ATAL PENSION YOJANA ENROLMENTS CROSSED 65 LAKHS IN CURRENT FINANCIAL YEAR KNOW HOW TO GET RS 60000 PENSION WITH THIS SCHEME SS
Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్ ఇచ్చే స్కీమ్... 9 నెలల్లో 65 లక్షల మంది చేరారు
Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్ ఇచ్చే స్కీమ్... 9 నెలల్లో 65 లక్షల మంది చేరారు
(ప్రతీకాత్మక చిత్రం)
Pension Scheme | ఇటీవల పెన్షన్ పథకాలపై ప్రజల్లో ఆసక్తి బాగా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఓ పెన్షన్ పథకం ప్రతీ నెలా రూ.5,000 వరకు పెన్షన్ (Monthly Pension) అందిస్తోంది. ఈ స్కీమ్ వివరాలు తెలుసుకోండి.
మీరు ఏదైనా పెన్షన్ స్కీమ్‌లో చేరాలనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ పెన్షన్ స్కీమ్ బాగా పాపులర్ అవుతోంది. కేవలం గత 9 నెలల్లో 65 లక్షల మంది ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరారు. ఈ స్కీమ్ పేరు అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana). ఈ స్కీమ్ గురించి వినే ఉంటారు కానీ... ఈ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాల గురించి తెలిసింది తక్కువే. 2015 మే 9న ఈ స్కీమ్ ప్రారంభమైననాటి నుంచి ఇప్పటి వరకు అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరిన వారి సంఖ్య 3.68 కోట్లు దాటింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి వరకు ఈ స్కీమ్‌లో చేరినవారి సంఖ్య 65 లక్షలు. ఈ ఏడాది మార్చి 31 నాటికి కోటి మందిని ఈ పథకంలో చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) అటల్ పెన్షన్ యోజన పథకాన్ని మేనేజ్ చేస్తుంది. ప్రస్తుతం రూ.20,000 కోట్ల ఆస్తుల్ని మేనేజ్ చేస్తోంది ఈ సంస్థ. వృద్ధాప్యంలో పెన్షన్ పొందాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు గవర్నమెంట్ పెన్షన్ ఎలాగూ ఉంటుంది. ఇక ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ నుంచి పెన్షన్ వస్తుంది. ఇతర వర్గాలకు కూడా పెన్షన్ ప్రయోజనాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించడం విశేషం. అసంఘటిత రంగ కార్మికులతో పాటు ఇతర ఉద్యోగాలు చేసేవారు ఎవరైనా ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరొచ్చు.
అటల్ పెన్షన్ యోజన పథకంలో 18 నుంచి 40 లోపు వయస్సు ఉన్నవారు చేరొచ్చు. ప్రతీ నెలా కొంత మొత్తాన్ని ఈ పథకంలో జమ చేస్తూ ఉండాలి. వారి వయస్సు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతీ నెలా పెన్షన్ అందుకుంటారు. అయితే పెన్షన్ ఎంత పొందుతారన్నది ప్రతీ నెలా జమ చేసిన మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ. 1,000 నుంచి రూ.5,000 మధ్య పెన్షన్ పొందొచ్చు. మరి ఎంత జమ చేస్తే ఎంత పెన్షన్ వస్తుందో ఈ చార్ట్ చూసి తెలుసుకోండి.
వయస్సు
రూ.1,000 పెన్షన్ కోసం ప్రతీ నెల జమ చేయాల్సిన మొత్తం
రూ.2,000 పెన్షన్ కోసం ప్రతీ నెల జమ చేయాల్సిన మొత్తం
రూ.3,000 పెన్షన్ కోసం ప్రతీ నెల జమ చేయాల్సిన మొత్తం
రూ.4,000 పెన్షన్ కోసం ప్రతీ నెల జమ చేయాల్సిన మొత్తం
రూ.4,000 పెన్షన్ కోసం ప్రతీ నెల జమ చేయాల్సిన మొత్తం
ఈ పథకంలో జమ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ పథకంగా ద్వారా గరిష్టంగా సంవత్సరానికి రూ.60,000 పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో చేరిన వ్యక్తి పెన్షన్ తీసుకుంటున్న సమయంలో మరణిస్తే వారి జీవిత భాగస్వామికి పెన్షన్ లభిస్తుంది. ఇద్దరూ మరణిస్తే పెన్షన్ కార్పస్‌ను నామినీకి అందిస్తారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.