హోమ్ /వార్తలు /బిజినెస్ /

Government Scheme: నెలకు రూ.80 కట్టండి.. ప్రతి నెలా రూ.2 వేలతో పాటు ఒకేసారి రూ.3.4 లక్షలు పొందండి!

Government Scheme: నెలకు రూ.80 కట్టండి.. ప్రతి నెలా రూ.2 వేలతో పాటు ఒకేసారి రూ.3.4 లక్షలు పొందండి!

Government Scheme: నెలకు రూ.80 కట్టండి.. ప్రతి నెలా రూ.2 వేలతో పాటు ఒకేసారి రూ.3.4 లక్షలు పొందండి!

Government Scheme: నెలకు రూ.80 కట్టండి.. ప్రతి నెలా రూ.2 వేలతో పాటు ఒకేసారి రూ.3.4 లక్షలు పొందండి!

Pension Scheme | మీరు ప్రతి నెలా రూ.2 వేలు పొందాలని చూస్తున్నారా? అంతేకాకుండా ఒకేాసారి రూ.3.4 లక్షలు కూడా లభిస్తాయి. మీరు ఈ స్కీమ్‌లో చేరితే చాలు. దీని వల్ల చాలా మందికి ప్రయోజనం ఉంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

APY Scheme: కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని అందిస్తోంది. 2015 నుంచి ఈ పథకం అమలులో ఉంది. రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా రెగ్యులర్‌గా ఆదాయం పొందాలని భావించే వారికి ఈ స్కీమ్ అనువుగా ఉంటుంది. అసంఘటిత రంగంలోని కార్మికులు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. 60 ఏళ్లు వచ్చిన దగ్గరి నుంచి ప్రతి నెలా పెన్షన్ (Pension) వస్తుంది. అందువల్ల మీరు కూడా ఈ స్కీమ్‌లో (Scheme) చేరితే క్రమం తప్పకుండా ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. అలాగే నామినీకి ఒకేసారి భారీ మొత్తం వస్తుంది.

అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరడం వల్ల నెలకు రూ. 1000, రూ. 2 వేలు, రూ. 3 వేలు, రూ. 4,000, రూ. 5 వేలు చొప్పున పెన్షన్ పొందొచ్చు. మీరు ఎంచుకునే పెన్షన్ ఆప్షన్ ఆధారంగా మీకు మీరు చెల్లించాల్సిన మొత్తం కూడా మారుతుంది. ప్రతి నెలా డబ్బులు కడుతూ వెళ్లాలి. ఇలా ఈ స్కీమ్‌లో చేరిన వ్యక్తి మరణిస్తే.. అప్పుడు నామినీకి పూర్తి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారు.

ఉద్యోగులకు శుభవార్త.. అవసరానికి ఈజీగా డబ్బు పొందండిలా, రూ.1 తిరిగి కట్టక్కర్లేదు!

స్కీమ్‌లో చేరిన వ్యక్తికి ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. ఒకేవేళ స్కీమ్‌లో చేరిన వ్యక్తి మరణిస్తే.. అప్పుడు వారి భాగస్వామికి ఆ పెన్షన్ మొత్తంలో సగాన్ని చెల్లిస్తారు. ఒకవేళ ఇద్దరూ మరణిస్తే.. అప్పుడు నామినీకి స్కీమ్ డిపాజిట్ మొత్తాన్ని పూర్తి చెల్లిస్తారు. ఇలా ఈ స్కీమ్‌లో చేరడం వల్ల ముగ్గురికీ ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు.

ఈ క్రెడిట్ కార్డు వాడే వారికి బంపరాఫర్.. రూ.12 వేలకు పైగా తగ్గింపు!

ఉదాహరణకు మీకు 18 ఏళ్లు ఉన్నాయని అనుకుంటే.. మీరు 42 ఏళ్ల పాటు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మీకు 60 ఏళ్ల నుంచి పెన్షన్ వస్తుంది. మీరు నెలకు రూ. 42 చెల్లిస్తే సరిపోతుంది. ప్రతి నెలా రూ.1000 పెన్షన్ వస్తుంది. మీరు రూ. 1000 పెన్షన్ ఆప్షన్ ఎంచుకుంటే.. సబ్‌స్క్రైబర్ మరణం తర్వాత నామినీకి ఒకేసారి రూ. 1.7 లక్షలు వస్తాయి.

అదే మీరు ఒకవేళ రూ. 2 వేలు పెన్షన్ కావాలని భావిస్తే.. అప్పుడు ప్రతి నెలా చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతుంది. అప్పుడు మీరు నెలకు రూ. 84 కట్టాల్సి వస్తుంది. ఇంకా సబ్‌స్కైబర్ మరణించిన తర్వాత నామినీకి రూ. 3.4 లక్షలు అందజేస్తారు. అందువల్ల ఒక స్కీమ్ ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఇంకా మీరు అధిక పెన్షన్ కోరుకుంటే ఇంకాస్త డబ్బులు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అలాగే నామినీకి సబ్‌స్క్రైబర్ మరణం తర్వాత అధిక డబ్బులు లభిస్తాయి.

First published:

Tags: Atal Pension Yojana, Central scheme, Money, Pensions

ఉత్తమ కథలు