ATM Services: ఏటీఎం నుంచి మరిన్ని ఉచిత సేవలు... ఇలా పొందండి

ATM Services | పర్సనల్ లోన్ కావాలా? మీరు ఏటీఎంలోనే అప్లై చేయొచ్చు. ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఉంటే వెంటనే డబ్బులు మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. మీ కార్డు స్వైప్ చేసిన తర్వాత మీకు లోన్ ఆప్షన్స్ చూపిస్తాయి.

news18-telugu
Updated: May 12, 2019, 9:29 AM IST
ATM Services: ఏటీఎం నుంచి మరిన్ని ఉచిత సేవలు... ఇలా పొందండి
ATM: ఏటీఎం నుంచి మరిన్ని ఉచిత సేవలు... ఇలా పొందండి (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 12, 2019, 9:29 AM IST
ఏటీఎం... 90 శాతం మంది ఈ మెషీన్‌ను డబ్బులు డ్రా చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ... ఏటీఎంలో మరిన్ని సేవలు పొందొచ్చు అన్న విషయం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ఏటీఎంలో ఉచితంగా డబ్బులు డ్రా చేయడంతో పాటు మరిన్ని సేవల్ని ఫ్రీగా పొందొచ్చు. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా ఏటీఎంకు వెళ్లి మరీ బ్యాంకింగ్ సేవల్ని పొందొచ్చు. బ్యాంకులు కూడా ఏటీఎంల ద్వారా సేవల్ని పెంచి... కస్టమర్లు బ్యాంకుకు రావాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాయి. ఏటీఎంలో సేవల్ని ఉపయోగించుకోవడం ద్వారా బ్యాంకులకు వెళ్లి గంటలు గంటలు క్యూలో నిలబడాల్సిన అవసరం కూడా ఉండదు. మరి ఏటీఎంల ద్వారా డబ్బులు డ్రా చేయడం కాకుండా ఇంకా ఏఏ సేవలు సాధ్యమో తెలుసుకోండి.

1. ఫిక్స్‌డ్ డిపాజిట్: మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయాలా? ఇందుకోసం మీరు బ్యాంకుకే వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు ఏ బ్రాంచ్‌లో అకౌంట్‌ ఉందో ఆ బ్రాంచ్ ఏటీఎంకు వెళ్తే చాలు. ఏటీఎంలోని ఆప్షన్స్‌లో మీకు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆప్షన్ కనిపిస్తుంది. అయితే ఏటీఎం ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేముందు ఓసారి వివరాలన్నీ తెలుసుకోవడం మంచిది.

Read this: SBI: మీ ఎస్‌బీఐ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లోనే మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా...

State bank of india, SBI ATM Services, ATM Train ticket booking, ATM Cash transfer, ATM Loan application, ATM centers, ATM Cash Withdrawal, ATM Balance Enquiry, ATM PIN Change, ATM Cash Deposit, ATM Cheque Deposit, ATM Bill Payment, బ్యాంకింగ్ సర్వీసెస్ ఏటీఎం సేవలు, ఏటీఎం రైలు టికెట్ బుకింగ్, ఏటీఎం మనీ ట్రాన్స్‌ఫర్, ఏటీఎం లోన్, ఏటీఎం సెంటర్స్, ఏటీఎం క్యాష్ డిపాజిట్, ఏటీఎం బిల్ పేమెంట్, ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రతీకాత్మక చిత్రం




2. పన్ను చెల్లింపులు: చాలా బ్యాంకులు ఏటీఎంల ద్వారా పన్నులు చెల్లించే సదుపాయం కల్పిస్తున్నాయి. అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్, రెగ్యులర్ అసెస్‌మెంట్ లాంటి పన్నుల్ని మీరు ఏటీఎం ద్వారా చెల్లించొచ్చు. ఇందుకోసం మీరు ముందుగా బ్యాంక్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏటీఎంలో ట్యాక్స్ చెల్లించొచ్చు. మీకు వెంటనే CIN నెంబర్ కూడా వస్తుంది. 24 గంటల తర్వాత బ్యాంకు వెబ్‌సైట్ నుంచి ఇన్వాయిస్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

3. క్యాష్ డిపాజిట్: మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏటీఎంలోనే క్యాష్ డిపాజిట్ చేయొచ్చు. అన్ని బ్యాంకులూ క్యాష్ డిపాజిట్ మెషీన్లను ఏటీఎంలల్లో ఏర్పాటు చేస్తున్నాయి. మీరు ఒకేసారి గరిష్టంగా రూ.49,900 వరకు డిపాజిట్ చేయాలి. క్యాష్ డిపాజిట్ మెషీన్లలో రూ.2000, రూ.500, రూ.100, రూ.50 నోట్లను డిపాజిట్ చేయొచ్చు.

4. ఇన్స్యూరెన్స్ పాలసీ ప్రీమియం: మీరు పాలసీ ప్రీమియం చెల్లించాలా? ఏటీఎంలో చేసేయొచ్చు. అవును... ఎల్ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ లాంటి సంస్థలకు చెందిన పాలసీల ప్రీమియం ఏటీఎంలో చెల్లించొచ్చు. ఇందుకోసం మీ పాలసీ నెంబర్ మీ దగ్గరుండాలి. మీ ఇన్స్యూరెన్స్ కంపెనీ పేరు సెలెక్ట్ చేసి, పాలసీ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలను వెరిఫై చేయాలి. చివరగా ప్రీమియం అమౌంట్ ఎంతో టైప్ చేసి కన్ఫమ్ చేస్తే చాలు. పేమెంట్ పూర్తవుతుంది.
Loading...
Read this: Aadhaar Card: ఆధార్ కార్డును ఎక్కడంటే అక్కడ డౌన్‌లోడ్ చేస్తున్నారా? జాగ్రత్త...

State bank of india, SBI ATM Services, ATM Train ticket booking, ATM Cash transfer, ATM Loan application, ATM centers, ATM Cash Withdrawal, ATM Balance Enquiry, ATM PIN Change, ATM Cash Deposit, ATM Cheque Deposit, ATM Bill Payment, బ్యాంకింగ్ సర్వీసెస్ ఏటీఎం సేవలు, ఏటీఎం రైలు టికెట్ బుకింగ్, ఏటీఎం మనీ ట్రాన్స్‌ఫర్, ఏటీఎం లోన్, ఏటీఎం సెంటర్స్, ఏటీఎం క్యాష్ డిపాజిట్, ఏటీఎం బిల్ పేమెంట్, ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రతీకాత్మక చిత్రం


5. లోన్ దరఖాస్తు: పర్సనల్ లోన్ కావాలా? మీరు ఏటీఎంలోనే అప్లై చేయొచ్చు. ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఉంటే వెంటనే డబ్బులు మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. మీ కార్డు స్వైప్ చేసిన తర్వాత మీకు లోన్ ఆప్షన్స్ చూపిస్తాయి. అందులో లోన్‌కు దరఖాస్తు చేయొచ్చు.

6. క్యాష్ ట్రాన్స్‌ఫర్: మీకు నెట్ బ్యాంకింగ్ లేదా? అయినా మీరు ఏటీఎం ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఈ సదుపాయం కోసం మీరు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకేసారి రూ.40,000 వరకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. రోజులో న్నిసార్లైనా నగదు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

Read this: Smartphone: రూ.10,000 లోపు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే...

State bank of india, SBI ATM Services, ATM Train ticket booking, ATM Cash transfer, ATM Loan application, ATM centers, ATM Cash Withdrawal, ATM Balance Enquiry, ATM PIN Change, ATM Cash Deposit, ATM Cheque Deposit, ATM Bill Payment, బ్యాంకింగ్ సర్వీసెస్ ఏటీఎం సేవలు, ఏటీఎం రైలు టికెట్ బుకింగ్, ఏటీఎం మనీ ట్రాన్స్‌ఫర్, ఏటీఎం లోన్, ఏటీఎం సెంటర్స్, ఏటీఎం క్యాష్ డిపాజిట్, ఏటీఎం బిల్ పేమెంట్, ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రతీకాత్మక చిత్రం


7. బిల్ పేమెంట్: టెలిఫోన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ లాంటి బిల్లుల్ని కూడా మీరు ఏటీఎంలో చెల్లించొచ్చు. ఈ సేవలు పొందేందుకు ముందుగా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.

8. రైలు టికెట్ బుకింగ్: రైలు టికెట్లు కూడా ఏటీఎంలో బుక్ చేసుకోవడం సాధ్యం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సేవల్ని అందిస్తోంది.

9. మరిన్ని సేవలు: ఇవే కాకుండా బ్యాలెన్స్ ఎంక్వైరీ, స్టేట్‌మెంట్, పిన్ ఛేంజ్, చెక్ డిపాజిట్, క్రెడిట్ కార్డ్ పేమెంట్, చెక్ బుక్ రిక్వెస్ట్, డొనేషన్స్ ఇలా మరిన్ని సేవలు కూడా లభిస్తాయి.
Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3

ఇవి కూడా చదవండి:

PAN Card: పాన్ కార్డులో తప్పుల్ని సరిచేసుకోండి ఇలా...

JIO New Plans: జియో ప్లాన్స్ ధరలు తగ్గాయి... రూ.149 ప్లాన్‌తో 42 జీబీ డేటా

Jio Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ జియో యాప్స్ ఉన్నాయా? ఉపయోగాలు తెలుసుకోండి
First published: May 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...