Home /News /business /

AUTO EXPO DATES AUTO EXPO SHOW MANAGEMENT IN JANUARY 2023 EVENT CANCELED THIS YEAR DUE TO CORONA GH VB

Auto Expo Dates: ఆటో ఎక్స్‌పో షో నిర్వహణ తేదీ ఖరారు.. కరోనా కారణంగా ఈ ఏడాది రద్దు.. ఆ వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోనే ప్రముఖ ఆటోమొబైల్ షో(Automobile Show) తదుపరి ఎడిషన్.. ఆటో ఎక్స్‌పో వచ్చే ఏడాది జనవరి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా ఆటో ఎక్స్‌పో రద్దైంది.

దేశంలోనే ప్రముఖ ఆటోమొబైల్ షో(Automobile Show) తదుపరి ఎడిషన్.. ఆటో ఎక్స్‌పో వచ్చే ఏడాది జనవరి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా ఆటో ఎక్స్‌పో(Auto Expo) రద్దైంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(Corona Virus) వ్యాప్తి చెందుతుందనే భయాల మధ్య ద్వైవార్షిక ఆటోమొబైల్ షో చివరి ఎడిషన్ 2020 ఫిబ్రవరిలో జరిగింది. ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో(Noida) జరగాల్సి ఉండగా మళ్లీ కరోనా విజృంభణతో వాయిదా పడింది. సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్(Auto Mobile) మాన్యుఫ్యాక్చరర్స్(SIAM- Society Of Automobile Manufacturers) డైరక్టర్ జనరల్ రాజేష్ మీనన్ మాట్లాడుతూ..‘2023 మోటార్ షో(ఆటో ఎక్స్‌పో) జనవరి 13వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఖరారైంది. ఇండియా ఎక్స్‌పో మార్ట్ గ్రేటర్ నోయిడాలో కార్యక్రమం జరుగుతుంది. జనవరి 11వ తేదీన మీడియా కోసం ప్రత్యేకంగా కార్యక్రమం ఉంటుంది.

Bank Holidays: రేపటి నుంచి వరుసగా బ్యాంకులు బంద్... 11 రోజుల్లో 4 రోజులే సేవలు

జనవరి 12వ తేదీన ప్రారంభ వేడుక జరుగుతుంది. మీడియా, ప్రత్యేక అతిథులు, డీలర్ల కోసం ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం.’ అని చెప్పారు.ఆటో ఎక్స్‌పో గ్రేటర్ నోయిడాలో జరుగుతుండగా.. మరోవైపు ఆటో కాంపోనెంట్స్ షో పునరుద్ధరించిన ప్రగతి మైదాన్ కాంప్లెక్స్‌లో జరుగుతుంది. గత ఏడాది ఆగస్టులో విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ‘మీనన్ ఆటో ఎక్స్‌పో వంటి బిజినెస్-టు-కన్స్యూమర్ (B2C) షోలో ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. పెద్ద సంఖ్యలో ప్రజలు సందర్శిస్తారు. అందరూ భౌతిక దూరం పాటించేలా చేయడం కష్టం.’ అని చెప్పారు.

కరోనా కారణంగా ఈ ఏడాది రద్దు..

అందువల్ల ఆటో ఎక్స్‌పో మోటార్ షోను ప్రస్తుతానికి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఆటో ఎక్స్‌పోలో పాల్గొన్న, హాజరైన ఎగ్జిబిటర్లు, సందర్శకులు, అన్ని వాటాదారుల భద్రత ఎస్​ఐఏఎమ్​ అత్యంత ప్రాధాన్యమని మీనన్ గుర్తించారు. ఆయన గత సంవత్సరం మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విజృంభణ పొంచి ఉందని, మూడో వేవ్‌ వచ్చే అవకాశం ఉన్నందున ఆటో ఎక్స్‌పోను నిర్వహించడంలో ముప్పును, కష్టాలను, నష్టాలను భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ, SIAM గుర్తించాయని పేర్కొన్నారు.

ఆటో ఎక్స్‌పో 2020కి దాదాపు ఆరు లక్షల మంది సందర్శకులు వచ్చారు. ఫ్లాగ్‌షిప్ ఆటో షోలో 108 ఎగ్జిబిటర్ల నుంచి దాదాపు 70 ఉత్పత్తులు లాంచ్‌ అయ్యాయి. 352 ఉత్పత్తి ప్రదర్శనలు జరిగాయి. కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గింది. మార్చి 17వ తేదీన ఆరోగ్య శాఖ విడుదల చేసిన సమాచారం మేరకు.. ఢిల్లీలో 144 కొవిడ్‌ కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. అయితే పాజిటివిటీ రేటు 0.39 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశ రాజధానిలో కేసుల సంఖ్య 18,63,345కి పెరగగా, మరణాల సంఖ్య 26,144కి పెరిగిందని హెల్త్ బులెటిన్ పేర్కొంది.

Traffic Challan: ఈ ఒక్క పని చేస్తే ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవచ్చు

జనవరి 14వ తేదీన ఢిల్లీలో 30.6 శాతం పాజిటివిటీ రేట్‌ నమోదు అయింది. ఇది మహమ్మారి కొనసాగుతున్న సమయంలో అత్యధికం. కొన్ని వారాల్లో ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న రోగుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. మహమ్మారి మూడో వేవ్ సమయంలో ఢిల్లీలో కకరోనా కేసుల పెరుగుదల ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా జజరిగింది.
Published by:Veera Babu
First published:

Tags: Auto expo, Automobiles, Covid19

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు