Money | కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్ అందిస్తోంది. ఇందులో చేరితే రిస్క్ లేకుండా రాబడి పొందొచ్చు. ఇంతకీ అది ఏ స్కీమ్ (Scheme) అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) స్కీమ్‌ను అందిస్తోంది. ఇది పెన్షన్ (Pension) స్కీమ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో చేరితే ప్రతి నెలా రూ. 5 వేల వరకు పొందొచ్చు. కనీసం రూ. 1000 పెన్షన్ వస్తుంది. అందువ్లల ఎవరైనీ ఈ స్కీమ్‌లో చేరాలని భావిస్తే.. వెంటనే చేరిపోండి.
భారత ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్‌లో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు చేరడానికి అర్హులు. అందువల్ల మీరు ఈ వయసు రేంజ్‌లో ఉంటే మీరు ఈ పథకంలో చేరిపోవచ్చు. 40 ఏళ్లు దాటితే చేరడానికి ఛాన్స్ లేదు. ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు ప్రతి నెలా కొంత మొత్త చెల్లిస్తూ వెళ్లాలి. మీ వయసు ప్రాతిపదికన చెల్లించాల్సిన మొత్తం కూడా మారుతుంది. ఇంకా ప్రతి నెలా పొందే పెన్షన్ ప్రాతిపదికన కూడా నెలవారీగా చెల్లించాల్సిన మొత్తం మారుతుంది.
క్షణాల్లో రూ.2 లక్షల లోన్.. మీ ఫోన్ ద్వారా అప్లై చేసుకోండిలా!
ఈ స్కీమ్‌లో చేరిన వారికి 60 ఏళ్లు వచ్చిన తర్వాతనే పెన్షన్ అందిస్తారు. రూ. 1000, రూ. 2 వేలు, రూ. 3000, రూ. 4 వేలు, రూ. 5000 చొప్పున పెన్షన్ పొందొచ్చు. మీరు రూ. 1000 పెన్షన్ పొందాలని భావిస్తే.. నెలకు రూ. 42 నుంచి చెల్లించాల్సి వస్తుంది. అదే రూ. 2 వేల కోసం అయితే నెలకు రూ. 84 నుంచి కట్టాల్సి ఉంటుంది. ఇంకా రూ. 3 వేల పెన్షన్ కోసం అయితే నెలకు రూ. 126 నుంచి పడుతుంది. అదే రూ. 4 వేల కోసం అయితే నెలకు రూ. 168 నుంచి కట్టాలి. ఇక రై. 5 వేల పెన్షన్ కోసం నెలకు రూ. 210 నుంచి చెల్లించాలి. 18 ఏళ్ల వయసులో స్కీమ్‌లో చేరిన వారికి ఈ రేట్లు వర్తిస్తాయి.
ఇంటర్, డిగ్రీ చదివే వారికి ఉచితంగానే ల్యాప్‌టాప్స్? కేంద్రం ఏమంటోందంటే..
అదే మీరు 40 ఏళ్ల వయసులో ఈ స్కీమ్‌లో చేరితే రూ. 1000 పెన్షన్ కోసం నెలకు రూ. 291 చెల్లించాలి. అదే రూ. 2 వేల కోసం రూ. 582 చెల్లించాలి. రూ. 3 వేల కోసం అయితే రూ. 873 చెల్లించాలి. రూ. 4 వేల కోసం అయితే రూ. 1164, రూ. 5 వేల కోసం రూ. 1454 చెల్లించాలి. అలాగే నామినీకి చివరిలో ఒకేసారి రూ. 8.5 లక్షలు లభిస్తాయి. రూ. 5 వేల పెన్షన్ ఆప్షన్‌కు ఇది వర్తిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Atal Pension Yojana, Central scheme, Money, Pension Scheme, Pensions