AUGUST BANK HOLIDAYS 2021 BANKS WILL CLOSE 9 DAYS IN AUGUST IN TELANGANA AND ANDHRA PRADESH CHECK HERE FOR DATES SS
Bank Holidays in August 2021: ఆగస్టులో బ్యాంకులకు సెలవులే సెలవులు... ఎప్పుడెప్పుడో తెలుసుకోండి
Bank Holidays in August 2021: ఆగస్టులో బ్యాంకులకు సెలవులే సెలవులు... ఎప్పుడెప్పుడో తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)
August Bank Holidays 2021 | ఆగస్ట్ వచ్చిందంటే పండుగల సీజన్ మొదలవుతుంది. సెలవులు కూడా పెరుగుతాయి. మరి ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని సెలవులు వచ్చాయో, ఏఏ రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకోండి.
ఆగస్టులో మీకు ముఖ్యమైన బ్యాంకు పనులు ఉన్నాయా? అయితే అలర్ట్. ఆగస్టులో బ్యాంకులకు చాలానే సెలవులు వచ్చాయి. సాధారణంగా ఉండే సెలవులతో పాటు ఇతర హాలిడేస్ కూడా ఉన్నాయి. బ్యాంకులకు ఆదివారం, రెండో శనివారం, నాలుగో శనివారం సెలవులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఆగస్టులో 5 ఆదివారాలు వచ్చాయి. ఇవి కాకుండా పబ్లిక్ హాలిడేస్ కూడా ఉంటాయి. ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలవు ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి ఆగస్ట్ 15 ఆదివారం వచ్చింది. కాబట్టి ఇండిపెండెన్స్ డే సెలవు ఆదివారంలో కలిసిపోయింది. ఇక ఆగస్టులో మొహర్రం, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెలవులు ఉన్నాయి. మొత్తం కలిపి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బ్యాంకులకు 9 రోజులు సెలవులు ఉంటాయి. మరి 2021 ఆగస్టులో ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.
August Bank Holidays 2021: ఆగస్టులో బ్యాంకులకు సెలవుల వివరాలు ఇవే...
2021 ఆగస్ట్ 1- ఆదివారం
2021 ఆగస్ట్ 8- ఆదివారం
2021 ఆగస్ట్ 14- రెండో శనివారం
2021 ఆగస్ట్ 15- ఆదివారం, ఇండిపెండెన్స్ డే
2021 ఆగస్ట్ 19- మొహర్రం (గురువారం)
2021 ఆగస్ట్ 22- ఆదివారం
2021 ఆగస్ట్ 28- నాలుగో శనివారం
2021 ఆగస్ట్ 29- ఆదివారం
2021 ఆగస్ట్ 31- శ్రీకృష్ణ జన్మాష్టమి (మంగళవారం)
ఆగస్టులో బ్యాంకు ఉద్యోగులు ఒక లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 28 నాలుగో శనివారం, ఆగస్ట్ 29 ఆదివారం ఉండటంతో వరుసగా రెండు సెలవులు వచ్చాయి. ఆగస్ట్ 30 సోమవారం ఒకరోజు సెలవు పెడితే ఆగస్ట్ 31 మంగళవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెలవు వచ్చింది. ఒక రోజు సెలవు తీసుకుంటే వరుసగా నాలుగు రోజులు లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఈ సెలవుల జాబితాను అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉంటుంది. https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లింక్ క్లిక్ చేసి సెలవుల వివరాలను తెలుసుకోవచ్చు. ఆగస్ట్ మాత్రమే కాదు... వచ్చే ఏడాదికి సంబంధించిన సెలవులను ఈ ఏడాది డిసెంబర్లోనే అప్డేట్ చేస్తుంది ఆర్బీఐ. రీజనల్ ఆఫీసుల వారీగా సెలవుల వివరాలు తెలుసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుల వివరాలను తెలుసుకోవాలంటే హైదరాబాద్ సర్కిల్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ సర్కిల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏ నెల సెలవుల వివరాలు కావాలో ఆ నెల సెలెక్ట్ చేస్తే చాలు. ఆ నెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయో తెలుసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.