కేంద్ర ప్రభుత్వం వృద్ధుల కోసం, అట్టడుగు వర్గాల వారి కోసం ఎన్నో కొత్త పథకాలను ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా వృద్ధాప్యంలో స్థిరమైన పెన్షన్ పొందాలనుకునే వారి కోసం అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana) స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ అసంఘటిత కార్మిక రంగంలో పనిచేసే వ్యక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అటల్ పెన్షన్ యోజన (APY) పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిర్వహిస్తుంది. ఇది 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు అందుబాటులో ఉంటుంది. పెన్షన్ మొత్తాన్ని చందాదారులు 60 ఏళ్ల నుంచి అందుకుంటారు. అయితే నెలవారీ పెన్షన్ ఎంత అందుతుందనేది మీ పెట్టుబడి, వ్యవధిపై ఆధారపడి ఉంటుంది.
ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తులకు బ్యాంకు లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఈ స్కీమ్లో చేరిన వారు 60 ఏళ్ల వయసు వచ్చే వరకు ప్రతినెలా క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత, నెలవారీ పెన్షన్ ప్రారంభమవుతుంది. ఈ సామాజిక భద్రతా పథకం కింద పెట్టుబడి, వ్యవధిని బట్టి రూ. 1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడికి ముందు తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే.
Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‍లో రోజూ రూ.50 దాచుకుంటే రూ.35 లక్షల వరకు రిటర్న్స్
ఈ పథకం 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల భారతీయులందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ పథకం కింద కనీసం 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడి కోసం మీ ఆధార్ కార్డ్‌తో లింక్ చేసిన బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి.
APYలో పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80CCD (1) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకం కింద గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షలు పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80C, సెక్షన్ 80CCD కింద కలిపి మినహాయింపు రూ. 2 లక్షలకు మించకూడదు.
SBI KYC Fraud: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్... ఆ లింక్స్ క్లిక్ చేయొద్దని వార్నింగ్
చందాదారులు 18 సంవత్సరాల వయస్సులో ఈ స్కీమ్లో చేరి.. నెలకు రూ. 42 నుంచి రూ. 210 మధ్య ప్రీమియం చెల్లించాలి. తద్వారా 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 1,000 నుంచి రూ. 5,000 మధ్య స్థిరమైన నెలవారీ పెన్షన్ పొందవచ్చు. చందాదారులు 40 సంవత్సరాలకు పథకంలో చేరితే.. నెలకు రూ. 291 నుంచి రూ. 1,454 మధ్య చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు నెలకు రూ. 1000 నుంచి 5000 మధ్య పెన్షన్ లభిస్తుంది.
నెలకు రూ. 3,000 కనీస హామీ పెన్షన్ కోసం, 18 నుంచి 39 సంవత్సరాల వయసు ఉన్న వారు ప్రతినెలా రూ. 126 నుంచి రూ. 792 మధ్య చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా నామినీ రూ. 5.1 లక్షలు పొందే అవకాశం ఉంటుంది.
నెలకు రూ. 4,000 కనీస హామీ పెన్షన్ కోసం, 18 నుంచి 39 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ప్రతినెలా రూ. 168 నుంచి రూ. 1054 మధ్య చెల్లించాల్సి ఉంటుంది. ఎంట్రీ వయసుతో సంబంధం లేకుండా నామినీ రూ. 6.8 లక్షలు పొందే అవకాశం ఉంటుంది.
నెలకు రూ. 5000 కనీస గ్యారెంటీ పెన్షన్ కోసం, 18 నుంచి 39 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ప్రతి నెలా రూ. 210 నుంచి రూ. 1318 మధ్య చెల్లించాల్సి ఉంటుంది. ఎంట్రీ వయసుతో సంబంధం లేకుండా నామినీ రూ. 8.5 లక్షలు పొందే అవకాశం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aasara Pension Scheme, Atal Pension Yojana, Pension Scheme