హోమ్ /వార్తలు /బిజినెస్ /

Pension Scheme: ఈ స్కీమ్‌లో ఇప్పటి వరకు 3 కోట్ల మంది చేరారు... మీరూ చేరండి ఇలా

Pension Scheme: ఈ స్కీమ్‌లో ఇప్పటి వరకు 3 కోట్ల మంది చేరారు... మీరూ చేరండి ఇలా

Pension Scheme: ఈ స్కీమ్‌లో ఇప్పటి వరకు 3 కోట్ల మంది చేరారు... మీరూ చేరండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Pension Scheme: ఈ స్కీమ్‌లో ఇప్పటి వరకు 3 కోట్ల మంది చేరారు... మీరూ చేరండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Pension Scheme | కేంద్ర ప్రభుత్వం వృద్ధాప్యంలో ఆర్థికంగా ఆసరాగా నిలిచేందుకు అనేక పెన్షన్ పథకాలను అందిస్తోంది. అందులో ఓ పెన్షన్ స్కీమ్‌లో ఇప్పటివరకు 3 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు చేరారు.

అటల్ పెన్షన్ యోజన... కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పథకం ఇది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు చేరడం విశేషం. 2015 మే లో అటల్ పెన్షన్ యోజన-APY స్కీమ్ ప్రారంభమైంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ-PFRDA ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. అప్పటి నుంచి 2021 మార్చి 25 నాటికి సబ్‌స్క్రైబర్ల సంఖ్య మూడు కోట్లు దాటిందని PFRDA తాజాగా ప్రకటించింది. PFRDA తాజా లెక్కల ప్రకారం ఈ స్కీమ్‌లో నెలకు రూ.50 జమ చేసేవాళ్ల సంఖ్య 38,78,408 కాగా, రూ.51 నుంచి రూ.100 మధ్య జమ చేసేవారి సంఖ్య 98,81,723. ఇక రూ.101 నుంచి రూ.500 మధ్య జమ చేసేవారి సంఖ్య 1,33,45,570. ఈ స్కీమ్‌లో రూ.101 నుంచి రూ.500 మధ్య జమ చేసేవారి సంఖ్యే ఎక్కువ కావడం విశేషం. ఇక రూ.501 నుంచి రూ.1,000 మధ్య జమ చేసేవారి సంఖ్య రూ.21,43,498. ఇక రూ.1001 నుంచి రూ.2000 మధ్య జమ చేసేవారి సంఖ్య 6,46,044. రూ.2001 నుంచి రూ.5000 మధ్య జమ చేసేవారి సంఖ్య 1,18,679, రూ.5000 కన్నా ఎక్కువ జమచేసేవారి సంఖ్య 33,180.

SBI Zero Balance Account: ఈ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు... ఓపెన్ చేయండిలా

Bank Holidays May 2021: మేలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయో తెలుసా?

అటల్ పెన్షన్ యోజన పథకంలో 2020-2021 ఆర్థిక సంవత్సరంలో చేరినవారి సంఖ్య 79 లక్షల పైనే ఉంది. గత ఆరు నెలల్లోనే 50 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరారు. కరోనా వైరస్ సంక్షోభం తర్వాత తమ డబ్బులు దాచుకోవడానికి సురక్షితమైన పథకంతో పాటు, వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందని ఈ పెన్షన్ పథకంలో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనెరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరుతున్నారు. మీరు కూడా ఈ స్కీమ్‌లో చేరాలంటే చాలా సింపుల్. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, డిస్ట్రిక్ట్ కోఆపరేటీవ్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, అర్బన్ కోఆపరేటీవ్ బ్యాంకుల ద్వారా ఈ పథకంలో చేరొచ్చు.

e-PAN Card: ఇ-పాన్ కార్డ్ 10 నిమిషాల్లో తీసుకోవచ్చు... ఈ స్టెప్స్ ఫాలో అవండి

Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా? ఒక్క ఎస్ఎంఎస్‌తో ఆధార్ నెంబర్ లాక్ చేయొచ్చు ఇలా

అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన పథకమే అటల్ పెన్షన్ యోజన. ఈ స్కీమ్‌లో ప్రతీ నెల రూ.42 నుంచి రూ.1,454 మధ్య జమ చేసి రిటైర్మెంట్ వయస్సు నుంచి నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 మధ్య పెన్షన్ పొందొచ్చు. అంటే నెలకు రూ.1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000, రూ.5,000 చొప్పున పెన్షన్ పొందొచ్చు. జమ చేసే మొత్తాన్ని బట్టి ఈ పెన్షన్ మారుతుంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరొచ్చు. ఏ వయస్సులో చేరినా 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డబ్బులు జమ చేయాలి.

First published:

Tags: Atal Pension Yojana, Pension Scheme, Personal Finance

ఉత్తమ కథలు