అటల్ పెన్షన్ యోజన-APY స్కీమ్‌లో ఉన్నవారికి అలర్ట్. 2020 ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు చెల్లించాల్సిన డబ్బుల్ని సెప్టెంబర్ 30 లోగా జమ చేయాలి. లేకపోతే జరిమానా చెల్లించాల్సి వస్తుందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ-PFRDA వెల్లడించింది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు చెల్లించాల్సిన అటల్ పెన్షన్ యోజన కంట్రిబ్యూషన్లకు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 30 లోగానే కంట్రిబ్యూషన్స్ జమ చేయాలి. ఆ తర్వాత జమ చేస్తే మాత్రం ఎప్పట్లాగే పెనాల్టీ చెల్లించక తప్పదు. అంతేకాదు... అటల్ పెన్షన్ యోజన-APY స్కీమ్‌లో కంట్రిబ్యూషన్లకు ఆటో డెబిట్ ఆప్షన్‌ను జూలై 1న తిరిగి ప్రారంభించారు. ఒకవేళ అకౌంట్లో సరిపడా డబ్బు లేకపోతే ఈ స్కీమ్‌లో జమ కాదు. వాటిని స్కీమ్ లబ్ధిదారులు సెప్టెంబర్ 30 లోగా జమ చేయాల్సి ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన-APY సబ్స్క్రైబర్లు ఆటోడెబిట్ ఫెసిలిటీ ద్వారా నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకోసారి డబ్బులు జమ చేయొచ్చు.
EPFO KYC: మీ ఈపీఎఫ్ వివరాలు సరిగ్గా ఉన్నాయా? ఆన్లైన్లో అప్డేట్ చేయండిలా
LIC: ఎల్ఐసీ పాలసీ ప్రీమియం కట్టలేదా? రూ.2,500 వరకు తగ్గింపు పొందండి ఇలా
అటల్ పెన్షన్ యోజన-APY పథకం 2015లో ప్రారంభమైంది. ఈ ఐదేళ్లలో 2 కోట్ల 40 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు చేరారు. వృద్ధాప్యంలో పెన్షన్ కోరుకునేవారికి ఉపయోగపడే పథకం ఇది. రూ.1000 నుంచి రూ.5000 మధ్య పెన్షన్ పొందొచ్చు. 18 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వ్యక్తులు ఈ పథకంలో చేరి డబ్బులు జమ చేస్తూ ఉండాలి. 60 ఏళ్ల వయస్సు నుంచి పెన్షన్ లభిస్తుంది. వయస్సు తక్కువగా ఉన్నప్పుడే ఈ స్కీమ్‌లో చేరితే జమ చేయాల్సిన మొత్తం తగ్గుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.