news18-telugu
Updated: August 3, 2020, 4:46 PM IST
ప్రతీకాత్మకచిత్రం
మారుతి సుజుకి (Maruti Suzuki)నుండి కొత్త ఎస్-క్రాస్ (S-Cross) పెట్రోల్ వెర్షన్ కారు ఆగస్టు 5న విడుదల కానుంది. కొత్త ఎస్-క్రాస్ (S-Cross)పెట్రోల్‌ను మొదట ఆటో ఎక్స్పో 2020(Auto Expo 2020)లో ప్రదర్శించారు. ఈ మోడల్ కారును ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారని ప్రకటించారు. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ దెబ్బ కారణంగా ఈ కారు విడుదలను వాయిదా వేయవలసి వచ్చింది. అంతకుముందు, ఎస్-క్రాస్ కారు డీజిల్ ఇంజిన్‌తో లభించింది. పాత పెట్రోల్ మోడల్ ఉత్పత్తిని నిలిపివేశారు. మారుతి కూడా డీజిల్ వాహనాల తయారీని పూర్తిగా నిలిపివేసింది. ఎస్-క్రాస్ ఇతర కార్ల మాదిరిగానే పెట్రోల్ ఇంజన్ ఎంపికతో లభించనుంది.
Maruti Suzuki S-Cross కు Vitara Brezza తరహాలోనే కె 15 బి పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఇది 104 హెచ్‌పి పవర్ మరియు 138 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. తక్కువ rpms వద్ద టార్క్ మెరుగుపరచడం ద్వారా మైలేజీని పెంచే తేలికపాటి హైబ్రిడ్ వ్యవస్థ కూడా ఈ కారులో అదనంగా లభిస్తుంది. ఎస్-క్రాస్ పెట్రోల్‌లో 5 స్పీడ్ మాన్యువల్, 4 స్పీడ్ ఆటోమేటిక్ వేరింయంట్లలో లభిస్తోంది.
కొత్త ఇంజిన్ తప్ప మారుతి ఎస్-క్రాస్ రూపకల్పనలో పెద్దగా వేరే మార్పులు లేవు. మునుపటిలాగే, అక్రోస్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు క్రూయిజ్ కంట్రోల్‌తో వస్తుంది. పెట్రోల్ మోడల్ ఆటోమేటిక్ వెర్షన్లో మాత్రమే తేలికపాటి-హైబ్రిడ్ వ్యవస్థను పొందుతుంది.
ఎస్-క్రాస్ ఫేస్ లిఫ్ట్ డెల్టా, జీటా మరియు ఆల్ఫా అనే మూడు వేరియంట్లలో విడుదల కానుంది. నవీకరించబడిన ఎస్-క్రాస్ ధర 8 లక్షల నుండి 12 లక్షల రూపాయల మధ్య ఉంటుందని అంచనా. ఇది మార్కెట్లో రెనాల్ట్ డస్టర్‌తో పోటీ పడనుంది. ఎస్-క్రాస్ సంస్థ యొక్క నెక్సా ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించబడుతుంది. కొంతమంది డీలర్లు కొత్త ఎస్-క్రాస్ కోసం 11,000 రూపాయలకు అనధికారిక బుకింగ్ తీసుకోవడం ప్రారంభించారు.
Published by:
Krishna Adithya
First published:
August 3, 2020, 4:46 PM IST