ఫ్రీగా వైఫై సిగ్నల్ దొరుకుతోందని కనెక్టవుతున్నారా ?...అయితే మీ డబ్బుకు నోగ్యారంటీ...

షాపింగ్ మాల్స్ లో, కాఫీ షాప్స్‌లో, ఇతర పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడైనా ఫ్రీగా వైఫై సిగ్నల్ కనిపించింది అంటే లాగిన్ అయిపోతుంటాం.. అయితే ఇలా ఎక్కడపడితే అక్కడ ఫ్రీగా లభించే ఫ్రీ వైఫై హాట్ స్పాట్‌లకు లాగిన్ అయితే ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే నిపుణులు హెచ్చరిస్తున్నారు.

news18-telugu
Updated: March 25, 2019, 11:12 AM IST
ఫ్రీగా వైఫై సిగ్నల్ దొరుకుతోందని కనెక్టవుతున్నారా ?...అయితే మీ డబ్బుకు నోగ్యారంటీ...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 25, 2019, 11:12 AM IST
సాధారణంగా షాపింగ్ మాల్స్ లో, కాఫీ షాప్స్‌లో, ఇతర పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడైనా ఫ్రీగా వైఫై సిగ్నల్ కనిపించింది అంటే లాగిన్ అయిపోతుంటాం.. అయితే ఇలా ఎక్కడపడితే అక్కడ ఫ్రీగా లభించే ఫ్రీ వైఫై హాట్ స్పాట్‌లకు లాగిన్ అయితే ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఇతర ప్రాంతాలను విజిట్ చేసే ఉద్యోగస్తులు, టూరిస్టులు, వ్యాపారస్తులు రోమింగ్ లో డేటా చార్జీలకు భయపడి కూడా తాము బస చేసిన హోటల్స్ లేదా ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో లభించే ఫ్రీ వైఫై లకు ఆకర్షితులు అవుతుంటారు. కానీ ఆ ఫ్రీ వైఫై సిగ్నల్ కు ఒక్కసారి కనెక్ట్ అయితే ఇక మీ డేటా అంతా హేకర్ల చేతిలో పెట్టినట్లే అని ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గూగుల్ సంస్థకు చెందిన ఒక రీసెర్చ్ అనాలిసిస్ సంస్థ మాసన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారత్ లో ఏటా సుమారు 4 కోట్ల మంది యూజర్లు ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఈ ఫ్రీవైఫై సిగ్నల్స్‌కు కనెక్ట్ అవుతున్నట్లు గుర్తించింది. ప్రముఖ సాఫ్ట్ వేర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కీ సైతం భారత్ లో సుమారు 70 శాతం మంది టాబ్లెట్ యూజర్లు ఫ్రీ వైఫై హాట్ స్పాట్ లకు కనెక్ట్ కాగా, 53 శాతం మంది మొబైల్ యూజర్లు ఈ ఉచిత వైఫై హాట్ స్పాట్‌లకు కనెక్ట్ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నట్లు తేలింది.

ఇదిలా ఉంటే పబ్లిక్ వైఫై ద్వారా కనెక్ట్ అయ్యే ల్యాప్ టాప్స్, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్స్ హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా ఫ్రీ వైఫైలలో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే మాత్రం హ్యాకర్లు మీ డిటైల్స్ హ్యాక్ చేయడం చాలా సులభమని అంచనా నివేదికలో పేర్కొన్నారు. పబ్లిక్ వైఫై ద్వారా పర్సనల్ ల్యాప్ టాప్స్, స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ లాంటివి వీలైనంత వరకూ దూరంగా ఉండాలని ప్రముఖ సైబర్ లా ఎక్స్‌పర్ట్ పవన్ దుగ్గల్ పేర్కొన్నారు.

ముఖ్యంగా విదేశాల్లో పొరపాటున ఈ ఫ్రీవైఫై సిగ్నల్‌కు కనెక్ట్ అయ్యేందుకు ఆశపడ్డారో...ఇక అంతే సంగతులు...క్షణాల్లో మీ పర్సనల్ డేటా మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళిపోతుంది. ఒకవేళ మీరు ఆ దేశ నేరనిరోధక విభాగానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఎందుకంటే ప్రస్తుతం డేటా ప్రొటెక్షన్, సైబర్ క్రైమ్ నిరోధం కోసం ఉద్దేశించిన ఒక్క గ్లోబల్ చట్టం కూడా లేదు. దీంతో మీరు చేసిన ఫిర్యదు బుట్టదాఖలయ్యే అవకాశం ఉంది.ఈ పబ్లిక్ వైఫై ప్రమాదం నుంచి బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా మీ మొబైల్ డేటానే వాడుకోవడం ఉత్తమం. రోమింగ్ చార్జీలు పడకుండా నెట్ వాడాలంటే అందుకోసం ప్రత్యేక ప్యాకేజీలను కూడా టెలికాం సంస్థలు అందిస్తున్నాయి.
First published: March 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...