Home /News /business /

ATHER ENERGY WILL ADD TWO MORE MODELS TO ITS 450 RANGE IN THE END OF THIS YEAR AK

Ather 450: ఏథర్ ఎనర్జీ నుంచి మరో రెండు కొత్త మోడల్స్.. మార్కెట్‌లోకి వచ్చేది ఎప్పుడంటే..

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్

Ather 450: బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఏథర్ ఎనర్జీ తన 450 పేరు మీద మరో రెండు కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఒక మోడల్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని, మరొకటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్ మాత్రమే పొందుతుందని కంపెనీ పేర్కొంది.

ఇంకా చదవండి ...
    దేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పెట్రోల్ ద్వారా నడిచే బైకులను తయారు చేస్తున్న కంపెనీలతో పాటు అనేక స్టార్టప్ కంపెనీలు ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలను తయారు చేసే విషయంలో పోటీ పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంటలు అంటుకుని ప్రమాదాలు జరిగినప్పటికీ.. వీటిని కొనేవారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఇక దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న ఏథర్ ఎనర్జీ.. త్వరలోనే మరో రెండు కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో తమ ప్రత్యేకతను చాటుకున్న ఏథర్ ఎనర్జీ, దాని ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌ను విస్తరిస్తోంది.

    Ather Energy ప్రస్తుతం మార్కెట్లో Ather 450 Plus, Ather 450X అనే మోడల్స్‌ను కలిగి ఉంది. ఏథర్ 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1,31,647 ఉండగా.. Ather 450X ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,50,657‌గా ఉంది. దేశంలోని నగరాలను బట్టి వీటి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఏథర్ ఎనర్జీ తన 450 శ్రేణికి మరో రెండు కొత్త మోడళ్లను యాడ్ చేయబోతున్నట్టు తెలిసింది. ఒక మోడల్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని, మరొకటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్ మాత్రమే పొందుతుందని తెలుస్తోంది.

    అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ ఈ రెండు స్కూటర్లు మార్కెట్‌లోకి తీసుకురావొచ్చని సమాచారం. ఇక ఏథర్ ఎనర్జీకి సంబంధించిన ప్రస్తుత మోడల్స్‌కు మంచి క్రేజ్ ఉంది. 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 4 సెకన్లలో సున్నా నుండి 40 కిమీ వేగాన్ని అందుకోగలదు. ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 80 కి.మీ. ఈ స్కూటర్ 3.3 సెకన్లలో సున్నా నుండి 40 కిమీ వేగాన్ని అందుకోగలదు. పూర్తి ఛార్జింగ్ 116 కి.మీ పరిధిని కలిగి ఉందని కంపెనీ చెబుతోంది. ఈ స్కూటర్ల బ్యాటరీకి సంబంధించి తమ బ్యాటరీ మూడున్నర గంటల్లో జీరో నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. స్కూటర్ సీటు కింద 22 లీటర్ల స్థలం ఇవ్వబడింది. స్కూటర్‌లో రివర్స్ అసిస్టెంట్ సిస్టమ్ ఇచ్చారు. దీంతో స్కూటర్‌ను పార్క్ చేయడం సులభం అవుతుంది.

    LIC IPO: మూడు రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన ఎల్ఐసీ ఐపీఓ... ఆ రోజే లిస్టింగ్

    RBL Agreement: ఇటాలియన్ కంపెనీతో రిలయన్స్ బ్రాండ్స్ ఒప్పందం.. ఇండియాలో ఆ ప్రొడక్ట్స్‌కు అధికారిక రిటైలర్ గా RBL..

    ఇదిలా ఉంటే ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బ్యాటరీ పేలుడు కేసుతో సహా దాదాపు అన్ని ఘటనల్లోనూ బ్యాటరీ సెల్‌తోపాటు బ్యాటరీ డిజైన్‌లో లోపాలున్నట్లు విచారణ కమిటీ సభ్యులు గుర్తించారు. నిపుణులు ఇప్పుడు వారి వాహనాలలో సంబంధిత బ్యాటరీ సమస్యలను పరిష్కరించడానికి EV తయారీదారులతో వ్యక్తిగతంగా పని చేయబోతున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Electric Bikes

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు