హోమ్ /వార్తలు /బిజినెస్ /

July 2020 New Rules: ఏటీఎం నుంచి పీఎఫ్ వరకు... నేటి నుంచి మారే రూల్స్ ఇవే

July 2020 New Rules: ఏటీఎం నుంచి పీఎఫ్ వరకు... నేటి నుంచి మారే రూల్స్ ఇవే

July 2020 New Rules: ఏటీఎం నుంచి పీఎఫ్ వరకు... నేటి నుంచి మారే రూల్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

July 2020 New Rules: ఏటీఎం నుంచి పీఎఫ్ వరకు... నేటి నుంచి మారే రూల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

New Rules | జూలై 1 వచ్చేసింది. కొత్త రూల్స్ కూడా వచ్చేశాయి. మీరు ఎక్కువగా లావాదేవీలు జరిపేటట్టైతే కొత్త రూల్స్ తెలుసుకోండి.

  రెండో దశ అన్‌లాక్ మొదలైంది. దీంతో ఆర్థిక లావాదేవీలు ఊపందుకోవడం ఖాయం. జూలై 1 నుంచి అనేక రూల్స్ అమలులోకి రానున్నాయి. లాక్‌డౌన్ కారణంగా కొన్ని నియమనిబంధనల్ని సడలించిన సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి మళ్లీ పాత రూల్స్ అమల్లో ఉంటాయి. ఏటీఎం విత్‌డ్రాయల్ ఛార్జీలు, అటల్ పెన్షన్ యోజన, పీఎఫ్ నిబంధనలు, మినిమమ్ బ్యాలెన్స్ మెయింటనెన్స్ లాంటి అంశాల్లో జూల్ 1 నుంచి మార్పులు ఉంటాయి. అవేంటో తెలుసుకోండి.

  Minimum Balance Charges: కరోనా వైరస్ సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వం సేవింగ్స్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను కూడా తొలగించింది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు లేవు. జూలై 1 నుంచి ఛార్జీలు వర్తిస్తాయి.

  July Bank Holidays: జూలైలో బ్యాంకులకు సెలవులు ఎప్పుడంటే...

  ATM Rules: కరోనా వైరస్ సంక్షోభం కారణంగా బ్యాంకులు ఏటీఎం నగదు విత్‌డ్రా నిబంధనల్ని సడలించి కస్టమర్లకు ఊరట కలిగించిన సంగతి తెలిసిందే. బ్యాంకులు ఏటీఎం సర్వీస్ ఛార్జీలను తొలగించాయి. ఉచిత ట్రాన్సాక్షన్స్ తర్వాత ఎన్నిసార్లు డబ్బులు డ్రా చేసినా ఛార్జీలు ఉండేవి కావు. కానీ ఈ సడలింపులు కేవలం 2020 జూన్ 30 వరకు మాత్రమే. జూలై 1 నుంచి పాత ఏటీఎం రూల్స్ వర్తిస్తాయి.

  Gold Loan: ఆన్‌లైన్‌లో గోల్డ్ లోన్... ఇలా తీసుకోవచ్చు

  EPF withdrawal rules: కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఉద్యోగులు నగదు కొరతతో ఇబ్బంది పడకూడదని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO కరోనా వైరస్ పాండమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF ఖాతాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75% లేదా మూడు నెలల బేసిక్+డీఏలో ఏది తక్కువ అయితే అది విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ అవకాశం జూన్ 30 వరకే.

  Tatkal Booking: గుడ్ న్యూస్... ప్రత్యేక రైళ్లకు తత్కాల్ బుకింగ్ ప్రారంభం


  Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన అకౌంట్‌లో ఆటో డెబిట్ ఫెసిలిటీ జూలై 1న ప్రారంభం కానుంది. 2020 ఏప్రిల్ నుంచి ఆగస్ట్ మధ్య అటల్ పెన్షన్ యోజన కంట్రిబ్యూషన్లను సెప్టెంబర్ 30 లోగా రెగ్యులరైజ్ చేస్తే ఎలాంటి పీనల్ ఇంట్రెస్ట్ ఛార్జీలు ఉండవు.

  Sabka Vishwas Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సబ్‌కా విశ్వాస్ స్కీమ్ 2019 ను జూలై 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ లాంటి అంశాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని పరిష్కరించేందుకు ఈ స్కీమ్‍ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్ జూలై 30న ముగిసింది.

  TRAI App: గుడ్ న్యూస్... మీ కేబుల్, డీటీహెచ్ బిల్లుల్ని తగ్గించేందుకు ట్రాయ్ కొత్త యాప్

  Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్, సిస్టమెటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్స్ ఎంచుకునేవారి నుంచి యూనిఫామ్ స్టాంప్ డ్యూటీని జూలై 1 నుంచి వసూలు చేయనున్నారు. డెట్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కి ఇది వర్తిస్తుంది. ఇకపై మ్యూచువల్ ఫండ్స్‌కు 0.005 శాతం స్టాంప్ డ్యూటీ, డీమ్యాట్ అకౌంట్ ద్వారా తీసుకునే మ్యూచువల్ ఫండ్స్‌కు 0.015 శాతం స్టాంప్ డ్యూటీ వర్తిస్తుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Atal Pension Yojana, ATM, EPFO, Investment Plans, Mutual Funds, Personal Finance, Save Money

  ఉత్తమ కథలు