ATM CASH WITHDRAWALS TO MINIMUM BALANCE KNOW ABOUT BANK SERVICE CHARGES SS
Bank Charges: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఈ ఛార్జీల గురించి తెలుసా?
Bank Charges: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఈ ఛార్జీల గురించి తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)
Bank Service Charges | మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఓసారి మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ చెక్ చేసుకున్నారా? మీరు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు, మీ అకౌంట్లో క్రెడిట్ అయిన అమౌంట్ మాత్రమే కాదు, బ్యాంక్ స్టేట్మెంట్లో మీరు చెల్లిస్తున్న ఛార్జీలను ఎప్పుడైనా గమనించారా? ఆ ఛార్జీలేవో తెలుసుకోండి.
ప్రతీ అకౌంట్ హోల్డర్ నుంచి బ్యాంకులు కొన్ని రకాల ఛార్జీలను వసూలు చేస్తుంటాయి. ఆ ఛార్జీల వివరాలన్నీ బ్యాంక్ స్టేట్మెంట్లో ఉంటాయి. అందుకే కనీసం మూడు నెలలకోసారైనా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ చెక్ చేస్తే ఆ ఛార్జీల గురించి తెలుస్తుంది. సాధారణంగా ఛార్జీలకు సంబంధించిన వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో రావు. కాబట్టి వాటి గురించి మీకు తెలిసే అవకాశం తక్కువ. అకౌంట్ స్టేట్మెంట్ చెక్ చేసినప్పుడే ఈ విషయం బయటపడుతుంది. అందుకే ఓసారి అకౌంట్ స్టేట్మెంట్ చెక్ చేయండి. మీ నుంచి బ్యాంకు వసూలు చేస్తున్న ఛార్జీలేవో తెలుసుకోండి. బ్యాంకులు చాలా రకాల ఛార్జీలను వసూలు చేస్తుంటాయి. మరి ఆ ఛార్జీల వివరాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Cash Transactions: మీ డబ్బుతో మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తారు. అయినా క్యాష్ ట్రాన్సాక్షన్స్‌కు లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే బ్యాంకులు క్యాష్ ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు చేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే కాదు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ ఛార్జీలు వసూలు చేస్తాయి. ఉదాహరణకు యాక్సిస్ బ్యాంకులో నాలుగు ఉచిత ట్రాన్సాక్షన్స్, క్యాష్ విత్‌డ్రాయల్స్ లేదా నెలకు రూ.2,00,000 ట్రాన్సాక్షన్స్ ఉచితం. అది దాటినట్టైతే మీరు డ్రా చేసే ప్రతీ రూ.1,000 కి రూ.10 లేదా రూ.150 ఛార్జీ చెల్లించాలి.
ATM Withdrawal Charges: మీ అకౌంట్లో ఉన్న డబ్బును మీరు ఏటీఎం నుంచి డ్రా చేసినా ఛార్జీలు చెల్లించాలి. మీకు ఉన్న ఫ్రీ ట్రాన్సాక్షన్స్ లిమిట్ దాటిన తర్వాత ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఛార్జీలు ప్రతీ లావాదేవి రూ.20 నుంచి రూ.50 వరకు ఛార్జీలు చెల్లించాలి. ఈ ఛార్జీలు వేర్వేరు బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయి.
Failed ATM transaction: మీ అకౌంట్లో డబ్బులు లేక ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా? అయితే ఛార్జీలు చెల్లించాలి. ఎస్బీఐ రూ.20+జీఎస్టీ వసూలు చేస్తుండగా, ప్రైవేట్ బ్యాంకులు రూ.25+జీఎస్టీ వసూలు చేస్తున్నాయి.
Minimum Balance: మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ అందరికీ తెలిసినవే. అకౌంట్లో ఉండాల్సినంత బ్యాలెన్స్ లేకపోతే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. రూరల్, అర్బన్, మెట్రో నగరాల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ వేర్వేరుగా ఉంటాయి. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే రూ.5 నుంచి రూ.15 వరకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
Debit card charges: మీ ఏటీఎం కార్డు పోయిందా? కొత్త కార్డు కావాలంటే రూ.50 నుంచి రూ.500 వరకు ఛార్జీలు చెల్లించాలి. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మొదటిసారి మాత్రమే ఏటీఎం కార్డు ఉచితంగా వస్తుంది. ఆ తర్వాత రీప్లేస్ చేయాలంటే ఛార్జీలు చెల్లించక తప్పదు.
Cheque: మీరు ఎవరికైనా చెక్ ఇచ్చారా? చెక్ క్లియరెన్స్ ఛార్జీలు ఉంటాయి. ఒక చెక్ క్లియర్ కావడానికి రూ.150 వరకు ఛార్జీలు చెల్లించాలి. అయితే రూ.1,00,000 కన్నా ఎక్కువ విలువ ఉన్న చెక్స్‌కి మాత్రమే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. రూ.1,00,000 లోపు చెక్స్‌కి ఛార్జీలు ఉండవు. చెక్ బౌన్స్ అయినా ఛార్జీలు ఉంటాయి.
Documentation charges: బ్యాంకు నుంచి ఏవైనా డాక్యుమెంట్స్ పొందాలంటే ఛార్జీలు చెల్లించాలి. సాధారణంగా బ్యాంకులు ఏడాదికి ఒకసారి యాన్యువల్ స్టేట్మెంట్ను ఉచితంగా ఇస్తాయి. డూప్లికేట్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలంటే రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లించాలి. సిగ్నేచర్ వెరిఫికేషన్ లాంటి వాటికీ ఛార్జీలు ఉంటాయి.
SMS charges: మీ అకౌంట్లో జరిగే లావాదేవీలపై ఎస్ఎంఎస్లు వస్తున్నాయా? ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపడానికి కూడా బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయి. ఈ ఛార్జీలు బ్యాంకును బట్టి మారుతుంటాయి.
IMPS Money Transfer: నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలు ఉచితం అన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్-IMPS ద్వారా డబ్బులు పంపితే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు మీరు పంపే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఐఎంపీఎస్ ఛార్జీలు రూ.1 నుంచి రూ.25 మధ్య ఉంటాయి.
Failed ECS transaction: మీరు పేమెంట్స్, ఈఎంఐల కోసం ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్-ECS ఉపయోగిస్తున్నట్టైతే, ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్‌కు ఛార్జీలు ఉంటాయి. అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ లేనప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఈ ఛార్జీలు వర్తిస్తాయి.
Other charges: ఇవి మాత్రమే కాదు... బ్యాంకులు అనేక ఛార్జీలు వసూలు చేస్తాయి. అకౌంట్ క్లోజర్, కొత్త చెక్ బుక్, ఔట్ స్టేషన్ చెక్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, డిమాండ్ డ్రాఫ్ట్స్, రివార్డ్ పాయింట్స్ రిడెంప్షన్, పిన్ రీజెనరేషన్, లాకర్ రెంట్ లాంటి ఛార్జీలు కూడా ఉంటాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.