• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • ATHER OKINAWA AMONG MANUFACTURERS OFFERING PRICE CUT OF UPTO RS 17900 AFTER FAME II SCHEME REVISION HERE FULL DETAILS NS GH

Electric Scooters: ఎలక్ట్రిక్​ వాహనాలపై మరో గుడ్ న్యూస్.. సబ్సిడీ పెంపుతో భారీగా తగ్గిన ఈ-స్కూటర్ల ధరలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

FAME-II Scheme Revision: ఎలక్ట్రిక్​ వాహనాల సబ్సిడీ స్కీమ్​ FAME II​ లో తాజాగా కేంద్రం సవరణలు చేసింది. తయారీ సంస్థలకు ఇస్తున్న సబ్సిడీని రెట్టింపు చేసింది. దీంతో ఎలక్ట్రిక్​ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి.​

  • Share this:
దేశంలో ఎలక్ట్రిక్ వాహన విక్రయాలను మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్​ వాహనాల సబ్సిడీ స్కీమ్​ FAME II​ లో తాజాగా కొన్ని సవరణలు చేసింది. ఈ సవరణలో భాగంగా తయారీ సంస్థలకు ఇస్తున్న సబ్సిడీని రెట్టింపు చేసింది. దీని వల్ల రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్​ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి.​ FAME-II స్కీమ్​లో తాజా సవరణల తరువాత, టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ. 11,250 మేర తగ్గించింది. అదేవిధంగా, మరో ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ అథర్ ఎనర్జీ రూ. 14,500 తగ్గింపును ప్రకటించింది. ఈ FAME II స్కీమ్​ కోసం 2019 మార్చిలో కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లు కేటాయించింది. అయితే, అనేక సవాళ్ల కారణంగా కేటాయించిన మొత్తాన్ని ఖర్చు చేయలేదు. ఈ స్కీమ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు కేవలం రూ. 220 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. తద్వారా, ఎలక్ట్రికల్​ వాహనాల అమ్మకాలు ఆశించిన మేర వృద్ధి చెందలేదు. అందువల్ల, ఇప్పుడు తయారీ సంస్థలకు మరిన్ని రాయితీలు ప్రకటించడంతో వరుసగా ధరల తగ్గింపును ప్రకటిస్తున్నాయి.
Electricity Bill: కరెంట్ బిల్ ఎక్కువగా వస్తోందా? అయితే.. ఈ సింపుల్ టిప్స్ తో బిల్ తగ్గించుకోండి
NIO ES8 Car: టెస్లాకు నిద్రపట్టకుండా చేస్తున్న చైనా....ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో కొత్త సంచలనం...

ఫేమ్ II స్కీమ్​ తాజా సవరణతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఒకినావా తన ఎలక్ట్రిక్ వాహనాల ధరను రివైజ్​ చేసింది. అన్ని మోడళ్లపై రూ.7,209 నుంచి రూ .17,892 మధ్య ధర తగ్గించినట్లు తెలిపింది. ఒకినావా ప్రెయిజ్​ ప్లస్​ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర గతంలో రూ .1,17,600 వద్ద ఉండగా.. దీని ధరను రూ .99,708కు తగ్గించింది. అదేవిధంగా, ప్రెయిజ్​ ప్రో ధర గతంలో రూ .84,795 వద్ద ఉండగా.. ఇప్పుడు, దానిపై రూ.7,947 ధర తగ్గించి రూ .76,848 వద్ద విక్రయించనుంది.

FAME II స్కీమ్​లో సవరణలు..
కేవలం ఈ-స్కూటర్ల ధరలే కాకుండా 2W, 3W ఎలక్ట్రిక్​ బస్సుల ధరలు కూడా తగ్గనున్నాయి. తద్వారా రాబోయే కాలంలో ఎలక్ట్రిక్​ వాహనాల డిమాండ్​ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కాగా, ఎలక్ట్రిక్​ ద్విచక్ర వాహనాల మీద ప్రస్తుతం గరిష్టంగా 20 శాతం రాయితీ ఇస్తున్నారు. అయితే, FAME-II స్కీమ్​లో తాజా మార్పుల వల్ల ఈ రాయితీ 40 శాతానికి పెరిగింది. ఫలితంగా, ఇకపై ఒక కిలోవాట్​ అవర్ (KWH)​ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ-స్కూటర్​ మీద రూ.15 వేల రాయితీ పొందవచ్చు, అదే 2 KWH బ్యాటరీ వాహనం మీద రూ. 30 వేలు, 3 KWH బ్యాటరీ వాహనం మీద రూ.45 వేల రాయితీ​ పొందే అవకాశం ఉంటుంది.

ఈ-బస్సుల విషయానికి వస్తే.. వీటిని ప్రధానంగా 4 మిలియన్లకు పైగా జనాభా ఉన్న ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, సూరత్, పూణే వంటి మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకొని కంపెనీలు విడుదల చేస్తున్నాయి. కాగా, అన్ని ఎలక్ట్రిక్​ వాహన తయారీ సంస్థలు ఇలా వరుసగా ఈ–వెహికిల్​ ధరలను తగ్గిస్తుండటంతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Nikhil Kumar S
First published: