Ather Scooters | మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందబాటులో ఉన్నాయి. డిసెంబర్ నెలలో పలు కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లపై (Electric Scooters) డిస్కౌంట్లు అందిస్తున్నాయి. పలు రకాల బెనిఫిట్స్ కల్పిస్తున్నాయి. అందువల్ల మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే.. ఈ ఆఫర్లను (Offers) ఒకసారి పరిశీలించొచ్చు.
ఓలా ఎలక్ట్రిక్ తన ప్రీమియం స్కూటర్‌పై రూ. 10 వేల తగ్గింపు అందిస్తోంది. ఓలా ఎస్ 1 ప్రో మోడల్‌కు ఇది వర్తిస్తుంది. ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తక్కువ వడ్డీకే రుణం పొందొచ్చు. ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వంటి బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. వడ్డీ రేటు 8.99 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. క్రెడిట్ కార్డు ఈఎంఐ పేమెంట్లపై అయితే 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా ఉంది.
ఇయర్ ఎండ్ ధమాకా ఆఫర్.. కారు కొంటే రూ.లక్షా 50 వేల డిస్కౌంట్!
అలాగే మరో పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ఏథర్ కూడా తన మోడళ్లపై అదిరే డీల్స్ అందుబాటులో ఉంచింది. మీరు మీ పాత టూవీలర్‌ను ఎక్స్చేంజ్ రూపంలో ఇచ్చేసి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయొచ్చు. మీ వెహికల్‌కు ఎంత ధర అయితే వస్తుందో దాన్ని డౌన్ పేమెంట్‌గా ఉపయోగించుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
కొత్త కారు.. ఇప్పుడే కొంటే రూ.లక్షల్లో తగ్గింపు, లేదంటే బాదుడే!
అలాగే ఇలా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద టూవీలర్ ఇస్తే.. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ. 4 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. దీని వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ ధర మరింత తగ్గుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కస్టమర్లు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే.. సులభంగానే లోన్ పొందొచ్చు. 48 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. అలాగే డౌన్ పేమెంట్ కూడా తక్కువే. కేవలం 5 శాతం చెల్లిస్తే చాలు. వడ్డీ రేటు 8.5 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. నెలవారీ ఈఎంఐ రూ.2975 నుంచి స్టార్ట్ అవుతుంది.
ఇంకా జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ పొందొచ్చు. కేవలం 45 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు లోన్ పొందొచ్చని కంపెనీ పేర్కొంటోంది. ఇంకా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ వెహికల్‌ను ఇచ్చేసి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పొందొచ్చు. అలాగే ఒక్క రూపాయి బ్యాటరీ ఎక్సెంటెడ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీకు ఐదేళ్ల పాటు బ్యాటరీ వారంటీ లభిస్తుంది. సాధారణంగా ఈ ఎక్సెంటెడ్ బ్యాటరీ వారంటీకి కంపెనీ రూ. 6,999 వసూలు చేస్తుంది. కాగా ఈ ఆఫర్లు అన్నీ ఈ నెల చివరి వరకే అందుబాటులో ఉంటాయని గుర్తించుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Scooter, Ev scooters, Latest offers, Offers, SCOOTER