కరోనా సంక్షోభంలో జాబ్ పోయినవారికి ప్రభుత్వ సాయం... రూల్స్ మార్చిన కేంద్రం

Atal Bimit Vyakti Kalyan Yojana | కేంద్ర ప్రభుత్వం ఇటీవల అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకంలో అనేక నియమనిబంధనల్ని మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఊరట కల్పించింది.

news18-telugu
Updated: November 13, 2020, 6:27 PM IST
కరోనా సంక్షోభంలో జాబ్ పోయినవారికి ప్రభుత్వ సాయం... రూల్స్ మార్చిన కేంద్రం
కరోనా సంక్షోభంలో జాబ్ పోయినవారికి ప్రభుత్వ సాయం... రూల్స్ మార్చిన కేంద్రం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ సంక్షోభ కాలంలో ఉద్యోగం కోల్పోయినవారిని అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకంతో ఆదుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం గతంలోనే ప్రారంభించినా కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో నియమనిబంధనల్ని సడలించింది ప్రభుత్వం. వీలైనంత ఎక్కువ మంది లబ్ధి పొందేలా నియమనిబంధనల్ని మారుస్తోంది. సడలించిన నిబంధనలు 2020 డిసెంబర్ 31 వరకే వర్తిస్తాయని మొదట చెప్పినా కొద్ది రోజుల క్రితం ఈ పథకాన్ని 2021 జూన్ 30 వరకు పొడిగించింది. ఇక ఇప్పుడు మరో ఊరట కల్పించింది. ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు ఇకపై అఫిడవిట్ ఫామ్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC ఫ్రకటించింది. అఫిడవిట్ సబ్మిట్ చేయడంలో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున కేంద్ర కార్మిక, ఉపాధి సంక్షేమ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈఎస్ఐసీ ప్రకటించింది. అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో క్లెయిమ్స్ సబ్మిట్ చేసి, ఆధార్ కార్డ్, బ్యాంకు వివరాలు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అఫిడవిట్ ఫామ్ అవసరం లేదు. అన్ని డాక్యుమెంట్స్ ప్రింట్ తీసుకొని సంతకం చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసిన 5 రోజుల్లోనే లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బు జమ అవుతుంది.

SBI Credit Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు తీసుకుంటే రూ.6500 బెనిఫిట్స్

EPF Balance: రెండు రోజుల్లో ఈపీఎఫ్ వడ్డీ మీ అకౌంట్‌లోకి... బ్యాలెన్స్ చెక్ చేయండి ఇలా

అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం వివరాలు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను 2018 జూలై 1న ప్రారంభించింది. ఉద్యోగాలు కోల్పోయిన ఈఎస్ఐ సబ్‌స్క్రైబర్లను ఆర్థికంగా ఆదుకోవడం కోసం రూపొందించిన పథకం ఇది. ఈ స్కీమ్ ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా బీమా పొందిన సంఘటిత రంగ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఈఎస్ఐసీ చట్టం, 1948 లోని సెక్షన్ 2(9) ప్రకారం జీవితంలో ఒకసారి ఈ పథకం ద్వారా ప్రయోజనాలు పొందొచ్చు. ఈఎస్ఐ సబ్‌స్క్రైబర్ ఉద్యోగం కోల్పోతే 90 రోజుల వేతనంలో 25 శాతం వేతనం అందించడమే ఈ పథకం లక్ష్యం. కరోనా సంక్షోభకాలంలో బెనిఫిట్‌ను 50 శాతానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇక గత నిబంధనలు చూస్తే ఉద్యోగం పోయిన 90 రోజుల తర్వాతే క్లెయిమ్‌కు అప్లై చేయాలి. కానీ కరోనా సంక్షోభ కాలంలో ఉద్యోగం కోల్పోయిన 30 రోజుల తర్వాత పథకం ద్వారా సాయం పొందొచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సడలించిన నిబంధనలన్నీ 2021 జూన్ 30 వరకు వర్తిస్తాయి. ఆ తర్వాత మళ్లీ పాత రూల్స్ అమలులోకి వస్తాయి.

ECLGS స్కీమ్ గడువు పెంపు... మోదీ ప్రభుత్వం ఇచ్చే రుణాలు తీసుకోండి ఇలా

Bank Account: అలర్ట్... బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు డిసెంబర్ 31 లోగా ఈ పని చేయాల్సిందే

రెండేళ్లుగా ఉద్యోగం చేస్తున్నవారే క్లెయిమ్‌కు దరఖాస్తు చేయడానికి అర్హులు. ఈఎస్ఐలో కంట్రిబ్యూషన్ కొనసాగుతూ ఉండాలి. ఉద్యోగుల బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందాలంటే https://www.esic.nic.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
Published by: Santhosh Kumar S
First published: November 13, 2020, 6:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading