హోమ్ /వార్తలు /బిజినెస్ /

Indian Banks: ఇండియన్ బ్యాంకులకు రూ.60వేల కోట్ల లాభాలు.. ఒక త్రైమాసికంలో రికార్డు స్థాయి ఆదాయం

Indian Banks: ఇండియన్ బ్యాంకులకు రూ.60వేల కోట్ల లాభాలు.. ఒక త్రైమాసికంలో రికార్డు స్థాయి ఆదాయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇండియన్‌ కమర్షియల్‌ బ్యాంకులు అన్నీ కలిసి దాదాపు రూ.60,000 కోట్ల లాభాలను ఆర్జించాయి. గత ఏడాది కాలంలో నమోదైన రూ.37,567 కోట్ల నెట్‌ కంటే ప్రాఫిట్ ఏకంగా 59 శాతం పెరిగింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Indian Banks: ప్రస్తుతం ప్రపంచ స్టాక్‌మార్కెట్‌లు పెద్దగా రాణించడం లేదు. అన్నింటికంటే ఇండియన్‌ స్టాక్‌మార్కెట్ మెరుగైన స్థితిలో ఉంది. ఫారెన్‌ ఇన్వెస్టర్లు కూడా ఇండియన్‌ మార్కెట్‌ను మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఇటీవల ఇండియన్‌ కమర్షియల్‌ బ్యాంకులు(Indian commercial banks) పోస్ట్ చేసిన రిజల్ట్స్‌ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇండియన్‌ కమర్షియల్‌ బ్యాంకులు అన్నీ కలిసి దాదాపు రూ.60,000 కోట్ల లాభాలను ఆర్జించాయి. గత ఏడాది కాలంలో నమోదైన రూ.37,567 కోట్ల నెట్‌ కంటే ప్రాఫిట్ ఏకంగా 59 శాతం పెరిగింది. భారతీయ బ్యాంకులు ఒక త్రైమాసికంలో అందుకున్న అత్యధిక లాభాలు ఇవే కావడం గమనార్హం.

ఆల్‌టైం హై దగ్గర బ్యాంక్ నిఫ్టీ

ప్రధాన బ్యాంకులు శనివారం తమ రిజల్ట్స్‌ను పోస్ట్‌ చేసిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ సూచీ సోమవారం 41,779కి చేరుకుంది. హిస్టారిక్‌ హై 41,840కి అతి చేరువలో ఉంది. ప్రైవేట్ బ్యాంకులు కలిసి రూ.33,165 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి. అంతకుముందు సంవత్సరంలో సాధించిన రూ.19,868 కోట్ల కంటే ఇది దాదాపు 67 శాతం ఎక్కువ. ప్రభుత్వ రంగ బ్యాంకులు రెండో త్రైమాసికంలో ఏకంగా రూ.25,685 కోట్ల నెట్‌ లాభాలను అందుకున్నాయి. ఇది ఆర్థిక సంవత్సరం 2022లో రూ.17,123 కోట్ల నుంచి 50 శాతం పెరిగింది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల రికార్డు ఫలితాల గురించి ట్వీట్ చేశారు. నిరర్ధక ఆస్తులను (NPA) తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషితో ఈ స్థాయి ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. 2016 నుంచి అనేక త్రైమాసికాల్లో పారిశ్రామిక సంస్థలకు మొండి బకాయిల కోసం కేటాయింపులు చేయడంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు మునుపటి సంవత్సరాలలో రికార్డు నష్టాలను చవిచూశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో లాభాలు రూ.40,991 కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2022 ప్రథమార్థంలో సాధించిన రూ.31,290 కోట్ల కంటే 31 శాతం ఎక్కువ.

Car Manufacturers: ఫెస్టివల్ సీజన్‌లో పెరిగిన కార్ల అమ్మకాలు.. అక్టోబర్‌ సేల్స్‌లో టాప్‌-10 కంపెనీలు ఇవే..

 ఎస్బీఐ రికార్డు

బ్యాంకుల లాభాల్లో సగానికి పైగా షేర్ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)దే ఉంది. ఎస్‌బీఐ అత్యధికంగా రూ.13,256 కోట్లను ఆర్జించింది. ఇది గత సంవత్సరం కంటే 74 శాతం ఎక్కువ. ఈ త్రైమాసికంలో ఎక్కువ లాభాలు సాధించిన బ్యాంక్‌గా ఎస్‌బీఐ నిలిచింది. ఎస్‌బీఐ కన్సాలిడేటెడ్ నెట్‌ ప్రాఫిట్‌ రూ.14,752 కోట్లు కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.13,656 కోట్లతో నిలిచింది.

రాణించిన ప్రైవేట్‌ బ్యాంకులు

ప్రైవేట్ రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 20 శాతం వృద్ధితో రూ.10,605 కోట్ల నెట్‌ ప్రాఫిట్‌ను ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ 37 శాతం వృద్ధితో రూ.7,758 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ 70 శాతం వృద్ధితో రూ.5,330 కోట్లు, కోటక్ బ్యాంక్ 27 శాతం వృద్ధితో రూ.2,581 కోట్లు లాభాన్ని నమోదు చేశాయి. ప్రభుత్వం పెట్టుబడులు

ప్రస్తుత త్రైమాసికంలో క్రెడిట్‌ పెరుగుదలతో లాభాలుసాధ్యమయ్యాయి. క్రెడిట్‌ దాదాపు 20 శాతం పెరిగింది. ఆర్‌బీఐ రేట్ పెంపులకు అనుగుణంగా బ్యాంకులు తమ వడ్డీ రేటును సవరించాయి. రుణ రేట్ల పెంపుదలకు అనుగుణంగా డిపాజిట్ల వ్యయం పెరగకపోవడంతో బ్యాంకులు తమ మార్జిన్లను మెరుగుపరుచుకున్నాయి.

First published:

Tags: Indian banks, Profits

ఉత్తమ కథలు