ కార్డుల మాదిరిగానే బకాయిలను పూర్తిగా ఒకే సారి చెల్లించవచ్చు లేదా మినిమం అమౌంట్ను చెల్లించి తర్వాతి నెలకు క్రెడిట్ బ్యాలెన్స్‌ను ట్రాన్ఫర్ చేయవచ్చు.

6. ఈ క్రెడిట్ కార్డుతో మొదటి నెలలో చేసే అన్ని ఖర్చులపై 5% క్యాష్‌బ్యాక్ (రూ .2500 వరకు మాత్రమే) లభిస్తుంది. అదేవిధంగా తరువాతి నెలల్లో చేసే అన్ని ఖర్చులపై 1% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్... రోజుకు రూపాయి మాత్రమే

Aadhaar Card: మీ ఆధార్ కార్డులో ఏదైనా సమస్య ఉందా? ఈ నెంబర్‌కు కాల్ చేయండి

బిజినెస్ క్రెడిట్ కార్డుపై యాక్సిస్ బ్యాంక్, ఈవీపీ & పేమెంట్స్ హెడ్ సంజీవ్ మోఘే మాట్లాడుతూ “వినియోగదారులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పూర్తిస్థాయి క్రెడిట్ పరిష్కారాలను అందించడానికి భారతదేశ మొట్టమొదటి లెండింగ్- -సర్వీస్ ప్లాట్‌ఫామ్‌ రూపిఫైతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. ఈ భాగస్వామ్యంతో MSME విభాగం మరింతగా విస్తరించడానికి అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం, ఎంఎస్ఎంఈ మార్కెట్ 100 బిలియన్ డాలర్లకు పైగా వ్యాపారాన్ని కలిగి ఉంది. రిటైల్ & కామర్స్, ఫుడ్, టెక్, ట్రావెల్, ట్రాన్స్‌పోర్ట్, మొబిలిటీ, లాజిస్టిక్స్ వ్యాపారాలు మరింతగా వృద్ధి చెందడానికి మా భాగస్వామ్యం సహాయపడుతుంది. ” ఈ భాగస్వామ్యంపై రూపిఫై సహ వ్యవస్థాపకుడు, సిఈఒ అనుభావ్ జైన్ మాట్లాడుతూ “ఈ కో–బ్రాండెడ్ కార్డ్ కోసం యాక్సిస్ బ్యాంక్, వీసాతో భాగస్వామ్యం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. భారతీయ ఎస్‌ఎంఈలను ప్రోత్సహించడానికి రూపిఫై ఎప్పుడూ ముందుంటుంది. ఈ కమర్షియల్ కార్డ్ ద్వారా చిన్న వ్యాపారులకు వ్యాపార కొనుగోళ్లు చేయడానికి, స్వల్పకాలిక క్రెడిట్ పొందడానికి, వారి రోజువారీ వ్యాపార అవసరాలు తీర్చడానికి, నగదు ప్రవాహాన్ని మెరుగుపర్చడానికి సహాయం చేయాలనుకుంటున్నాము. ” అని అన్నారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Axis bank, Bank loans, Credit cards, Personal Loan

తదుపరి వార్తలు