ATM NEW CHARGES TO CASH DEPOSIT KNOW ABOUT NEW RULES WILL IMPLEMENT FROM 2022 JANUARY SS
New Rules: సామాన్యులకు అలర్ట్... జనవరి నుంచి ఈ కొత్త రూల్స్
New Rules: సామాన్యులకు అలర్ట్... జనవరి నుంచి ఈ కొత్త రూల్స్
(ప్రతీకాత్మక చిత్రం)
New Rules From January 2022 | జనవరి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. మీరు ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నా, ఉద్యోగం చేస్తున్నా ఈ కొత్త రూల్స్ (New Rules) గుర్తుంచుకోవాలి.
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. న్యూ ఇయర్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. కొత్త సంవత్సరంలో కొత్త రూల్స్ (New Rules) అమల్లోకి రాబోతున్నాయి. ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు (Financial Transactions) జరిపేవారితో పాటు సామాన్యులను ఈ కొత్త నియమనిబంధనలు ప్రభావితం చేయనున్నాయి. బ్యాంకులో క్యాష్ డిపాజిట్, ఈపీఎఫ్ఓ నామినేషన్, జీఎస్టీ, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర (LPG Gas Cylinder Price)... ఇలా అనేక అంశాల్లో కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. మరి ఈ రూల్స్‌లో మిమ్మల్ని ప్రభావితం చేసే నియమనిబంధనలు ఏవో తెలుసుకోండి.
Cash Deposit: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) 2022 జనవరి 1 నుంచి క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాయల్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్లకు ఈ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకు ఖాతాను బట్టి ఉచిత లిమిట్ ఉంటుంది. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత క్యాష్ విత్‌డ్రాయల్, క్యాష్ డిపాజిట్లపై 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి చెల్లించాలి. ఈ ఛార్జీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
LPG Price: ఆయిల్ కంపెనీలన్నీ గ్యాస్ సిలిండర్ల ధరల్ని ప్రతీ నెలా ఒకటో తేదీన సవరిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నెల మధ్యలో కూడా ధరల్ని మారుస్తుంటాయి. మరి కొత్త ఏడాదిలో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అన్నది జనవరి 1న తెలుస్తుంది. ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు.
PF New Rule:ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (EPF Account) ఉన్నవారు 2021 డిసెంబర్ 31 లోగా నామినీ వివరాలు అప్డేట్ చేయాలని ఈపీఎఫ్ఓ కోరింది. ఇ-నామినేషన్ ఫైల్ చేయకపోతే ఈపీఎఫ్ఓ నుంచి రావాల్సిన ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు తలెత్తొచ్చు. నామినీ వివరాలు ఎలా అప్డేట్ చేయాలో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
ATM New Charges: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే 2022 జనవరి 1 నుంచి కొత్త ఛార్జీలు చెల్లించాలి. ట్రాన్సాక్షన్ లిమిట్ దాటిన తర్వాత ప్రస్తుతం ప్రతీ లావాదేవీకి రూ.20 + జీఎస్టీ చెల్లిస్తున్నారు కస్టమర్లు. జనవరి 1 నుంచి రూ.21 + జీఎస్టీ చొప్పున ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
Kawasaki India: కవాసాకి ఇండియా మోటార్ సైకిళ్ల ధరల్ని రూ.23,000 వరకు పెంచింది. కొత్త ధరలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2021 డిసెంబర్ 31 లోగా బుక్ చేసి 45 రోజుల్లో డెలివరీ తీసుకునే కస్టమర్లకు పాత ధరలే వర్తిస్తాయని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Hero MotoCorp: హీరో మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరల్ని పెంచింది హీరో మోటోకార్ప్. పెరిగిన ధరలు 2022 జనవరి 4 నుంచి అమల్లోకి వస్తాయి. హీరో మోటోకార్ప్ స్కూటర్ లేదా బైక్ కొనాలంటే ఎక్స్-షోరూమ్ ధరపై రూ.2,000 వరకు అదనంగా చెల్లించాలి. 2021 జూలై నుంచి ఇప్పటి వరకు బైకులు, స్కూటర్లపై రూ.8,000 వరకు ధర పెంచింది హీరో మోటోకార్ప్.
New Tax Rules: వ్యాపారులకు 2022 జనవరి 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్ అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టానికి పదికి పైగా సవరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సవరణలన్నీ కొత్త సంవత్సరంలో అమల్లోకి రానున్నాయి.
ITR Filing: పన్ను చెల్లింపుదారులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి 2021 డిసెంబర్ 31 చివరి తేదీ. 2022 జనవరి 1 నుంచి 2020-21 ఐటీఆర్ ఫైల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.