హోమ్ /వార్తలు /బిజినెస్ /

ATM Usage Tips: ఏటీఎంలో మనీ విత్‌డ్రా చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ టిప్స్ పాటిస్తే సేఫ్.. తప్పక తెలుసుకోండి

ATM Usage Tips: ఏటీఎంలో మనీ విత్‌డ్రా చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ టిప్స్ పాటిస్తే సేఫ్.. తప్పక తెలుసుకోండి

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

ఏటీఎం కార్డ్ స్కిమ్మింగ్ తరహా నేరాలు ఎక్కువ అవుతున్నాయి. ఏటీఎం మిషన్లలో, పెట్రోల్/ గ్యాస్ బంకులలో, సేల్స్ పాయింట్‌లను అడ్డాగా చేసుకుని కార్డ్ స్కిమ్మింగ్‌లకు పాల్పడుతున్నారు. కస్టమర్ల కార్డు సమాచారాన్ని రీడ్ చేసే డివైజ్‌లను అమర్చి డబ్బులను దొంగలిస్తారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు ఏటీఎం కేంద్రాలను టార్గెట్ చేస్తున్నారు. డెబిట్/ క్రెడిట్ కార్డుల సమాచారాన్ని తస్కరించి ఖాతాలోని డబ్బులను దోచేస్తున్నారు. ఈ మధ్య ఏటీఎం కార్డ్ స్కిమ్మింగ్ తరహా నేరాలు ఎక్కువ అవుతున్నాయి. ఏటీఎం మిషన్లలో, పెట్రోల్/ గ్యాస్ బంకులలో, సేల్స్ పాయింట్‌లను అడ్డాగా చేసుకుని కార్డ్ స్కిమ్మింగ్‌లకు పాల్పడుతున్నారు. కస్టమర్ల కార్డు సమాచారాన్ని రీడ్ చేసే డివైజ్‌లను అమర్చి డబ్బులను దొంగలిస్తారు. మరి, వీటి నుంచి తప్పించుకోవడం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

గుర్తు పట్టకుండా ఏర్పాటు

ఏటీఎం మిషన్లకు స్కిమ్మింగ్ డివైజ్‌లను సైబర్ నేరగాళ్లు ఏర్పాటు చేస్తారు. ఈ డివైజ్‌లను సులువుగా గుర్తించలేం. కార్డ్ రీడర్‌‌పై స్కిమ్మింగ్ డివైజ్‌లను అమరుస్తారు. ఈ డివైజ్‌లు మిషన్‌లో ఒక పార్ట్‌లా కనిపిస్తాయి. దీంతో కార్డ్ స్వైప్ చేసినప్పుడు ఈ డివైజ్ దానిపై ఉన్న ఇన్‌ఫర్మేషన్‌ని క్యాప్చర్ చేస్తాయి. ఈ సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు సేకరించి ఖాతాల్లోని డబ్బును తస్కరించే ప్రయత్నం చేస్తారు. కీ ప్యాడ్ పై కూడా నిఘా ఉంచేందుకు కొన్ని సీక్రెట్ కెమెరాలను అమరుస్తారు. పిన్ ఎంటర్ చేసే సమయంలో దానిని క్యాప్చర్ చేసేలా ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ సమాచారంతో డూప్లికేట్ కార్డును క్రియేట్ చేస్తారు. అనధికార కొనుగోళ్లు జరుపుతారు. ఈ విధంగా ఏటీఎం స్కిమ్మింగ్ మోసానికి సైబర్ నేరగాళ్లు పాల్పడే అవకాశం ఉంది.

తప్పించుకోవడం ఎలా?

ఏటీఎం స్కిమ్మింగ్ బారి నుంచి తప్పించుకోవడానికి తగు జాగ్రత్తలు పాటించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా బ్యాంకు ట్రాన్సాక్షన్లను చెక్ చేసుకుంటూ ఉండాలని చెబుతున్నారు. ఏటీఎం మిషన్‌లో పిన్ టైప్ చేసే సమయంలో మరొక చేతిని అడ్డుగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

చెక్ చేయండి

ఏటీఎం కేంద్రానికి వెళ్లినప్పుడు మిషన్‌ని కాస్త నిశితంగా పరిశీలించాలి. కీ ప్యాడ్ పై ఏమైనా కెమెరాలు అమర్చి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. కార్డ్ రీడర్‌పై అనుమానాస్పదంగా డివైజ్‌లు కనిపిస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఆ తర్వాతే కార్డ్‌ని యూజ్ చేయాలి.

పిన్ రాయకండి

చాలామందికి ఏటీఎం కార్డుపై పిన్ రాసుకోవడం అలవాటు. సులువుగా గుర్తు ఉండటానికి ఇలా చేస్తుంటారు. కానీ, ఈ పద్ధతి పాటించడం సేఫ్ కాదు. కార్డుపై ఎలాంటి నంబర్లు రాయకూడదు.

ఇతరులతో జాగ్రత్త

ఏటీఎం కేంద్రానికి వెళ్లినప్పుడు చాలామంది అపరిచితులు ఉంటారు. మీ జాగ్రత్తలో ఉండటానికి కాస్త దూరంగా ఉండండి. అందరూ వెళ్లిపోయాక ట్రాన్సాక్షన్ చేయడానికి ట్రై చేయండి. లేదా ఇతరులను కాస్త దూరంగా ఉండమని సానుకూలంగా చెప్పండి. మరీ సాన్నిహిత్యంగా మెలగకండి.

తెలియని వారికి ఇవ్వొద్దు

తెలియని వారికి ఏటీఎం కార్డు ఇవ్వొద్దు. క్యాష్ విత్ డ్రా చేయడానికి వారి సహకారం కోరవద్దు. స్ట్రేంజర్స్ చెప్పే సూచనలు పాటించవద్దు. ఏటీఎంల వద్ద అపరిచితులను నమ్మవద్దు. ఒకవేళ మీకు ఏటీఎం కార్డు వినియోగం తెలియక పోతే తెలిసిన వారిని మీతో తీసుకెళ్లడం మంచిది.

క్యాన్సల్ చేయడం మర్చిపోవద్దు

ఏటీఎం కేంద్రాల వద్ద క్యాష్ తీసుకున్నాక కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒక వేళ డబ్బులు విత్ డ్రా కాకపోతే కీ ప్యాడ్ పై ఉన్న ‘క్యాన్సిల్’ బటన్‌ని నొక్కాలి. హోమ్ స్క్రీన్ వచ్చాకే ఏటీఎం కేంద్రం నుంచి బయట అడుగు పెట్టాలి.

సేల్స్ పాయింట్ వద్ద..

సేల్స్ పాయింట్ వద్ద అప్రమత్తంగా ఉండండి. మీ ముందే ట్రాన్సాక్షన్ జరిపేలా చూడండి. క్లోనింగ్‌కి పాల్పడకుండా జాగ్రత్తతో వ్యవహరించండి.

తెలిసిన ఏటీఎంకే వెళ్లండి

మీకు బాగా తెలిసిన ఏటీఎం కేంద్రానికే వెళ్లండి. బ్యాంకు అనుబంధ ఏటీఎంలకు ప్రాధాన్యత ఇవ్వండి. తెలియని కేంద్రాలకు వెళ్లకపోవడం మంచిది. ట్యాంపరింగ్ చేసిన సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయో చెక్ చేయండి.

First published:

Tags: ATM, Cyber Attack, Tips

ఉత్తమ కథలు