హోమ్ /వార్తలు /బిజినెస్ /

Volvo: వోల్వో కీలక నిర్ణయం... 2030 నుంచి పూర్తిగా ఎలక్ట్రిక్​వాహనాల అమ్మకం

Volvo: వోల్వో కీలక నిర్ణయం... 2030 నుంచి పూర్తిగా ఎలక్ట్రిక్​వాహనాల అమ్మకం

Volvo Fully Electric: ప్రపంచ ఆటో మొబైల్ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీవైపు దృష్టి మళ్లిస్తున్నాయి. వోల్వో తీసుకున్న నిర్ణయం... పెను సంచలనానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి.

Volvo Fully Electric: ప్రపంచ ఆటో మొబైల్ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీవైపు దృష్టి మళ్లిస్తున్నాయి. వోల్వో తీసుకున్న నిర్ణయం... పెను సంచలనానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి.

Volvo Fully Electric: ప్రపంచ ఆటో మొబైల్ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీవైపు దృష్టి మళ్లిస్తున్నాయి. వోల్వో తీసుకున్న నిర్ణయం... పెను సంచలనానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి.

  Volvo Fully Electric: పెట్రోల్, డీజిల్​ఇంజిన్‌తో నడిచే వాహనాలతో కాలుష్యం పెరుగుతున్న కారణంగా అన్ని కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వెహికిల్స్​తయారీకి సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే చైనా యాజమాన్యంలోని ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో... 2030 నాటికి తమ పెట్రోల్, డీజిల్​కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. వీటికి బదులు పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్​వాహనాలను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇక, 2025లో తమ అమ్మకాల్లో సగం ఎలక్ట్రిక్ కార్లే ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, వోల్వో ఇప్పటికే పూర్తి ఎలక్ట్రిక్ వాహనమైన ఎక్స్‌సి 40 రీఛార్జిని మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చింది.

  "పెట్రోల్, డీజిల్​ ఇంజిన్​కార్లకు దీర్ఘకాలిక భవిష్యత్తు లేదు. అందుకే భవిష్యత్తులో పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించాలని నిర్ణయించాం. మా వినియోగదారుల అంచనాలను అందుకోవడానికి, వాతావరణ మార్పులతో పోరాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నాం.’’ అని వోల్వో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ హెన్రిక్ గ్రీన్ అన్నారు.

  వోల్వో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, సి 40 రీఛార్జ్‌ వాహనాన్ని ఈమధ్యే ఆవిష్కరించింది. సీ40 ఎలక్ట్రిక్​ కారు XC40 మాదిరిగానే పనిచేస్తుంది. కానీ, దీని రూఫ్​లైన్​, ముందు హెడ్‌లైట్లు, గ్రిల్ ప్రాంతాల్లో కొన్ని మార్పులు చేసింది. వోల్వో తమ కార్ల అమ్మకాలను ఆన్‌లైన్​ ద్వారానే జరపాలని యోచిస్తోంది. తద్వారా కార్ల ధరలు పారదర్శకంగా ఉంటాయని తెలిపింది.

  ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్​లో అగ్రగామిగా ఉన్న టెస్లా అనుసరించే వ్యూహాన్నే వోల్వో కూడా పాటిస్తున్నట్లు తెలుస్తోంది. వోల్వో ఇప్పటికే ఎక్స్‌సి 40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ మోడళ్లను ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి తేనుంది. వీటి డెలివరీలు, సర్వీసులను డీలర్లకు అప్పగించనుంది.

  అన్ని వాహన తయరీ సంస్థలదీ ఇదే బాట:

  ఇతర కార్ల సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని వేగవంతం చేయడానికి ఇటీవల తమ ప్రణాళికలను ప్రకటించాయి. 2030 నాటికి యూరప్‌లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లను మాత్రమే విక్రయించాలని యోచిస్తున్నట్లు ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ తెలిపింది. ఇక, 2035 నాటికి ఉద్గార రహిత వాహనాలను మాత్రమే విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జనరల్ మోటార్స్ (GM) ఇటీవల ప్రకటించింది.

  వాహనాల నుంచి గ్రీన్​హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి యూరప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కార్ల తయారీదారులు నియమ నిబంధనలను పాటించకపోతే భారీ జరిమానాలను విధించనున్నట్లు తెలిపింది. దీంతో, యూకేలోని అన్ని కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మొగ్గుచూపుతున్నాయి. తద్వారా, యునైటెడ్ స్టేట్స్ కంటే యూరప్​లోనే ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ ఊపందుకోనుంది.

  ఇది కూడా చదవండి: Vastusashtra: మీ మూల సంఖ్య ఆధారంగా... ఇంట్లో ఈ వస్తువుల్ని ఈ దిశలో ఉంచండి

  ఇదిలా ఉంటే ప్రస్తుతం, జర్మన్ వాహన తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ యూరప్‌లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో అగ్రస్థానంలో ఉంది. ఎలక్ట్రిక్​ వాహనాల అగ్రగామి సంస్థ టెస్లా కూడా తన మొదటి వాహన తయారీ ఫ్యాక్టరీని యూరోప్‌లో నిర్మిస్తోంది. ఇది ఈ ఏడాది చివరి కల్లా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సాంప్రదాయ పెట్రోల్​, డీజిల్ ఇంజిన్లతో పనిచేసే కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్లు చౌకగా లభిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

  First published:

  Tags: Automobiles, BUSINESS NEWS

  ఉత్తమ కథలు