Ather Energy | ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. సులభంగానే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల (Scooter)ను కొనుగోలు చేయొచ్చు. ఈజీ ఈఎంఐ (EMI) ఆప్షన్లు, తక్కువ డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజు వంటి బెనిఫిట్స్ లభిస్తున్నాయి. అందువల్ల మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావిస్తే.. సులభంగా కొనొచ్చు. మార్కెట్‌లో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. వీటిల్లో మనం ఇప్పుడు ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకుందాం.
ఏథర్ 450 ప్లస్, ఏథర్ 450 ఎక్స్ అనే వేరియంట్ల రూపంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకు కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఏథర్ 450 ప్లస్ రేటు రూ. 1,34,147గా ఉంది. అలాగే ఏథర్ 450 ఎక్స్ ధర రూ. 1,55,657గా ఉంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు. అంటే ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు, జీఎస్‌టీ వంటివి అదనం. ఈ స్కూటర్లపై మూడేళ్లు లేదా 30 వేల కిలోమీటర్ల వరకు వారంటీ లభిస్తుంది.
కేంద్రం కీలక నిర్ణయం.. 8 లక్షల కుటుంబాలకు ఉచితంగా డిష్ టీవీ!
ఈ స్కూటర్లపై ఆకర్షణీయమైన లోన్ ఆప్షన్లు లభిస్తున్నాయి. ఏధర్ 450 ప్లస్ స్కూటర్‌పై అయితే ఈఎంఐ రూ. 2975 నుంచి ప్రారంభం అవుతోంది. డౌన్ పేమెంట్ రూ. 36 వేలు కట్టాలి. అదే ఏథర్ 450 ఎక్స్ స్కూటర్ అయితే రూ. 39,500 డౌన్ పేమెంట్ కట్టాలి. నెలకు రూ. 3456 ఈఎంఐ పడుతుంది. అంతేకాకుండా ఈ స్కూటర్లపై జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. అయితే వెహికల్ ఎక్స్చేంజ్‌కు ఇది వర్తిస్తుంది.
ఉచితంగా ఎల్ఐసీ క్రెడిట్ కార్డులు.. ఫ్రీగా రూ.5 లక్షల బెనిఫిట్, ఇలా అప్లై చేసుకోండి!
అలాగే లోన్ తీసుకొని ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే.. వారికి జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ లభిస్తుంది. అలాగే తక్షణమై లోన్ పొందొచ్చు. వెహికల్ కాస్ట్‌లో 95 శాతం వరకు ఫైనాన్స్ లభిస్తుంది. ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌తో ఏథర్ ఎనర్జీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇప్పుడు ఏథర్ 450 ఎక్స్ మోడల్‌ను జీరో ప్రాసెసింగ్ ఫీజుతో లోన్ తీసుకొని కొంటే నెలకు ఎంత ఈఎంఐ పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ స్కూటర్ ఆన్‌రోడ్ ధర రూ. 1.62 లక్షలుగా ఉంది. వడ్డీ రేటు 8.5 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. డౌన్ పేమెంట్ రూ. 39 వేలు కట్టాలి. ఇప్పుడు 12 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 11,191 కట్టాలి. అదే 18 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 7753 చెల్లించాలి. 24 నెలల టెన్యూర్ అయితే రూ. 6 వేల ఈఎంఐ పడుతుంది. 30 నెలల టెన్యూర్‌కు రూ. 5 వేల ఈఎంఐ చెల్లించాలి. 36 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 4300 చెల్లించుకోవాలి. 40 నెలలు అయితే నెలకు రూ. 3871 కట్లి. ఇక 48 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 3456 చెల్లించాలి. అదే ఏథర్ 450 ప్లస్ మోడల్ అయితే డౌన్ పేమెంట్ రూ. 36 వేలుగా ఉంది. ఈఎంఐ రూ. 2974 నుంచి స్టార్ట అవుతుంది. 48 నెలలకు ఇది వర్తిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ather, Bank loan, Electric Scooter, Electric Vehicles