news18-telugu
Updated: August 6, 2019, 6:53 PM IST
బ్యాంకులకు వరుస సెలవలు
ఆగస్టు నెల రెండవ వారంలో బ్యాంకులు ఆరు రోజుల్లో కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆగస్టు 10 నుంచి 15వ తేదీలోగా దాదాపు నాలుగు రోజులు సెలవులు రావడంతో బ్యాంకు సేవలు బంద్ కానున్నాయి. ఆగస్టు 10వ తేదీ రెండవ శనివారం, ఆ తర్వాత 11వ తేదీ ఆదివారం, 12వ తేదీ బక్రీద్ కలిసి రావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత సరిగ్గా రెండు పని దినాల తర్వాత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో బ్యాంకులకు ఆ రోజున కూడా సెలవు దినం ఉంది. అయితే ఈ సెలవు దినాల్లో నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి ఆన్లైన్ చెల్లింపులు కూడా పనిచేయవు. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బ్యాంకర్లు సూచిస్తున్నారు.
Published by:
Krishna Adithya
First published:
August 6, 2019, 6:49 PM IST