కరోనా వైరస్ సంక్షోభం కారణంగా పలు రకాల రుణాలు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI మారటోరియం అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. మార్చి నుంచి ఆగస్ట్ వరకు 6 నెలల పాటు మారటోరియం కొనసాగింది. ఈఎంఐలపై మారటోరియం గడువు ఆగస్ట్ 31న ముగిసింది. అంటే సెప్టెంబర్ 1 నుంచి రుణాలపై పాత నిబంధనలే అమలులోకి వచ్చాయి. ఇప్పట్నుంచి ఈఎంఐలు గతంలోలాగానే చెల్లించాలి. అయితే రీపేమెంట్ పద్ధతి ఎలా ఉంటుందన్న సందేహాలు రుణగ్రహీతల్లో ఉన్నాయి. మారటోరియం ఎంచుకున్న రోజులు కస్టమర్లు రుణాలు చెల్లించలేదు. వాటిని తప్పనిసరిగా తిరిగి చెల్లించాలి. తిరిగి చెల్లించడానికి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ ఎలా పనిచేస్తాయో, వాటిలో ఏది ఎంచుకుంటే మంచిదో తెలుసుకోండి.
మొదటి ఆప్షన్: ఈఎంఐలతో పాటు వడ్డీ కలిపి మొత్తం ఒకేసారి చెల్లించొచ్చు. వన్ టైమ్ రీపేమెంట్ ద్వారా మీరు వాయిదా వేసిన ఈఎంఐలు, దానిపై వడ్డీ చెల్లిస్తే చాలు. మిగతా ఈఎంఐలు ఎప్పట్లాగానే ఉంటాయి. ఉదాహరణకు ఓ వ్యక్తి 20 ఏళ్లకు 8.50 శాతం చొప్పున రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నాడని అనుకుందాం. ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు 5 ఈఎంఐలు వాయిదా వేశాడు. నెలకు రూ.43,391 చొప్పున ఈఎంఐ చెల్లించాలి. ఐదు ఈఎంఐలు వాయిదా వేశాడు కాబట్టి రూ.43,391 x 5 = రూ.2,16,955 చెల్లించాలి. దీనికి వడ్డీ కూడా చెల్లించాలి.
UPI: గూగుల్ పే, ఫోన్ పేలో పేమెంట్స్ చేస్తున్నా? ఈ ఫీచర్ గురించి తెలుసుకోండి
LIC Kanyadan Policy: రూ.121 పొదుపుతో మీ అమ్మాయి పెళ్లికి రూ.27 లక్షలు... అసలు లెక్క ఇదే
రెండో ఆప్షన్: వాయిదా వేసిన ఈఎంఐలను ఔట్స్టాండింగ్తో కలిపి ఈఎంఐ పెంచమని కోరొచ్చు. పైన చెప్పిన ఉదాహరణ ప్రకారం ఈఎంఐ పెంచమని కోరితే అదనంగా రూ.10,68,491 వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఈఎంఐ రూ.43,391 బదులు రూ.45,316 చెల్లించాలి. టెన్యూర్‌లో ఎలాంటి మార్పు ఉండదు.
మూడో ఆప్షన్: ఈఎంఐ మార్చకుండా లోన్ టెన్యూర్ పొడిగించమని అడగొచ్చు. అయితే ఈఎంఐ ఎంత ఉంటుంది, టెన్యూర్ ఎంత పెరుగుతుంది అన్నది లోన్ వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. పైన చెప్పిన దాని ప్రకారం చూస్తే 240 నెలలుగా ఉన్న టెన్యూర్ 270 నెలలు అవుతుంది. అంటే 5 నెలలు ఈఎంఐ వాయిదా వేయడం వల్ల 30 ఈఎంఐలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
నాలుగో ఆప్షన్: మారటోరియం కారణంగా పెరిగిన వడ్డీని మరో లోన్‌గా మార్చుకోవచ్చు. అంటే ఐదు నెలల ఈఎంఐల మొత్తం+వడ్డీ కలిపి మరో లోన్‌గా మార్చాలి. దీని వల్ల హోమ్ లోన్ ఈఎంఐతో పాటు కొత్త లోన్ ఈఎంఐ కూడా చెల్లించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loans, Car loans, Corona, Corona virus, Coronavirus, Covid-19, Gold loans, Home loan, Housing Loans, Personal Finance, Personal Loan