Home /News /business /

AUTO DEBIT TO LPG PRICES KNOW ABOUT NEW RULES WILL IMPLEMENT FROM OCTOBER 1 SS

New Rules in October: అక్టోబర్‌లో అమల్లోకి వచ్చే 6 కొత్త రూల్స్ ఇవే... తెలుసుకోండి

New Rules in October: అక్టోబర్‌లో అమల్లోకి వచ్చే 6 కొత్త రూల్స్ ఇవే... తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

New Rules in October: అక్టోబర్‌లో అమల్లోకి వచ్చే 6 కొత్త రూల్స్ ఇవే... తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

New Rules in October | క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, చెక్ బుక్స్ లాంటి విషయంలో అక్టోబర్‌లో కొత్త రూల్స్ (New Rules) అమల్లోకి రానున్నాయి. అవి మీపై ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

    మీరు ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరుపుతుంటారా? క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్స్ చేస్తుంటారా? అయితే అలర్ట్. అక్టోబర్‌లో కొత్త రూల్స్ (New Rules) అమల్లోకి రాబోతున్నాయి. ఆర్థిక లావాదేవీలు (Financial Transactions) జరిపేవారిని ఈ రూల్స్ ప్రభావితం చేయబోతున్నాయి. కొన్ని బ్యాంకుల చెక్ బుక్స్ పనిచేయవు. ఆటోడెబిట్ రూల్స్ కూడా మారుతున్నాయి. కాబట్టి ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి. అక్టోబర్‌లో అమల్లోకి రాబోయే కొత్త రూల్స్ ఏంటీ? అవి మీపై ఎలా ప్రభావితం చూపిస్తాయి? తెలుసుకోండి.

    Cheque Book: ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (OBC), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) పాత చెక్ బుక్స్ 2021 అక్టోబర్ 1 నుంచి పనిచేయవు. ఈ విషయంపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కొంతకాలంగా కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది. eOBC, eUNI పాత చెక్ బుక్స్ పనిచేయవని, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్ బుక్స్ తీసుకోవాలని కోరుతోంది.

    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వెనక ఉన్న అసలు మతలబేంటో తెలుసా?

    Auto Debit: మీరు ఆటోమేటెడ్ పేమెంట్స్ కోసం మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారా? అంటే అమెజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్స్ కోసం మీ కార్డు వివరాలు ఇచ్చారా? అక్టోబర్ 1 నుంచి ఆటోడెబిట్ ఆప్షన్ పనిచేయదు. అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆథెంటికేషన్ (AFA) జోడించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. మీకు ముందుగానే సమాచారం అందుతుంది. మీరు అనుమతిస్తేనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది.

    ATM New Rule: ఏటీఎంలో డ్రా చేయడానికి వెళ్తే డబ్బులు లేవా? అయితే బ్యాంకులు మీకు రూ.10,000 ఫైన్ చెల్లిస్తాయి. ఏటీఎంలో డబ్బుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI కొత్త రూల్స్ అమలు చేయనుంది. ఒక ఏటీఎంలో నెలలో 10 గంటల పైన నగదు లేనట్టైతే బ్యాంకు రూ.10,000 చొప్పున పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూల్స్ అక్టోబర్‌లో అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

    Aadhaar-Ration card linking: ఆధార్‌ నెంబర్‌ను రేషన్ కార్డుతో లింక్ చేయాలా... ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ప్రాసెస్ ఇదే

    Pension Rule: పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ రూల్స్ మారుతున్నాయి. 80 ఏళ్ల వయస్సుదాటిన వారు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను అన్ని హెడ్ పోస్ట్ ఆఫీసుల్లోని జీవన్ ప్రమాన్ సెంటర్‌లో సమర్పించాల్సి ఉంటుంది. 2021 అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వొచ్చు.

    Investments: అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు అంటే మ్యూచువల్ ఫండ్ హౌజ్‌లల్లో పనిచేసే జూనియర్ స్థాయి ఉద్యోగులు తమ గ్రాస్ సాలరీలో 10 శాతాన్ని మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ కొత్త రూల్స్ ప్రకటించింది. అక్టోబర్ 1న ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి.

    LPG Prices: ప్రతీ నెల ఒకటో తేదీన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తుంటాయి ఆయిల్ కంపెనీలు. సెప్టెంబర్ 1న గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. మరి అక్టోబర్ 1న గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతాయా లేక తగ్గుతాయా అన్న విషయం చూడాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: ATM, Atm Card, Atm centre, Atm withdrawal, Credit cards, New rules, Personal Finance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు