Electric Vehicles | బెంగూళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric Scooter) తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ దుమ్మురేపుతోంది. కంపెనీ అమ్మకాలు భారీగా పెరిగాయి. వార్షికంగా చూస్తే.. ఈ కంపెనీ వాహన అమ్మకాల్లో భారీ పెరుగుదుల నమోదు అయ్యింది. వార్షికంగా డిసెంబర్ నెలలో ఏకంగా 389 శాతం మేర పైకి కదిలాయి. 9187 యూనిట్లు నమోదు అయ్యాయి. అంటే జనాలు ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను (EV) తెగ కొనేస్తున్నారని చెప్పుకోవచ్చు.
ఏథర ఎనర్జీ డిసెంబర్ నెలలో పలు రకాల ఆఫర్లు తీసుకువచ్చింది. ఫైనాన్స్ ఆప్షన్లు, ఎక్స్చేంజ్ ప్లాన్, జీరో డౌన్ పేమెంట్ ఆఫర్ ఇలా పలు రకాల ప్రయోజనాలు కల్పించింది. దీంతో కంపెనీలు అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. జనాలు ఈ స్కూటర్లను తెగ కొనేస్తున్నారు. అంతేకాకుండా కంపెనీ ఈ కొత్త ఏడాదిలో కూడా అమ్మకాలను పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కంపెనీ ప్రస్తుతం నెలకు 8,000 నుంచి 9,000 వరకు యూనిట్లను నెలకు తయారు చేస్తోంది. ఈ సంఖ్యను 20 వేల యూనిట్లకు తీసుకువెళ్లాలని భావిస్తోంది. 2023 మార్చి కల్లా ఈ టార్గెట్ చేరుకోవాలని ప్రయత్నిస్తోంది.
శుభవార్త.. పడిపోయిన బంగారం ధర! ఈరోజు గోల్డ్ రేటు ఎంత తగ్గిందంటే?
కంపెనీ గత ఏడాది అక్టోబర్ నెలలో హోసూర్‌లో మరో ప్లాంటును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రొడక్షన్ పెరుగుదలకు ఈ ప్లాంటు చాలా కీలక అంశం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కంపెనీ దేశవ్యాప్తంగా డెలివరీ నెట్‌వర్క్‌ను కూడా పటిష్టం చేసుకోవాలని యోచిస్తోంది. తద్వారా సప్లై చెయిన్ ఒత్తిళ్లను తగ్గించాలని చూస్తోంది. పట్టణ ప్రాంతాల్లో కొత్త డీలర్ షిప్స్ ఓపెన్ చేయడానికి రెడీ అవుతోంది.
100 ఏళ్లు పూర్తి చేసుకున్న బ్యాంక్.. కస్టమర్లకు అదిరిపోయే గిఫ్ట్!
కాగా కేవలం ఏథర్ ఎనర్జీ మాత్రమే కాకుండా మార్కెట్‌లో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. హీరో నుంచి ఓలా వరకు చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నాయి. మీరు మీకు నచ్చిన మోడల్‌ను ఎంచుకొని కొనుగోలు చేయొచ్చు. చాలా వరకు కంపెనీలు ఈజీ ఫైనాన్స్ సదుపాయం కల్పిస్తున్నాయి. కొన్ని క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ వంటివి కూడా అందిస్తూ ఉంటాయి. ఓలా, టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది.
ఇకపోతే ఏథర్ ఎనర్జీ ఎక్స్450, ఏథర్ 450 ప్లస్ పేర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఏథర్ ఎక్స్ 450 ట్రూ రేంజ్ 105 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ గంటలకు 90 కిలోమీటర్లు. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకన్లలో అందుకుంటుంది. నావిగేషన్ విత్ గూగుల్ మ్యాప్స్, కాల్ నోటిఫికేషన్, మ్యూజిక్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ చార్జింగ్‌కు 5 గంటలకు పైనే పడుతుంది. ఈ స్కూటర్ల రేటు రూ.1.35 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రూ.2,500తో మీరు ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Electric Scooter, Electric Vehicles, Ev scooters, SCOOTER