హోమ్ /వార్తలు /బిజినెస్ /

Audi Q7 Limited Edition: ఇండియాలో ఆడి Q7 SUV లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. దీని ధర, స్పెసిఫికేషన్లు ఇవే..

Audi Q7 Limited Edition: ఇండియాలో ఆడి Q7 SUV లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. దీని ధర, స్పెసిఫికేషన్లు ఇవే..

Audi Q7 Limited Edition: ఇండియాలో ఆడి Q7 SUV లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. దీని ధర, స్పెసిఫికేషన్లు ఇవే..

Audi Q7 Limited Edition: ఇండియాలో ఆడి Q7 SUV లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. దీని ధర, స్పెసిఫికేషన్లు ఇవే..

ఆడి కంపెనీ Q7 లిమిటెడ్ ఎడిషన్‌ను (Audi Q7 Limited Edition) ఇండియాలో లాంచ్ చేసింది. అయితే ఈసారి 50 SUV యూనిట్లను మాత్రమే కంపెనీ విడుదల చేసింది. దీంట్లో అందించిన ఫీచర్లు, ధర, డిజైన్, ఇంజన్ పవర్ వంటి విషయాలు తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి ఇండియా (Audi India) భారత్‌లో ఎప్పటికప్పుడు అద్భుతమైన కార్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా Q7 లిమిటెడ్ ఎడిషన్‌ను (Audi Q7 Limited Edition) ఇండియాలో లాంచ్ చేసింది. అయితే ఈసారి 50 SUV యూనిట్లను మాత్రమే కంపెనీ విడుదల చేసింది. దీంట్లో అందించిన ఫీచర్లు, ధర, డిజైన్, ఇంజన్ పవర్ వంటి విషయాలు తెలుసుకుందాం. ఆడి కంపెనీ గతంలోనే Q7 SUVని ఇండియాలో పరిచయం చేసింది. అయితే దానిలో అందించిన పవర్ అవుట్‌పుట్, పీక్ టార్క్, కొత్తగా విడుదలైన లిమిటెడ్ ఎడిషన్‌లో అందించిన పవర్, టార్క్ కూడా అలాగే ఉన్నాయి. ఈ సరికొత్త ఎస్‌యూవీలో 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో 3.0L V6 TFSI పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఈ కారు 335 bhp కంబైన్డ్ పవర్ అవుట్‌పుట్, 500 Nm పీక్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. Q7 లిమిటెడ్ ఎడిషన్ గరిష్ఠంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ, 5.9 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకుంటుంది.

Tax Benefits : ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్..ఈ రూల్స్ పాటించకపోతే ఆదాయ పన్ను ప్రయోజనాలు రద్దు!

ఈ కారు ఆటో, కంఫర్ట్, డైనమిక్, ఎఫిషియెన్సీ, ఆఫ్-రోడ్, ఆల్-రోడ్, ఇండివిడ్యువల్ అనే ఏడు డ్రైవ్ మోడ్స్‌తో వస్తుంది. ఇందులో ఆడి క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ వంటివి స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా వస్తాయి.

* ధర, కలర్ ఆప్షన్స్, డిజైన్

ఆడి Q7 లిమిటెడ్ ఎడిషన్‌ ధరను (Audi Q7 Limited Edition Price) రూ.88.08 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా కంపెనీ నిర్ణయించింది. ఈ 50 యూనిట్ల కార్లు బారిక్యూ బ్రౌన్ అనే ఎక్స్‌క్యూజివ్ కలర్ ఆప్షన్స్‌లో రిలీజ్ అయ్యాయి. దీనిలోని ఫ్లాట్ సింగిల్-ఫ్రేమ్ గ్రిల్‌ ఆక్టాగోనల్ అవుట్‌లైన్‌, కొత్త సిల్ ట్రిమ్‌తో వస్తుంది. ఈ కారులో అందించిన 19-అంగుళాల 5-ఆర్మ్ స్టార్ స్టైల్ డిజైన్ అల్లాయ్ వీల్స్‌, హై-గ్లోస్ స్టైలింగ్ ప్యాకేజీ, ఇంటిగ్రేటెడ్ వాషర్ నాజిల్‌, రన్నింగ్ బోర్డ్‌లు, క్వాట్రో ఎంట్రీ LED, సిల్వర్‌ ఆడి రింగ్ ఫాయిల్, అడాప్టివ్ విండ్‌షీల్డ్ వైపర్స్‌ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. కారు క్యాబిన్‌ డిజిటల్ ఆపరేటింగ్ కాన్సెప్ట్‌తో డ్రైవర్-ఓరియంటెడ్ ర్యాప్‌రౌండ్ కాక్‌పిట్ డిజైన్‌లో వస్తుంది.

* ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ 7-సీటర్ SUVలో పనోరమిక్ సన్‌రూఫ్, డ్రైవర్-సైడ్ మెమరీ ఫంక్షన్‌తో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, అడ్జస్టబుల్ ఫోర్ & ఆఫ్ఫ్ పొజిషన్ (Aft position), రిక్లైన్‌తో సెకండ్ రో సీట్లు, 30 కలర్స్‌తో యాంబియంట్ లైటింగ్ ప్యాకేజీ ప్లస్, ఆడి వర్చువల్ కాక్‌పిట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. కారు క్యాబిన్‌లో 2 పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్స్‌ ఇచ్చారు. MMI నావిగేషన్ ప్లస్, MMI టచ్ రెస్పాన్స్‌తో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వస్తుంది.

అలానే ఇందులో ఎలక్ట్రికల్‌ ఫోల్డబుల్ థర్డ్ రో సీట్లు, ఆడి స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్, 19 స్పీకర్లతో 730W B&O ప్రీమియం 3D సౌండ్ సిస్టమ్, క్రికెట్ లెదర్ సీటు మెత్తలు, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌, 4-జోన్ ఎయిర్ కండీషనర్ కోసం 8.6-అంగుళాల MMI టచ్ కంట్రోల్ ప్యానెల్ ఆఫర్ చేశారు. ఈ కంట్రోల్ ప్యానెల్ ఎయిర్ అయోనైజర్, ఆరోమటైజేషన్‌తో వస్తుంది.

హాస్పిటల్ లో పేషెంట్ కి ఎమర్జెన్సీ..ట్రాఫిక్ జామ్ లో డాక్టర్..అతడి పనికి దేశం సెల్యూట్

కీలెస్ కంఫర్ట్ కీ, గెస్చర్-బేస్డ్ ఆపరేషన్స్‌ ఇందులో అందుబాటులో ఉంటాయి. దీనికోసం ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్‌ను అందించారు. ఈ కారులో సేఫ్టీ కోసం 8 ఎయిర్‌బ్యాగ్స్‌, స్పీడ్ లిమిటర్‌తో క్రూజ్ కంట్రోల్, 360° కెమెరాతో పార్క్ అసిస్ట్ ప్లస్, స్టీరింగ్ అసిస్ట్‌తో లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లు ఇచ్చారు.

Published by:Veera Babu
First published:

Tags: Audi, Auto mobile, Business, CAR

ఉత్తమ కథలు