Bank holidays: ఆగస్టు రెండోవారంలో బ్యాంకులకు వరుసగా సెలవులు...

Bank holidays : ఈ సెలవు దినాల్లో నెఫ్ట్, ఆర్టీజీఎస్‌ వంటి ఆన్‌లైన్‌ చెల్లింపులు కూడా పనిచేయవు. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బ్యాంకర్లు సూచిస్తున్నారు.

news18-telugu
Updated: August 6, 2019, 6:53 PM IST
Bank holidays: ఆగస్టు రెండోవారంలో బ్యాంకులకు వరుసగా సెలవులు...
బ్యాంకులకు వరుస సెలవలు
  • Share this:
ఆగస్టు నెల రెండవ వారంలో బ్యాంకులు ఆరు రోజుల్లో కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆగస్టు 10 నుంచి 15వ తేదీలోగా దాదాపు నాలుగు రోజులు సెలవులు రావడంతో బ్యాంకు సేవలు బంద్ కానున్నాయి. ఆగస్టు 10వ తేదీ రెండవ శనివారం, ఆ తర్వాత 11వ తేదీ ఆదివారం, 12వ తేదీ బక్రీద్‌ కలిసి రావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత సరిగ్గా రెండు పని దినాల తర్వాత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో బ్యాంకులకు ఆ రోజున కూడా సెలవు దినం ఉంది. అయితే ఈ సెలవు దినాల్లో నెఫ్ట్, ఆర్టీజీఎస్‌ వంటి ఆన్‌లైన్‌ చెల్లింపులు కూడా పనిచేయవు. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బ్యాంకర్లు సూచిస్తున్నారు.
First published: August 6, 2019, 6:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading