దేశీయ ప్రయాణీకులకు ఆయా రాష్ట్రాల New Guidelines .. ఏ రాష్ట్రంలో ఎటువంటి నిబంధనలో చూడండి

దేశీయ ప్రయాణీకుల సంఖ్య పెరిగేకొద్దీ, అనేక రాష్ట్రాలు తమ క్వారంటైన్ నిబంధనలను, మార్గదర్శకాలను మార్చాయి. కొన్ని రాష్ట్రాలు కేవలం థర్మల్ స్క్రీనింగ్ మాత్రమే అమలు చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్ టెస్ట్ లేదా క్వారంటైన్‌ను అమలు చేస్తున్నాయి.

news18-telugu
Updated: October 28, 2020, 5:17 PM IST
దేశీయ ప్రయాణీకులకు ఆయా రాష్ట్రాల New Guidelines .. ఏ రాష్ట్రంలో ఎటువంటి నిబంధనలో చూడండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా మహమ్మారి కారణంగా మార్చ్ 22 నుండి దేశంలో విమాన రాకపోకలు స్తంభించిన విషయం తెలిసిందే. తద్వారా దాదాపు రెండు నెలలపాటు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే, మే 22 నుండి దేశంలో వివిధ మార్గాలల్లో తిరిగే విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దీంతో మే నెలలో  దేశీయ విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య 30,000లు ఉండగా, అక్టోబరులో వారి సంఖ్య 1,60,000ల మందికి పెరిగింది. దేశీయ ప్రయాణీకుల సంఖ్య పెరిగేకొద్దీ, అనేక రాష్ట్రాలు తమ క్వారంటైన్ నిబంధనలను, మార్గదర్శకాలను మార్చాయి. వీటికి అనుగుణంగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రెండు క్యాటగిరీలుగా విభజించబడ్డాయి. కొన్ని రాష్ట్రాలు కేవలం థర్మల్ స్క్రీనింగ్ మాత్రమే అమలు చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్ టెస్ట్ లేదా క్వారంటైన్‌ను అమలు చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు చేర్చిన కొత్త మార్గదర్శకాలను పరిశీలిద్దాం.

ఇక్కడ థర్మల్ స్క్రీనింగ్ మాత్రమే..

పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జార్ఖండ్, హర్యానా, గుజరాత్, గోవా, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్.

ఇక్కడ కోవిడ్ టెస్ట్ లేదా తప్పనిసరి క్వారంటైన్

అండమాన్ & నికోబార్ దీవులు, త్రిపుర, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ, మణిపూర్, జమ్మూ అండ్ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ (రెడ్ జోన్ జిల్లాలకు), అసోం.

వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల New Guidelines

అండమాన్ & నికోబార్ దీవులుఅండమాన్ & నికోబార్ దీవుల్లో ప్రవేశించే ప్రయాణికులందరూ విమానాశ్రయంలో తప్పనిసరిగా కోవిడ్–19 పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వారు నెగెటివ్ వచ్చేవరకు లేదా ఏడు రోజుల వరకు క్వారంటైన్లో ఉండాలి.

ఆంధ్రప్రదేశ్

విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ జరుపుతారు. కోవిడ్ లక్షణాలు లేని ప్రయాణీకులకు క్వారంటైన్ తప్పనిసరి కాదు.

అసోం

విమానాశ్రయంలో జరిపే కోవిడ్ టెస్ట్‌లో నెగెటివ్ వచ్చిన ప్రయాణికులు 10 నుండి-14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి కాదు. అదే రోజు రిటర్న్ టికెట్ ఉన్నవారు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు.

బీహార్, చండీగర్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్

థర్మల్ స్క్రీనింగ్ మరియు క్వారంటైన్ తప్పనిసరి కాదు.

హిమాచల్ ప్రదేశ్

రెడ్ జోన్ల నుండి వచ్చే ప్రయాణీకులకు క్వారంటైన్ తప్పనిసరి.

జమ్మూ & కశ్మీర్

ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ కోవిడ్–19 పరీక్ష ఉంటుంది. కరోనా నిర్థారణ అయితే తప్పనిసరిగా హోమ్ క్వారంటైన్లో ఉండాలి.

కేరళ

ఈ–పాస్ తప్పనిసరి. ఏడు రోజుల లోపు మాత్రమే కేరళను సందర్శించే ప్రయాణీకులకు హోం క్వారంటైన్ నుండి మినహాయింపు ఉంది. కోవిడ్–19 నిర్ధారణ అయిన మిగతా వారు 7–14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలి.

మణిపూర్

థర్మల్ స్క్రీనింగ్ మరియు క్వారంటైన్లో ఉండాలి.

మేఘాలయ

వచ్చే ప్రయాణీకులందరికీ కోవిడ్ టెస్ట్ మరియు 14 రోజుల తప్పనిసరి హోం క్వారంటైన్.

మిజోరం

ఎమ్–పాస్ తప్పనిసరి, ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్, క్వారంటైన్ తప్పనిసరి.

నాగాలాండ్

ప్రయాణీకులందరికీ థర్మల్ స్క్రీనింగ్, హోం క్వారంటైన్ తప్పనిసరి.

పంజాబ్

కోవిడ్ లక్షణాలు లేని ప్రయాణీకులకు 5 రోజుల హోమ్ క్వారంటైన్. 72 గంటల్లో బయలుదేరే ప్రయాణీకులకు, కార్పొరేట్ ప్రయాణికులకు క్వారంటైన్ అవసరం లేదు.

తమిళనాడు

థర్మల్ స్క్రీనింగ్, 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ తప్పనిసరి. బిజినెస్ ప్రయాణికులకు మినహాయింపు.

త్రిపుర

వచ్చే ప్రయాణికులందరికీ కోవిడ్ పరీక్ష ఉంటుంది. 14 రోజుల పాటు హోం క్వారంటైన్,  కార్పొరేట్ ప్రయాణికులకు మినహాయింపు ఉంటుంది.

ఉత్తరాఖండ్

థర్మల్ స్క్రీనింగ్, ఏడు రోజుల కన్నా తక్కువ సందర్శన కోసం వచ్చే వారు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు.

ఉత్తర ప్రదేశ్

థర్మల్ స్క్రీనింగ్, ఏడు రోజుల కన్నా తక్కువ సందర్శన కోసం వచ్చే వారికి 14 రోజుల హోం క్వారంటైన్ అవసరం లేదు.
First published: October 28, 2020, 5:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading