ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తున్నారా...అయితే బాదుడు షురూ...

ఏటీఎంలో నగదు విత్‌డ్రా, బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఇంటర్‌చేంజ్ ఫీజు పెంచాలని కోరుతూ భారత ఎటిఎం ఆపరేటర్ల సంఘం ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది.

news18-telugu
Updated: February 15, 2020, 10:50 PM IST
ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తున్నారా...అయితే బాదుడు షురూ...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఏటీఎంలో నగదు విత్‌డ్రా, బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఇంటర్‌చేంజ్ ఫీజు పెంచాలని కోరుతూ భారత ఎటిఎం ఆపరేటర్ల సంఘం ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. ఇందుకు కేంద్ర బ్యాంకు కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఒక బ్యాంకుకు చెందిన కార్డును వేరే బ్యాంకుకు చెందిన ఎటిఎంలో వినియోగించినప్పుడు సదరు ఎటిఎం ఆపరేటర్‌కు ఖాతాదారుడు ఇంటర్‌చేంజ్ ఫీజు చెల్లిస్తాడు. కస్టమర్లకు అయిదు ట్రాన్సాక్షన్లు ఉచితంగా ఇస్తున్నారు. ఆపైన జరిగే లావాదేవీలకు కొంత మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నారు. పరిమితి దాటిన తర్వాత చేసే నగదు ట్రాన్సాక్షన్లపై ( విత్‌డ్రాలు) రూ.15, నగదు రహిత ట్రాన్సాక్షన్ల (బ్యాలెన్స్ ఎంక్వైరీ)పై రూ.5 చొప్పున ఈ చార్జీలున్నాయి.

అయితే ఈ ఇంటర్‌చేంజ్‌ఫీజు చార్జీలను పెంచాలని కోరుతూ భారత ఎటిఎం ఆపరేటర్ల సంఘం ఈ నెల 13న ఆర్‌బిఐకి ఒక లేఖ రాసింది. ఎటిఎంల భద్రత, నిర్వహణ ప్రమాణాలను ఆర్‌బిఐ పెంచిన నేపథ్యంలో ఎటిఎంల నిర్వహణ భారంగా మారిందని,దీనివల్ల తమ వ్యాపారాలు భారీగా దెబ్బతింటున్నాయని ఆ లేఖలో పేర్కొంది. ఈ పరిణామాల కారణంగా కొత్త ఎటిఎంలను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నామని తెలిపింది. అందుకే ఆదాయాలను పెంచుకోవాలని అనుకుంటున్నామని పేర్కొంది. దీనిపై ఎటిఎం ఆపరేటర్లకు అనుకూలంగా ఆర్‌బిఐ నిర్ణయం తీసుకోవచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అదే జరిగితే ఖాతాదారుడిపై అదనపు భారం తప్పదు.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు